
నందిగామ: ఓ పేద విద్యార్థికి గవర్నర్ తమిళిసై చేయూతనిచ్చారు. అతడి ఆర్థిక దుస్థితికి చలించి కడుపునిండా భోజనం పెట్టి ఓ ల్యాప్‌టాప్ అందజేశారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామానికి చెందిన బియ్యని ప్రమోద్ మొయినాబాద్ సమీపంలోని జోగినపల్లి బీఆర్ ఫార్మసీ కళాశాలలో ఫార్మ్ డి తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిం చే ‘మై గవర్నమెంట్ యాప్’లో క్విజ్ పోటీలలో పాల్గొంటుంటాడు. అతడికి ల్యాప్‌టాప్ కొనే ఆరి్థక స్థోమత లేకపోవడంతో తన సమస్యను వివరిస్తూ రాజ్‌భవన్‌కు మెయిల్ చేశాడు. దీంతో ఆదివారం గవర్నర్ కార్యాలయం నుంచి అతడికి పిలుపు వచ్చింది. సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ చేతుల మీదుగా ల్యాప్‌ట్యాప్‌ను అందుకున్నాడు.
చదవండి:
విమర్శించిన వారి నోళ్లు మూతపడ్డాయి: గవర్నర్