thinnest
-
అతి పలుచని వాచీ
ప్రపంచంలోనే అతి పలుచని చేతి గడియారాన్ని తయారు చేయడానికి యూరోపియన్ హోరాలజీ దిగ్గజాలన్నీ తెగ పోటీ పడుతుంటేం రష్యాకు చెందిన ఓ స్వతంత్ర వాచ్ మేకర్ ఆ అద్భుతాన్ని సాధించేశాడు. ప్రతిష్ఠాత్మక అకాడెమీ హోర్లోగెర్ డెస్ క్రిటెపెండెంట్స్ ఇండిపెండెంట్స్లో ఏకైక రష్యన్ సభ్యుడైన కాన్స్టాంటిన్ చైకిన్ అనే వ్యక్తి అత్యంత పలుచనైన చేతి గడియారాన్ని రూపొందించారు. దీని మందం కేవలం 1.65 మిల్లీమీటర్లు. బరువైతే 13.3 గ్రాములే! ఆ లెక్కన ప్రపంచంలోనే అతి తేలికైన గడియారమూ ఇదే. గత వారం స్విట్జర్లాండ్‌లో జరిగిన ‘జెనీవా వాచ్ డేస్ ఫెయిర్’లో ఈ వాచీని ప్రదర్శించారు. స్టెయిన్లెస్ స్టీల్, టంగ్స్టన్ కార్బైడ్ వాడటంతో ఇది తేలిగ్గా ఉన్నా చాలా దృఢంగా ఉంటుంది.కాగితం ముక్కంత పలుచన.. విశ్వసనీయమైన, ఖచి్చతమైన, ధరించేంత మన్నికైన అ్రల్టా–స్లిమ్ గడియారాలను ఉత్పత్తి చేయడం ప్రపంచంలోని గడియారాల తయారీదారులకు ఓ సవాలుగా ఉండేది. కానీ ఇటీవలి కాలంలో పలుచని గడియారాల తయారీ పోటీ ఊపందుకుంది. స్విస్ బ్రాండ్ పియాజెట్ 2018లో 2 మిల్లీమీటర్ల మందం కలిగిన గడియారాన్ని తయారు చేసింది. ఇది రెండేళ్ల తరువాత ఉత్పత్తిలోకి వచి్చంది. లగ్జరీ దిగ్గజం బుల్గారి కేవలం 1.8 మిల్లీమీటర్ల మందంతో వాచీని తెచ్చింది. వీటిని తలదన్నుతూ వాచ్ మేకర్ రిచర్డ్ మిల్లే 2022లో కాగితం ముక్కంత పలుచనైన గడియారాన్ని తయారు చేసింది. దాని ఖరీదు 500,000 డాలర్లకు పై చిలుకే! పాకెట్ వాచ్ ప్రేరణతో... 2003లో తన పేరుతోనే వాచ్ మేకింగ్ బ్రాండ్ స్థాపించిన చైకిన్ 20 ఏళ్ల క్రితం 19వ శతాబ్దానికి చెందిన బాగ్నోలెట్ పాకెట్ వాచ్‌ను చూసి పలుచని వాచీలపై ఆసక్తి పెంచుకున్నాడట. సొంతంగా అల్ట్రాథిన్ వాచ్ డిజైన్ చేయాలని ఒక క్లయింట్ సవాలు చేయడంతో రంగంలోకి దిగాడు. ఇప్పుడు తయారు చేసిన బుల్లి వాచీకి మున్ముందు నీలమణి లేదా వజ్రాలను పొదిగే ఆలోచన ఉందట! అనేక పేటెంట్లకు దరఖాస్తులు చేసినా ఇంకా ఏదీ ఖరారు కాలేదని చెప్పుకొచ్చాడు. వచ్చే ఏప్రిల్‌లో జెనీవాలో జరిగే వాచ్స్ అండ్ వండర్స్ ట్రేడ్ షోలో తన డిజైన్ తుది వెర్షన్‌ను సమరి్పస్తానని చెబుతున్నాడు. అప్పటికల్లా తన డిజైన్ మరింత కచ్చితత్వం, పవర్ సంతరించుకుంటుందని చెప్పాడు. ఈ వాచీకి ఇంకా ధర నిర్ణయించలేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ విషయంలో షావోమీ రికార్డ్‌ను బ్రేక్ చేయనున్న ఐఫోన్!
ఖరీదైన ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ( iPhone 15 Pro Max) ఫోన్‌ను త్వరలో విడుదల చేయనుంది. అయితే ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్ల ఫ్రంట్ గ్లాస్‌కు సంబంధించిన వీడియోలు ఇటీవల ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఇందులో స్క్రీన్ బెజెల్ చాలా సన్నగా ఉన్నట్లు తెలుస్తోంది. డిస్ప్లే స్క్రీన్కు చుట్టూ ఫోన్ ఫ్రేమ్‌కు మధ్య ఉన్న అంచును స్క్రీన్ బెజెల్ అని అంటారు. ఇదీ చదవండి: యాపిల్ దిమ్మతిరిగే టెక్నాలజీ.. మడత ఐఫోన్లు కింద పడినా ఏమీ కావు! ఈ స్క్రీన్ బెజెల్ విషయంలో షావోమీ రికార్డ్‌ను ఐఫోన్ అధిగమించనుంది. షావోమీ (Xiaomi) 13 స్క్రీన్ బెజెల్ 1.81 ఎంఎం. ఇప్పటివరకూ ఇదే అతి సన్నని బెజెల్. ఇప్పుడు ఈ రికార్డ్‌ను యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ బద్ధలుకొట్టబోతోంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ ఫోన్ బెజెల్ వెడెల్పు 1.55 ఎంఎం ఉంటుందని టిప్‌స్టర్ ఒకరు ట్విటర్లో షేర్ చేశారు. ఆల్వేస్ ఆన్, ప్రో మోషన్ వంటి డిస్ప్లే ఫీచర్లను యాపిల్.. రాబోయే ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లకు పరిమితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే Wi-Fi 6E నెట్వర్క్ ఐఫోన్ 15 ప్రో మోడళ్లకు మాత్రమే సపోర్ట్ చేస్తుందని పుకారు వచ్చింది. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లలో హాప్టిక్ ఫీడ్‌బ్యాక్‌తో కూడిన సాలిడ్ స్టేట్ బటన్లు, టైటానియం ఫ్రేమ్, అధిక ర్యామ్ వంటి కొత్త ఫీచర్లు ఉండొచ్చని తెలుస్తోంది. iPhone 15 Pro Max will break the record of 1.81mm bezel black edge held by Xiaomi 13, and we measure that its cover plate black bezel width is only 1.55 mm.(S22 and S23 ≈1.95mm,iPhone 14 Pro 2.17mm) pic.twitter.com/9TBrVCGSCo — Ice universe (@UniverseIce) March 17, 2023 -
యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచిన బుల్గారీ
ఇటలీకి చెందిన ప్రముఖ వాచీల తయారీ సంస్థ బుల్గారీ తాజాగా సరికొత్త ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచంలోకెల్లా అత్యంత తక్కువ మందంగల మెకానికల్ చేతి గడియారాన్ని రూపొందించి యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ద బుల్గారీ ఆక్టో ఫినిస్సిమో అల్ట్రా పేరిట మార్కెట్లోకి విడుదల చేసిన ఈ ప్రత్యేక ఎడిషన్ వాచీ మందం ఎంతో తెలుసా.. 1.8 మిల్లీమీటర్లు మాత్రమే! దీన్ని మరోలా చెప్పాలంటే ఈ వాచీ మందం యూరో, ఆస్ట్రేలియా, అమెరికా కరెన్సీలకు చెందిన 10, 20, 5 సెంట్ల నాణేలకన్నా తక్కు వగా ఉండటం విశేషం. ఈ వాచీలో ఇదొక్కటే ప్రత్యేకత కాదండోయ్... దీని డిజైన్ మొదలు అందులో వాడిన పదార్థాల వరకు అన్నీ విభిన్నమైనవే. అష్టభుజి ఆకారం లోని ఈ వాచీ చట్రం, బ్రేస్‌లెట్‌ను టైటానియంతో, అడుగు భాగాన్ని టంగ్స్టన్ కార్బైడ్తోనూ తయారు చేశారు. వాచీ లోని చక్రాలను మాత్రం స్టెయిన్లెస్ స్టీల్‌తో రూపొందించారు. మొత్తం 170 పరికరాలు ఈ వాచీలో ఉన్నాయి. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే వాచీలో ఒక క్యూఆర్ కోడ్‌నుకూడా నిక్షిప్తం చేశారు. ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే వాచీ విశిష్టతలు తెలియజేయడంతోపాటు 3డీ వర్చువల్ వరల్డ్‌లోకి అనుసంధానమయ్యే ఏర్పాటు ఉంది. ఇంతటి సంక్లిష్టమైన వాచీ తయారీకి బుల్గారీ కంపెనీకి మూడేళ్ల సమయం పట్టిందట. ఇంతకీ దీని ధర ఎంత అంటారా? కేవలం రూ. 3.35 కోట్లు మాత్రమే! అది కూడా ఆక్టో ఎడిషన్ కింద కేవలం 10 వాచీలనే రూపొందించింది. అన్నట్టు.. ఈ సంస్థకు వివిధ తరహా వాచీలకు సంబంధించి ‘అత్యంత పలచని’విభాగంలో ఇది ఎనిమిదో ప్రపంచ రికార్డు అట! – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
మిరాకిల్ : ఆ ‘చిన్నోడు’ బావున్నాడు
టోక్యో : పుట్టినప్పుడు కేవలం 268 గ్రాముల బరువుతో పుట్టి ప్రపంచంలోని అతి చిన్న బాలుడిగా రికార్డుకెక్కిన చిన్నోడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అన్ని అవరోధాలను అధిగమించి 3,238 గ్రాముల మేర శరీర బరువును పెంచుకుని క్షేమంగా ఆసుపత్రినుంచి డిశ్చార్చ్ అయ్యి పిల్ల కాదు పిడుగు అని నిరూపించుకున్నాడు. ఈ చిన్నోడు పూర్తి ఆరోగ్యంతో గత బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని జపాన్ టైమ్స్ నివేదించింది. టోక్యోలోని కీయో యూనివర్శిటీ సమాచారం ప్రకారం ప్రపంచంలోనే అతి చిన్నోడు గత ఏడాది ఆగస్టులో పుట్టాడు. తల్లి 24 వారాల గర్భంతో ఉన్న సమయంలో ఎలాంటి ఎదుగుదల లేకపోవడంతో సిజేరియన్ ఆపరేషన్ చేశారు. ఆ సమయంలో అతని బరువును గమనించిన వైద్యులు ఆ శిశువు బతికి బట్టకడతాడనే ఆశని దాదాపు వదిలేశారు. అయితే సుమారు 7 నెలల పాటు రకరకాల చికిత్సలు, ఆపరేషన్లు చేసి బాలుడిని ఎట్టకేలకు బతికించారు. 2009 జర్మనీలో 274 గ్రాముల బరువున్న శిశువు పుట్టి అప్పట్లో వాల్డ్ లోనే ‘అతి చిన్నోడి’ గా పాపులర్ అయిన బేబీ బాయ్ ఉదంతాన్ని ఈ లేటెస్ట్ ‘ చిన్నారి ‘ బ్రేక్ చేశాడు. సాధారణంగా నెలలు నిండకుండా, తక్కువ బరువుతో పుట్టే శిశువుల్లో అవయవాలు సరిగ్గా ఏర్పడని కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన అంటు వ్యాధులు లాంటి సమస్యలతో బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వైద్యులంటున్నారు. ఈ జపాన్ చిన్నోడు ఇప్పుడు హెల్దీగా ఉండడం సంతోషకరమని డాక్టర్లు అంటున్నారు. ఇది భవిష్యత్తు ఆశలను మరింత ఆశాజనకంగా ఉంచుంతోందని డా. తకేషు అరిమిత్సు పేర్కొన్నారు. కాగా ప్రపంచంలో అత్యంత తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్ని ఐయోవా గుర్తిస్తుంది. జర్మనీలో 274 గ్రాముల బరువుతో ఒక బాలుడు జన్మించగా, జర్మనీలోనే 2015లో 252 గ్రాముల బరువుతో ఒక పాప పుట్టింది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 300 గ్రాముల లోపు బరువుతో పుట్టిన 23 శిశువులు క్షేమంగా ఉన్నారని తెలిపింది. ఇందులో నలుగురు మాత్రమే అబ్బాయిలని ప్రకటించడం విశేషం. -
ఆ ల్యాప్ టాప్ ధర రూ 1.19 లక్షలు
ప్రపంచంలోనే అతి పలుచనైన ల్యాప్ టాప్ ను హెచ్‌పీ మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. 13 ఇంచ్‌ల డిస్ ప్లే స్క్రీన్ తో కూడిన వచ్చిన హెచ్‌పీ అతి పలుచని ల్యాప్ టాప్ ల శ్రేణిలో ఉత్తమ ఫీచర్లను అందిస్తోంది. ప్రాసెసర్ ను ఎక్కువ వేడిమి నుంచి కాపాడేందుకు హెచ్ పీ ప్రత్యేకంగా తయారు చేసిన హీట్ పైప్‌ను ఇందులో అమర్చారు. దీనికి తోడు అదనంగా మరో రెండు కూలింగ్ ఫ్యాన్ లను జత చేయడంతో ఎక్కువ వేడిమి నుంచి ప్రాసెసర్ ను రక్షించుకునేందుకు అవకాశం ఏర్పడింది. మిగతా నోట్ బుక్ లకు విరుద్ధంగా కోర్ ఎమ్ ప్రాసెసర్ కు బదులు కోర్ ఐ5, ఐ7లను హెచ్‌పీ వినియోగించింది. ల్యాప్ టాప్ లో ఎక్కువ భాగాన్ని అల్యూమినియంతో తయారు చేయగా.. అడుగు భాగాన్ని తయారుచేసేందుకు కార్బన్ ఫైబర్ ను వినియోగించారు. మిగిలిన ల్యాప్ టాప్ లతో పోల్చితే కొత్త డిజైన్ ను వినియోగదారులకు అందించేందుకు హింజ్ టైప్ ఎడ్జ్ ను రూపొందించారు. మూడు యూఎస్ బీ టైప్-సీ పోర్టులతో హెచ్‌పీ స్పెక్టర్ లభ్యం కానుంది. మ్యాక్ బుక్ విడుదల చేసిన అతి పలుచని ల్యాప్ టాప్ తో హెచ్ పీ పోల్చి చూస్తే హెచ్‌పీ ల్యాప్ టాప్ మరింత పలుచగా కనిపిస్తుంది. కాగా, భారతదేశంలో దీని ధరను రూ.1,19,000లుగా నిర్ణయించింది. ఫీచర్స్: 1. 10.4 మిమీల అతి పలుచనైన ల్యాప్ టాప్ 2. కేవలం 1.11 కిలోల బరువు 3. 13.3 ఇంచ్ ల డిస్ ప్లే 4. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 5. ఇంటెల్ కు చెందిన ఆరవ తరం ప్రాసెసర్లు 6. యూఎస్ బీ టైప్-సీ పోర్టులు