
ల్యాప్ టాప్ పగలగొట్టిన శిఖర్
కోల్‌కతా :
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయిన విషయం తెలిసిందే. కోల్‌కతా జట్టు 17 పరుగుల తేడాతో నెగ్గింది. 173 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ తడబడింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా ఓపెనర్ శిఖర్ ధావన్ కొట్టిన భారీ షాట్కు సన్‌రైజర్స్ జట్టుకు చెందిన కీలక ల్యాప్‌టాప్ పగిలిపోయింది.
దానిలో జట్టకు సంబంధించి కీలక సమాచారం ఉన్నట్టు సమాచారం. సన్‌రైజర్స్ సభ్యులు బౌండరీ లైన్ అవతల ల్యాప్‌టాప్‌ను ఒక టేబుల్‌పై ఉంచుకుని పరిశీలిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ట్రెంట్ బౌల్ట్ వేసిన బంతిని శిఖర్ ధావన్ భారీ షాట్ కొట్టాడు. బంతి వేగంగా వచ్చి ల్యాప్‌టాప్ వెనక భాగాన్ని ఢీకొట్టింది. దీంతో స్క్రీన్ బద్దలైపోయింది. ఆ సమయంలో ల్యాప్‌టాప్ ముందు కూర్చుని ఉన్న విశ్లేషకుడు శ్రీనివాస్ ల్యాప్‌టాప్‌ను వదిలేసి పక్కకు వచ్చేశాడు. దీంతో పక్కనే ఉన్న సన్‌రైజర్స్ మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ అతనిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఎంతపని చేశాడో చూడండి అన్నట్టు కోచ్ టామ్ మూడీ, యువీ వైపు లక్ష్మణ్ చేయి చూపించాడు.