ల్యాప్‌టాప్‌పై పని చేస్తున్న వరుడు... పక్క చిత్రంలో నవ్వుతున్న వధువు
మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచమంతా కొన్నాళ్లు ఇంటి నుంచి పని చేసే విధానం (వర్క్ ఫ్రమ్ హోమ్) అమల్లో ఉంది. ప్రస్తుతం కరోనా కొంత అదుపులోకి రావడంతో పలు రంగాల ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్తున్నారు. కానీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మాత్రం ఇంకా వర్క్ ఫ్రమ్ విధానంలోనే విధులు నిర్వహిస్తున్నారు. పైగా కరోనా మూడో దశ వ్యాప్తి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మరికొన్నాళ్లు ఇంట్లో నుంచే పని చేయనున్నారు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్‌తో ఎన్ని లాభాలు ఉన్నా అన్నేసి కష్టనష్టాలు కూడా ఉన్నాయి. దానికి ఉదాహరణే ఈ వీడియో. చివరకు పెళ్లి చేసుకునేందుకు కూడా కంపెనీ వాళ్లు అవకాశం ఇవ్వకపోవడంతో మండపంలో పెళ్లి పీటలపై కూర్చొని వర్క్ ఫ్రమ్ చేస్తున్నాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వరుడు ల్యాప్‌టాప్‌లో పని చేస్తుండగా బంధుమిత్రులు అది చూసి నవ్వుకుంటున్నారు. ఇక వధువు అయితే పగలబడి నవ్వుతోంది. ఈ వీడియో దుల్హానియా అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో దర్శనమిచ్చింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మామూలు కాదని ఆ కష్టం తెలిసిన వారు కామెంట్లు చేస్తున్నారు. వెంటనే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసేయ్ అని సలహా ఇస్తున్నారు. అయితే అతడు తన పెళ్లిని వర్చువల్‌గా బంధువులు చూసేందుకు కెమెరాలు సెట్ చేస్తున్నాడని తెలిపారు. ఏది ఏం చేస్తున్నా అతడు చేసిన పని తెగ నవ్వులు తెప్పిస్తోంది. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment