ఆ ల్యాప్ టాప్ ధర రూ 1.19 లక్షలు | Sakshi
Sakshi News home page

ఆ ల్యాప్ టాప్ ధర రూ 1.19 లక్షలు

Published Wed, Jun 22 2016 6:42 PM

ఆ ల్యాప్ టాప్ ధర రూ 1.19 లక్షలు

ప్రపంచంలోనే అతి పలుచనైన ల్యాప్ టాప్ ను హెచ్పీ మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. 13 ఇంచ్ల డిస్ ప్లే స్క్రీన్ తో కూడిన వచ్చిన హెచ్పీ అతి పలుచని ల్యాప్ టాప్ ల శ్రేణిలో ఉత్తమ ఫీచర్లను అందిస్తోంది. ప్రాసెసర్ ను ఎక్కువ వేడిమి నుంచి కాపాడేందుకు హెచ్ పీ ప్రత్యేకంగా తయారు చేసిన హీట్ పైప్ను ఇందులో అమర్చారు. దీనికి తోడు అదనంగా మరో రెండు కూలింగ్ ఫ్యాన్ లను జత చేయడంతో ఎక్కువ వేడిమి నుంచి ప్రాసెసర్ ను రక్షించుకునేందుకు అవకాశం ఏర్పడింది. మిగతా నోట్ బుక్ లకు విరుద్ధంగా కోర్ ఎమ్ ప్రాసెసర్ కు బదులు కోర్ ఐ5, ఐ7లను హెచ్పీ వినియోగించింది.

ల్యాప్ టాప్ లో ఎక్కువ భాగాన్ని అల్యూమినియంతో తయారు చేయగా.. అడుగు భాగాన్ని తయారుచేసేందుకు కార్బన్ ఫైబర్ ను వినియోగించారు. మిగిలిన ల్యాప్ టాప్ లతో పోల్చితే కొత్త డిజైన్ ను వినియోగదారులకు అందించేందుకు హింజ్ టైప్ ఎడ్జ్ ను రూపొందించారు. మూడు యూఎస్ బీ టైప్-సీ పోర్టులతో హెచ్పీ స్పెక్టర్ లభ్యం కానుంది. మ్యాక్ బుక్ విడుదల చేసిన అతి పలుచని ల్యాప్ టాప్ తో హెచ్ పీ పోల్చి చూస్తే హెచ్పీ ల్యాప్ టాప్ మరింత పలుచగా కనిపిస్తుంది. కాగా, భారతదేశంలో దీని ధరను రూ.1,19,000లుగా నిర్ణయించింది.

ఫీచర్స్:
1. 10.4 మిమీల అతి పలుచనైన ల్యాప్ టాప్
2. కేవలం 1.11 కిలోల బరువు
3. 13.3 ఇంచ్ ల డిస్ ప్లే
4. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్
5. ఇంటెల్ కు చెందిన ఆరవ తరం ప్రాసెసర్లు
6. యూఎస్ బీ టైప్-సీ పోర్టులు

Advertisement
 
Advertisement