భారత కస్టమర్ పేరును వక్రీకరిస్తూ కెనడాకు చెందిన ‘డీబ్రాండ్’ కంపెనీ చేసిన ట్వీట్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో చేసేదేమిలేక కంపెనీ క్షమాపణలు చెబుతూ గుడ్‌విల్ కింద 10వేల డాలర్లను ఆఫర్ చేసింది. ఇకనుంచి కస్టమర్లపై జోకులు వేసేముందు మరింత జాగ్రత్తగా ఉంటామని చెప్పడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. భువన్ చిత్రాంశ్ అనే భారత వ్యక్తి ఇటీవల కెనడాకు చెందిన డీబ్రాండ్ అనే ఎలక్ట్రానిక్స్ యాక్సెసరీస్ కంపెనీ నుంచి యాపిల్ మ్యాక్‌బుక్ స్క్రీన్‌పై భాగంలో ఉండే కవర్‌ను కొనుగోలు చేశారు. రెండు నెలలు అవ్వకముందే ఆ కవర్ రంగు వెలిసిపోయింది. దాంతో ‘ఎక్స్’ వేదికగా కంపెనీ అధికారిక అకౌంట్‌ను ట్యాగ్ చేస్తూ తన సమస్య తెలిసేలా ఫిర్యాదు చేశాడు.
ఈ వ్యవహారంపై డీబ్రాండ్ విచిత్రంగా స్పందించింది. అతడి పేరు చిత్రాంశ్.. అయితే ‘షిట్ రాష్’ అని విపరీతార్థం వచ్చేలా రాసింది. అతడి పేరులోని అక్షరాలను అలా మార్చి రాయడంపట్ల నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తూ ట్వీట్ చేశారు. భారతీయుడి పేరుపై వెటకారపు వ్యాఖ్యలు చేయడం తగదంటూ తీవ్రంగా స్పందించారు. చిత్రాంశ్ కంపెనీ ట్వీట్‌కు ప్రతిస్పందనగా భారత్ కస్టమర్లపై కొన్ని రాసిస్ట్ కంపెనీల దృక్పథం ఎలా ఉందో తెలిసిపోయిందని తెలియజేస్తూ పీఎం మోదీ, కామర్స్ మినిస్టర్ పీయుష్‌గోయల్ అకౌంట్‌ను ట్యాగ్ చేశాడు.
ఇదీ చదవండి: కొత్త ఏఐ ల్యాప్‌టాప్‌లు.. ప్రత్యేకత ఏంటో తెలుసా..
దాంతో కంపెనీ స్పందించి కస్టమర్ పేరును వక్రీకరించామని అంగీకరించింది. దీన్ని అతిపెద్ద తప్పిదంగా భావిస్తూ క్షమాపణ కోరింది. గుడ్‌విల్ కింద 10,000 డాలర్లు చిత్రాంశ్‌కు ఆఫర్ చేసింది. అయితే, ఇలా కస్టమర్లతో సరదాగా జోకులు వేయడం దాదాపు దశాబ్దకాలంగా చేస్తున్నామని కంపెనీ తెలిపింది. ఇలా యూజర్లపై సరదాగా జోకులు వేయడం మాత్రం ఆపబోమని చెప్పింది. అంతటితో ఆగకుండా తర్వాత 10,000 డాలర్లను అందుకోబోయేది మీలో ఒకరు కావచ్చంటూ ట్వీట్ చేసింది.
Well that escalated quickly.
— dbrand (@dbrand) April 10, 2024
1. Yes - we made fun of a guy's name. It was a huge fumble.
2. We apologized to him directly and offered him $10,000 as a gesture of goodwill.
3. We've been poking fun at customers on social media for over a decade now. We're not going to stop, but…
Comments
Please login to add a commentAdd a comment