
ల్యాప్‌టాప్ అందజేస్తున్న గిరిధర్ స్వామి
దిల్‌సుఖ్‌నగర్: దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన గిరిధర్ స్వామి బుధవారం ఆర్‌కేపురం డివిజన్‌లో చిత్రలేవుట్ కాలనీలో ఉన్న అనాథ వసతి గృహ విద్యార్థి రాజానాయక్‌కు రూ.52,000 విలువైన ల్యాప్‌టాప్ విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా గిరిధర్ స్వామి మాట్లాడుతూ అనాథ అయిన రాజా నాయక్‌ను చేరదీయడమేగాక భువనేశ్వర్ ఐఐటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ సీటు సాధించడంలో వసతి గృహం నిర్వాహకులు చేసిన కృషి ఎనలేనిదన్నారు. అతడి విద్యాభ్యాసం కోసం స్నేహితుల సహకారంతో ల్యాప్‌టాప్ కొనుగోలు చేసి ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమములో వసతి గృహ అధ్యక్షులు మార్గం రాజేష్, స్వామి, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment