orphanage
-
టీన్ప్రెన్యూర్స్: తల్లిదండ్రుల సంరక్షణలో పెరగకపోయినా..!
‘ఆర్ఎమ్పి ఫ్లవర్స్’ అధినేత 14 ఏళ్ల పూజిత. ఆర్డీవై ఫ్రేమర్స్ యజమాని యశస్వి. ఎకో ఫ్రెండ్లీ షాంపూ తయారీతో ఎంటర్ప్రెన్యూర్ కావాలనే ఆలోచనలో ఉన్నాడు మహబూబ్. వీళ్లందరూ స్కూల్ విద్యార్థులే. వీళ్లలో ఎవరూ సంపన్నులు కాదు. పారిశ్రామికవేత్త కావాలనే ఆలోచనే వారి మూలధనం. మరో విషయం... వీళ్లెవరూ తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతున్న పిల్లలు కాదు. హైదరాబాద్‌లోని టచ్ ఫౌండేషన్ ఆర్ఫనేజ్‌లో పెరుగుతున్న అనాథ పిల్లలు.పూజిత తొమ్మిదవ తరగతి. ఆమె తల్లిని, ఒక చెల్లిని తండ్రి పాశవికంగా హతమార్చాడు. ఆ సంఘటనతో పూజిత చెల్లితోపాటు టచ్ ఫౌండేషన్‌కు వచ్చింది. ఆర్ఫనేజ్‌కు వచ్చిన తర్వాత కూడా మిగిలిన పిల్లలతో కలవకుండా విచారంగా, కోపంగా ఉండేది. ఒంటరిగా గడిపేదని తెలియచేశారు నిర్వహకులు విజయ్‌కుమార్. అలాంటి పూజిత ఈ రోజు ‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కాళ్ల మీద నేను నిలబడగలననే ఆత్మవిశ్వాసంతో ఉన్నాను’ అని చెబుతోంది. ఆశ్రమం ఆవరణలో ఉన్న పూలు, ఆకులతో బొకేలు చేసి అమ్మవచ్చని స్నేహితులకు చెప్పి వారిని ప్రోత్సహించింది పూజిత. అలా ఓ చిన్నపాటి వ్యాపారవేత్తగా మారింది. ఇక యశస్వి విషయానికి వస్తే... ‘హైదరాబాద్‌లో జరిగిన 2024 స్టార్టప్ ఫెస్టివల్లో ఐదు ఫొటోఫ్రేములు అమ్మగలిగాను. ఈ నంబర్ చిన్నదే కావచ్చు. ఈ ఈవెంట్లో పాల్గొనడం వల్ల వచ్చిన ఆత్మవిశ్వాసం చాలా పెద్దది. నా ఉత్పత్తుల గురించి కస్టమర్‌కి ప్రెజెంటేషన్ ఇవ్వడం ద్వారా నేర్చుకున్న మెళకువలను అమలు చేయడం తెలుసుకున్నాను’ అంటోంది.ఆమె తల్లిదండ్రులను కోవిడ్ పొట్టన పెట్టుకుంది. బంధువులు యశస్విని, ఆమె సోదరుడిని ఆర్ఫనేజ్‌కు తీసుకువచ్చారు. రీ యూజ్డ్ మెటీరియల్‌తో ఫొటోఫ్రేములను చేస్తోంది యశస్వి. స్నేహితులతో కలిసి పేపర్, కార్డ్బోర్డ్, రాళ్లు వంటి తమకు అందుబాటులో ఉన్న వస్తువులకు తమ క్రియేటివిటీ జోడించి ఫొటోఫ్రేములను తయారుచేస్తోంది. మహమ్మద్ మహబూబ్ పదవ తరగతి విద్యార్థి. అతడు తామున్న హోమ్ ఆవరణలో ఉన్న కుంకుడు కాయలతో ఎకోఫ్రెండ్లీ షాంపూ తయారు చేసి సమీపంలో ఉన్న దుకాణాలకు సప్లయ్ చేయాలనుకుంటున్నాడు. పిల్లల్లో వ్యాపారవేత్త కావాలనే ఆలోచనను ప్రోత్సహించడానికి ‘యంగ్ టింకర్ ఫౌండేషన్’ ఒక్కో స్టూడెంట్‌కి వెయ్యి రూపాయలిస్తోంది. ఆ డబ్బుతో ఏం చేయాలి, ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టి తిరిగి మరింత డబ్బు సంపాదించడం ఎలా? ఇందుకోసం వారి బుర్రల్లో ఎలాంటి ఆలోచనలు ఆవిష్కరిస్తాయనే అంశాలను పిల్లలకే వదిలేస్తారు. ఈ ప్రయత్నంలోనే పూజితకు ఫ్లవర్ బొకే ఆలోచన వచ్చింది. యశస్వికి ఫొటో ఫ్రేములు చేయాలనిపించింది. మహబూబ్ షాంపూ తయారు చేయాలనుకున్నాడు. పిల్లలకు అవకాశం ఇస్తే వారి మెదళ్లు ఎంత చురుగ్గా ఆలోచిస్తాయో తెలియచేసే గొప్ప నిదర్శనం ఇది. (చదవండి: కళనే లాభదాయకమైన వృత్తిగా మలిచింది! హాండీక్రాఫ్ట్స్ ఇండస్ట్రీకే..) -
ఏపీ ప్రభుత్వానికి NHRC నోటీసులు వరుస ఘటనలపై సీరియస్
-
అనాథశ్రమం ముసుగులో అరాచకాలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
మధ్య ప్రదేశ్‌లో అనాథాశ్రయం పేరుతో జరుగుతున్న అరాచకాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆశ్రమం నిర్వహిస్తున్న సిబ్బంది చిన్నారులను తీవ్ర వేధింపులకు గురిచేశారు. పసివాళ్లనే జాలి లేకుండా చిన్న చిన్న తప్పుల పేరుతో భయంకరంగా చిత్రహింసలకు గురిచేశారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో ఈ బాగోతం బట్టబయలైంది. ఇండోర్‌లోని అనాథ శరణాలయంలో సుమారు 21 మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. ఆ ఆశ్రమంలో గతవారం సీడబ్ల్యూసీ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. దీంతో అనాథ బాలలు తమ బాధలను, వేధింపులను అధికారులకు మొరపెట్టుకున్నారు. చిన్న చిన్న తప్పిదాలకే ఆశ్రమం సిబ్బంది తీవ్రంగా వేధించేవారని వాపోయారు. ‘చిన్నారులను తలకిందులుగా వేలాడదీయడం, వేడి ఐరన్ రాడ్‌తో కొట్టడం, బట్టలు తీసేసి ఫోటోలు తీయడం వంటివి చేసేవారు. ఎర్ర మిరపకాయలను కాల్చడం వల్ల వచ్చే పొగను కూడా పీల్చుకునేలా చేశారు’ అని అధికారులు తెలిపారు. మరీ దారుణంగా నాలుగేళ్ల పిల్లవాడు ప్యాంట్లో బాత్రూం వెళ్లాడని అతడిని రెండు మూడు రోజులు వాష్‌రూమ్‌లో బంధించి ఆహారం ఇవ్వకుండా వేధించినట్లు చెప్పారు. సీడబ్ల్యూసీ అధికారుల ఫిర్యాదు మేరకు అయిదుగురు అనాథాశ్రయం సిబ్బందిపై కేసు నమోదైంది. అనాథ శరణాలయాన్ని వెంటనే సీజ్ చేశారు. చిన్నారులను ప్రభుత్వం షెల్టర్‌కు తరలించినట్లు ఇండోర్ ఏసీపీ అమరేంద్ర సింగ్ తెలిపారు. చిన్నారులపై వేధింపుల ఆరోపణలపై విచారణ జరుగుతున్నట్లు పేర్కొన్నారు. కాగా హోంలోని పిల్లలు మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన అనాథలుగా గుర్తించారు. అయితే ఆ అనాథశ్రమాన్ని వాత్సల్యపురం జైన్ ట్రస్ట్ నిర్వహిస్తోంది, దీనికి బెంగళూరు, సూరత్, జోధ్‌పూర్, కోల్‌కతాలో కూడా బ్రాంచ్‌లు ఉన్నాయి. చదవండి: ప్రముఖ రియల్టర్ కార్తికేయ మ్యాడంపై కేసు నమోదు -
తల్లిని దరిచేర్చిన యూ ట్యూబ్
ఖమ్మం: మతిస్థిమితం లేక తల్లి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎక్కడా వెతికినా ఆచూకీ తెలియలేదు. చివరకు కాలిపోయిన స్థితిలో కనిపించిన మహిళ మృతదేహాన్ని తల్లిదిగానే భావించి కర్మకాండలు నిర్వహించారు. చివరకు యూ ట్యూబ్‌లో అనాథాశ్రమం వీడియోలను ఆమె కుమారుడు చూసే క్రమంలో తల్లి కనిపించడంలో ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది. దీంతో ఏపీ నుంచి వచ్చిన యువకుడు ఖమ్మం జిల్లా మధిరలోని ఆశ్రమం నుంచి తల్లిని తీసుకెళ్లాడు. వివరాలు... ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం పుల్లూరు శివారు కొత్తగూడెంకు చెందిన నాగేంద్రమ్మకు భర్త తిరుపతయ్య, కుమారులు ముత్తయ్య, శ్రీనివాసరావు ఉన్నారు. అయితే, నాగేంద్రమ్మకు మతిస్థిమితం సరిగ్గా లేక రెండేళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో కుటుంబీకులు చుట్టుపక్కల వెతికారు. అప్పట్లో గ్రామ సమీపంలోని గుట్టపై కాలిపోయిన మహిళ మృతదేహం లభించడంతో నాగేంద్రమ్మదిగా భావించి కర్మకాండలు పూర్తిచేశారు. ఇటీవల నాగేంద్రమ్మ కుమారుడు ముత్తయ్య యూట్యూబ్‌లో విజయవాడకు చెందిన హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యాన రూపొందించిన వీడియో చూశాడు. ఈ వీడియో ఒక అనాథ శరణాలయం వివరాలు ప్రసారమవుతుండగా తల్లి కనిపించడంతో నిర్వాహకులకు ఫోన్ చేయగా ఖమ్మం జిల్లా మధిరలో ఆర్కే ఫౌండేషన్ చైర్మన్ దోర్నాల రామకృష్ణ, జ్యోతి ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ఆశ్రమంగా తేలింది. ఈమేరకు నాగేంద్రమ్మ కుటుంబ సభ్యులు శుక్రవారం మధిరకు రాగా, ట్రెయినీ ఐపీఎస్ అవినాష్‌కుమార్ సమక్షాన ఆశ్రమం నిర్వాహకులు దోర్నాల రామకృష్ణ అప్పగించారు. -
Rakesh Master: అనాథాశ్రమంలో జీవితం వెల్లదీసిన రాకేశ్ మాస్టర్, ఎందుకంటే?
టాలీవుడ్లో టాప్ కొరియోగ్రాఫర్‌గా కీర్తి గడించిన రాకేశ్ మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే ఆయన ఈ లోకం నుంచి శాశ్వతంగా నిష్క్రమించారు. గత కొంతకాలంగా ఇంటర్వ్యూల్లో కనిపిస్తున్న రాకేశ్ మాస్టర్ వేరు, అంతకుముందున్న మాస్టర్ వేరు. 1500 సినిమాలకు కొరియోగ్రఫీ, గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్.. ఇలా ఎంతో కీర్తి పొందిన ఆయన కొంతకాలం క్రితమే అబ్దుల్లాపూర్‌మెట్‌లోని అనాథాశ్రమంలో చేరారు. అందరూ ఉన్నా ఎవరూ లేని అనాథగా చివరి రోజుల వరకు అదే ఆశ్రమంలో జీవించారు. మానసికంగా కుంగిపోయి ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలో అనాథాశ్రమానికి వెళ్లానని రాకేశ్ మాస్టరే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఇంకా ఏమన్నారంటే.. 'నేను ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతాను. అదే నాకు సమస్యలు తెచ్చిపెట్టింది. మణికొండలో కారు పార్కింగ్ విషయంలో ఇంటి యజమానితో గొడవ జరిగింది. అక్కడెందుకు ఉండటమని నా భార్య దగ్గరకు వెళ్లిపోయా. అక్కడికి వెళ్లగానే గొడవ మొదలైంది. ఆమె.. మీరు రావొద్దండీ.. మీ వల్ల నా పిల్లలకు హాని అన్నారు. నా ఇంటర్వ్యూ వల్ల పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నా కొడుకు చరణ్‌ను కొట్టారు. చదవండి: ఆ ఒక్క మాటతో ఫేమస్ అయిన రాకేశ్ మాస్టర్ అందుకే ఆమె అలా మాట్లాడింది. ఎక్కడికైనా వెళ్లిపోండి, ఆఖరికి నేను చచ్చిపోయినా రానని అనేసింది. తన మాటల్లోని బాధ నాకు అర్థమైంది. అందుకే కుటుంబానికి దూరమయ్యాను. అయితే ఓ మహిళ నాకు అన్ని పనుల్లో సాయంగా ఉండేది. ఎక్కడికి వెళ్లినా నావెంటే వచ్చేది. కొంతమంది.. ఆమెను నా మూడో భార్య అని రాశారు. అందరి ముందు ఆమె పరువు పోతుందని, తనతో సహజీవనం చేస్తున్నానని చెప్పాను. ఎవరూ పట్టించుకోనప్పుడు తను నాకు సమయానికి తిండి పెట్టిందని నెత్తిన పెట్టుకున్నాను. కానీ ఆమె నా డబ్బులే దోచుకుంటూ నన్ను, నా కుటుంబాన్ని నిలువెల్లా ముంచింది. నా పరువుప్రతిష్టలు బజారునపడేసింది. నన్ను వశీకరణ చేయాలనుకుంది. తనవల్ల నా కుటుంబానికి మరింత దూరమై మనోవేదనకు గురయ్యాను. అందుకే అనాథాశ్రమంలో చేరాను' అని చెప్పుకొచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: రక్త విరోచనాలు.. రాకేశ్ మాస్టర్ కన్నుమూత -
వెండితెర బంగారం.. రవీనా టాండన్
రవీనా టాండన్ సుపరిచిత నటి. అయితే చాలామందికి ఆమెలో తెలియని కోణం సామాజిక స్పృహ. స్త్రీల హక్కులు, చైతన్యం, సాధికారతకు సంబంధించిన కార్యక్రమాల్లో రవీనా టాండన్ చురుగ్గా పాల్గొంటుంది. జీ–20కి సంబంధించిన ఉమెన్స్ ఎంపర్మెంట్ వింగ్–డబ్ల్యూ20 డెలిగేట్‌గా రవీనాకు సామాజిక స్వరాన్ని మరోసారి వినిపించే అవకాశం లభించింది. డైరెక్టర్ రవీ టాండన్ కుమార్తెగా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన రవీనా టాండన్ భిన్నమైన పాత్రలు చేసి తనను తాను నిరూపించుకుంది. నటిగా జాతీయ అవార్డ్‌తోపాటు ఎన్నో అవార్డ్లు అందుకుంది.‘కాలం కంటే కాస్త ముందుగా ఆలోచించే వ్యక్తి’గా గుర్తింపు సంపాదించింది. తన కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు 21 సంవత్సరాల వయసులో ‘సింగిల్ మదర్’గా పదకొండు సంవత్సరాల పూజా, ఎనిమిది సంవత్సరాల చయ్యలను దత్తత తీసుకుంది. సింగిల్ మదర్‌గా పిల్లలను దత్తత తీసుకోవడం ఆ తరువాత ట్రెండ్‌గా మారింది. మహారాష్ట్రలోని వసై నగరంలో కొందరి దుర్మార్గం వల్ల 30 మంది అమ్మాయిలు నిరాశ్రయులయ్యారు. అందరూ ‘అయ్యో!’ అనే సానుభూతికే పరిమితమైన ఆ కాలంలో రవీనా వారికి అండగా నిలబడింది. తన ఇంట్లోనే 30 మందికి ఆశ్రయం కల్పించింది. ఆ తరువాత వసైలో సొంత ఖర్చులతో అనాథాశ్రమం కట్టించి అందులో వారికి ఆశ్రయం ఇచ్చింది. ఇక అప్పటి నుంచి సామాజికసేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూనే ఉంది. సినిమాల్లో తన నటన కంటే 30 మంది అమ్మాయిలకు ఆశ్రయం కల్పించిన విషయం గురించే రవీనాతో చాలామంది మాట్లాడుతుంటారు. ఆ సందర్భం నుంచి తాము ఎలా స్ఫూర్తి పొందిందీ చెబుతుంటారు. మంచి పనికి లభించే గుర్తింపు అది! స్త్రీల హక్కులు, చైతన్యం, సాధికారతకు సంబంధించి యూనిసెఫ్‌తో... క్రై, వైట్ రిబ్బన్ (సేఫ్ మదర్‌హుడ్), స్మైల్ ఫౌండేషన్... మొదలైన స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది రవీనా. ‘పెటా’తో పాటు హైజీన్ ఆఫ్ యంగ్‌గర్ల్స్, మిషన్ సాహసి (ఆత్మరక్షణ)... మొదలైన కార్యక్రమాలకు అంబాసిడర్‌గా వ్యవహరించింది. ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంగేజ్మెంట్ వింగ్–జీ20 డెలిగేట్‌గా నియామకం అయిన రవీనా టాండన్....‘భారతీయ మహిళ ప్రతినిధిగా ఈ సదస్సులో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నాను. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎన్నో రంగాలకు చెందిన ఎంతోమంది మహిళలు విశేష కృషి చేశారు. సామాజిక, ఆర్థిక రంగాలలో మహిళల హక్కులు, అవకాశాల గురించి చర్చించడానికి ఇదొక మంచి అవకాశం’ అంటోంది. -
అనాథ వసతి గృహ విద్యార్థికి ల్యాప్‌టాప్ విరాళం
దిల్సుఖ్నగర్: దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన గిరిధర్ స్వామి బుధవారం ఆర్కేపురం డివిజన్లో చిత్రలేవుట్ కాలనీలో ఉన్న అనాథ వసతి గృహ విద్యార్థి రాజానాయక్‌కు రూ.52,000 విలువైన ల్యాప్‌టాప్ విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా గిరిధర్ స్వామి మాట్లాడుతూ అనాథ అయిన రాజా నాయక్‌ను చేరదీయడమేగాక భువనేశ్వర్ ఐఐటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ సీటు సాధించడంలో వసతి గృహం నిర్వాహకులు చేసిన కృషి ఎనలేనిదన్నారు. అతడి విద్యాభ్యాసం కోసం స్నేహితుల సహకారంతో ల్యాప్‌టాప్ కొనుగోలు చేసి ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమములో వసతి గృహ అధ్యక్షులు మార్గం రాజేష్, స్వామి, విద్యార్థులు పాల్గొన్నారు. -
అయ్యో బిడ్డా! కన్నతల్లికి ‘భారం’.. ‘కొన్న’తల్లి దూరం..
సాక్షి, మహబూబాబాద్: ఆ తల్లి కడుపున పుట్టడమే ఆ చిన్నారికి శాపంగా మారింది. ముక్కుపచ్చలారని వయసు నుంచి రెండేళ్లు వచ్చే నాటికే బాబును ఇద్దరికి ‘అమ్మ’కానికి పెట్టారు. ఇది గుర్తించిన అధికారులు చిన్నారిని వరంగల్ శిశుగృహకు పంపించారు. అటు కన్నవారు.. ఇటు పెంచుకున్నవారు ఉన్నా.. ఎవరూలేని అనాథగా బాబు శిశుగృహలో పెరుగుతున్నాడు. అయితే తామే పెంచుకుంటామని వెళ్లిన తల్లిదండ్రులపై మళ్లీ అమ్ముకుంటారన్న అనుమానం.. పెంచుకున్న వారికే బాబును ఇవ్వడానికి ఒప్పుకోని నిబంధనలు.. దీంతో ఏం చేయాలో అర్ధంగాక అధికారులు తలపట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న తండాలో నివసిస్తున్న గిరిజన మహిళకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త చనిపోయాడు. దీంతో సమీప బంధువుతో సన్నిహితంగా మెలగడంతో ఆ మహిళ 2019 మే నెలలో మగ శిశువుకు జన్మనిచ్చింది. శిశువును ఇంటికి తీసుకెళ్తే తమ కుటుంబాల్లో ఇబ్బందులు తలెత్తుతాయన్న అనుమానంతో ఆమె, ఆ వ్యక్తి శిశువును అమ్మేశారు. విషయం తెలుసుకున్న బాలల రక్షణ కమిటీ (సీడబ్ల్యూసీ) అధికారులు బాబును తీసుకొచ్చారు. కేసు నమోదుచేసి, తిరిగి శిశువును తల్లికి అప్పగించారు. కొద్దిరోజుల తరువాత మళ్లీ ఆ శిశువును ఇల్లెందు ప్రాంతానికి చెందిన వారికి తల్లి అమ్మేసింది. మళ్లీ విషయం తెలుసుకున్న సీడబ్ల్యూసీ అధికారులు బాబుకోసం వెతికి, 18 నెలల తర్వాత బాబు ఆచూకీ కనుక్కుని ఆమెపై, ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తితో పాటు బాబును తీసుకున్నవారిపై కేసు పెట్టి వరంగల్ శిశుగృహకు చిన్నారిని తరలించారు. బాబును ఎవరికి ఇవ్వాలి? శిశుగృహలో పెరుగుతున్న బాబు (విరాట్)ను ఇప్పుడు ఎవరికి అప్పగించాలన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటికే రెండుసార్లు విక్రయించిన తల్లికి ఇస్తే మళ్లీ అమ్మేస్తుందన్న భయం.. అలా కాదని ఇప్పటివరకు పెంచుకున్న తల్లిదండ్రులకు ఇవ్వాలంటే ఒప్పుకోని చట్టం.. పోనీ చట్ట ప్రకారం అప్పగించాలంటే దత్తత తీసుకునే దంపతుల వయస్సు వందేళ్లకు మించడంతో నిబంధనలు ఒప్పుకోవడం లేదు. బాబు చుట్టూ పైరవీలు: ముద్దులొలికే రూపంలో ఉన్న బాబును అప్పగించే విషయంలో రాజకీయ నాయకులు సైతం రంగప్రవేశం చేశారని తెలుస్తోంది. పెంచుకున్న తల్లిదండ్రులకు ఇప్పించేందుకు జిల్లాలోని కురవి, తొర్రూరు ప్రాంతాలకు చెందిన అధికార పార్టీ నా యకులు సీడబ్ల్యూసీ అధికారులపై ఒత్తిడి తెస్తు న్న ట్లు తెలిసింది. బాబు విషయంలో లక్షల రూపాయ లు చేతులు మారినట్లు కూడా ప్రచారం జరిగింది. బాబు మా ఆధీనంలోనే ఉన్నాడు బాబు (విరాట్) మా సంరక్షణలోనే ఉన్నాడు. మహబూబాబాద్‌లో శిశురక్ష భవన్ లేకపో వడంతో వరంగల్ బీఆర్ బీకి పంపించాం. చిన్నారి అలనాపాలనా అంతా ప్రభుత్వమే చూసు కుం టోంది. బాబును అప్పగించాలని ఇటు తల్లి దండ్రులు, అటు పెంచుకున్నవారు కూడా కోరు తున్నారు. ప్రభుత్వ నిబంధనలు, ఉన్నతా« దికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటాం. – స్వర్ణలత లెనీనా, డీడబ్ల్యూఓ, మహబూబాబాద్ -
అమీన్పూర్ మారుతీ అనాథాశ్రమం లైసెన్స్ రద్దు
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా అనాథ శరణాలయంలో బాలికపై అత్యాచారం ఘటనపై తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సీరియస్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు సభ్యులుతో ఓ కమిటీ వేసి,ఆగస్ట్ 20లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అలాగే అమీన్‌పూర్‌లోని మారుతి అనాథాశ్రమం లైసెన్స్‌ను స్త్రీ, శిశు సంక్షేమశాఖ రద్దు చేసింది. అందులో ఉన్న పిల్లలను అక్కడ నుంచి తరలించాలని ఆదేశాలు ఇచ్చింది. (ప్రియుడి మోసం.. రోడ్డెక్కి యువతి) కాగా అమీన్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ అనాథాశ్రమంలోనూ బిహార్ తరహా దారుణం చోటుచేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనాథ శరణాలయానికి నిధులిచ్చే నెపంతో ఓ వ్యక్తి.. అక్కడ బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేశారు. వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి(54)కి శరణాలయం నిర్వాహకులు విజయ, జయదీప్ సహకరించారు. బాలికపై పలుమార్లు అత్యాచారం చేయడంతో మూత్రాశయంలో ఇన్ఫెక్షన్తో నీలోఫర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. (అమీన్పూర్లో మరో ‘ముజఫ్ఫర్‌పూర్’) పటాన్చెరు డీఎస్పీ రాజేశ్వరరావు కథనం ప్రకారం.. బోయిన్‌పల్లికి చెందిన ఓ బాలిక తల్లిదండ్రులు మరణించారు. దీంతో బాలికకు వరసకు మేనమామ అయిన శామ్యూల్ ఆమెను అమీన్పూర్ పరిధిలోని మారుతి అనాథాశ్రమంలో చేర్పించాడు. బాలిక అక్కడే అయిదో తరగతి వరకూ చదువుకుంది. ప్రతి ఏటా సెలవుల్లో కొన్నిరోజుల పాటు దూరపు బంధువుల ఇంట్లో ఉండేది. కాగా బాలిక బాత్రూమ్లో జారిపడటంతో గాయమైందని, ఇంటికి తీసుకు వెళ్లాలంటూ ఆశ్రమం నిర్వాహకులు బాలిక బంధువు అయిన అనిల్‌కు ఫోన్ చేశారు. దీంతో ఆయన ఈ ఏడాది మార్చి 21న ఆమెను ఇంటికి తీసుకువెళ్లాడు. (ఇక.. చూస్తుండగానే బూడిద!) అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైన ఆ బాలికను ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. తిరిగి జూలై 29న ఆమెను అనాథ శరణాలయానికి తీసుకువెళ్లగా, ఆమెను చేర్పించుకునేందుకు ఆశ్రమం నిర్వాహకురాలు విజయ నిరాకరించారు. దీంతో బాలిక మరో బంధువైన ప్రీతి ఇంటికి తీసుకు వెళ్లారు. బాలిక పరిస్థితిని చూసి గట్టిగా ప్రశ్నించడంతో తనపై జరిగిన అకృత్యాలను ఆ చిన్నారి బయటపెట్టింది. దీంతో బంధువులు గత నెల 31న బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోక్సో చట్టం కింద విజయ, జయదీప్, వేణుగోపాల్‌రెడ్డిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. -
అనాథ పిల్లల ఆథ్యాత్మిక యాత్ర
తిరుపతి సెంట్రల్: ఒకరు తల్లిని కోల్పోతే.. ఇంకొకరికి తండ్రి లేడు..తల్లీ తండ్రీ లేని అభాగ్యులూ ఉన్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ..పైగా అందరూ దివ్యాంగులు. శ్రీకాకుళం జిల్లాలోని ఓ అనాథాశ్రమంలో జీవనం సాగిస్తున్న ఆ 17 మందికీ ఒక్కసారైనా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలన్న బలమైన కోరిక ఉండేది. కానీ ఇందుకు ఆర్థిక పరిస్థితి, అంగవైకల్యం అడ్డుపడేవి. అయితే వారి సంకల్పానికి దైవ బలం తోడై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతుల ఔదార్యంతో వారి చిరకాల వాంఛ తీరింది. శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొనడంతో పాటు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి, గోల్డెన్ టెంపుల్, గోవిందరాజ స్వామి ఆలయాలను సందర్శించారు. దీంతో చిన్నారుల మోములో ఆనందం వెల్లివిరిసింది. వైవీ సుబ్బారెడ్డిని ఎలా కలిశారంటే.. శ్రీకాకుళానికి చెందిన సామాజికవేత్త సిద్ధార్థ చాలా కాలం నుంచి అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో 17 మంది దివ్యాంగ బాలలు ఉన్నారు. ఆశ్రమంలో ఉన్న వారందరూ తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని చాలాకాలం నుంచి సిద్ధార్థకు చెప్పేవారు. ఈ తరుణంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇటీవలే సింహాచలం దేవస్థానానికి దర్శనార్థం వెళ్లారు. సిద్ధార్థ ఆయన్ని కలిసి అనాథ పిల్లలకు శ్రీవారి దర్శనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు వైవీ సుబ్బారెడ్డి సానుకూలంగా స్పందించారు. వారందరికీ సొంత ఖర్చులతో దర్శన ఏర్పాట్లతోపాటు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఆదివారం తిరుపతిలో వైవీ సుబ్బారెడ్డి దంపతులు వారికి నూతన వస్త్రాలను అందజేసి తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు. -
అగ్ని ప్రమాదం.. 15 మంది చిన్నారుల మృతి
పోర్ట్ అవు ప్రిన్స్ : కరీబియన్ దేశం హైతీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఎన్జీవో నిర్వహిస్తున్న వసతి గృహం మంటల్లో కాలిపోయింది. రాజధాని పోర్ట్ అవు ప్రిన్స్లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో సుమారు 15 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. మరో 60 మందిని అగ్నిమాపక దళాలు రక్షించగలిగాయి. ప్రమాదానికి గురైంది అమెరికాకు చెందిన క్రైస్తవ మత ఎన్జీవో ‘బైబిల్ అండర్స్టాండింగ్’ అనాథశరణాలయంగా తెలిసింది. హైతీలో రెండు అనాథ శరణాలయాను నిర్వహిస్తున్న సదరు ఎన్జీవో 150 మంది అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తోంది. ఇక అగ్ని ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేసిన హైతీ అధ్యక్షుడు జోవినల్ మాయిజ్.. దర్యాప్తునకు ఆదేశించారు. వెలుగుతున్న క్యాండిల్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. -
తల్లీకూతురును కలిపిన వాట్సాప్
యాదగిరిగుట్ట: తప్పి పోయిన బాలికను తల్లి ఒడికి చేర్చింది వాట్సాప్. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన అక్షిత అనే విద్యార్థిని శుక్రవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. తల్లి నిర్మల మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి చూడగా కూతురు కనిపించలేదు. కంగారు పడిన తల్లి.. అక్షితకు స్కూల్లో చదువు చెప్పిన అమ్మఒడి అనాథ ఆశ్రమ నిర్వాహకురాలు జెల్లా దివ్యకు తెలిపింది. వెంటనే ఆమె భర్త జెల్లా శంకర్‌కు అక్షిత ఫొటో, వివరాలతోపాటు తప్పిపోయిన సమాచారాన్ని తెలిపింది. ఆయన అమ్మఒడి అనాథ ఆశ్రమం వాట్సాప్ గ్రూప్‌లతోపాటు వివిధ గ్రూప్‌లలో పెట్టారు. దీంతో అక్షిత గుంటూరు జిల్లా కేంద్రం లో ఉందని, పోలీసులకు అప్పగించామని స్థానికులు.. ఆశ్రమ నిర్వాహకులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. బాలికలను పోలీసులు గుంటూరులోని సీడబ్ల్యూసీ కేంద్రానికి తరలించారు. శనివారం ఉదయం అక్షిత తల్లి నిర్మల, అమ్మఒడి ఆశ్రమ నిర్వాహకులు గుంటూరుకు వెళ్లి బాలికను తీసుకువచ్చారు. -
తాను శవమై.. విద్యార్థులకు పాఠమై
సాక్షి, పెద్దపల్లి : బతికి ఉన్నపుడు ఒంటివాడు.. కనీసం చనిపోయిన తర్వాతైనా తన దేహాన్ని వైద్యకళాశాల విద్యార్థులకు పాఠంగా ఉపయోగపడాలని భావించిన రామచంద్రం కోరికను బంధువులు తీర్చారు. పెద్దపల్లికి చెందిన చిలుముల రామచంద్రం (65) ఎవరూ లేని అనాథ. తన ఇంటిని రూ. 25వేలకు అమ్మేసి కరీంనగర్‌లోని వీరబ్రహ్మేంద్రస్వామి అనాథ ఆశ్రమంలో చేరాడు. అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశాడు. రామచంద్రం కన్నుమూశాడు అనడం కంటే.. విద్యార్థులకు పాఠమై కళాశాలకు వెళ్లాడని చెప్పడం బాగుంటుందని పలువురు కొనియాడారు. ఆయన మృతదేహాన్ని కరీంనగర్‌లోని ప్రతిమ వైద్యకళాశాల అనాటమీ హెచ్ఓడీ డాక్టర్ కిషన్‌రెడ్డిని సంప్రదించి కళాశాలకు అప్పగించినట్లు బంధువులు కందుకూరి ప్రకాశ్ తెలిపారు. -
అందరికి ఆదర్శం ఈ సేవ...
ఆలేరు: రోడ్డుపై అనాథగా పడి ఉన్న వారికి కనీస సాయం అందించే ఆశయం ఎంతో ఉన్నతమైనది. సమాజానికి కొంతైనా సేవా చేయాలన్న సంకల్పం కొందరిలోనే ఉంటుంది. అలాంటి కోవలోకే వస్తారు ఆలేరుకు చెందిన జెల్ల శంకర్, దివ్య దంపతులు. వీరి అనాథలను ఆదుకునేందుకు 2016 జూన్ 19న అమ్మఒడి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. శంకర్ చిన్నపాటి వ్యాపారం చేస్తుంటాడు. ఇతడి భార్య ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. వీరికి వచ్చే ఆదాయం కొద్ది మాత్రమే అయినా ఎంతో ఉన్నత ఆశయంతో అమ్మ ఒడి అనాథాశ్రమాన్ని నెలకొల్పి ఎంతో మందికి సేవలు అందిస్తున్నారు. మతిస్థిమితం లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారిని, అన్నీ కోల్పోయిన అభాగ్యులను అక్కున చేర్చుకొని వారికి అన్నీ తామై సేవలందిస్తున్నారు. ఇక్కడ ఆశ్రయం పొందిన ఎనిమిది మందిని బాగు చేయించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ ఆశ్రమంలో 10 మంది ఉన్నారు. తమకు వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే అభాగ్యులకు సేవ చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ దంపతులు. దాతలు చేయూతనందించాలి - జెల్ల శంకర్, ఆశ్రమ నిర్వాహకుడు అనాథలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు సొంత డబ్బుతోనే నిర్వహణను చూసుకున్నాం. అనాథలకు సేవ చేసి వారిని బాగు చేయించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించడం సంతృప్తిని ఇస్తుంది. ఇప్పటి వరకు కరీంనగర్, బాలనగర్, జనగామ, పిడుగురాళ్ల, విజయనగరం, జమ్మికుంట, ఏలూరు చెందిన అనాథలను బాగు చేయించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించాం. ఎవరైనా దాతలు సహకరిస్తే మరింత మందికి సేవ చేస్తాం. ఆర్థికసాయం అందించే దాతలు 90525 63756 నంబర్‌ను సంప్రదించవచ్చు. -
మైనర్ల పై హత్యాచారయత్నం
వయనాడ్(కేరళ): ఎవరూ లేని అనాథల జీవితాలు చిద్రం చేయడానికి కొందరు కీచకులు ప్రయత్నించారు. 7గురు బాలికలపై నిందితులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. కేరళలోని వయనాడలో ఈ ఘోరం చోటు చేసుకుంది. వాయనాడలోని ఓఅనాధాశ్రమంలో బాలికలపై పక్కనే ఉన్న దుకాణం యజమాని బాలికలకు స్వీట్స్, చాకోలెట్స ఆశ చూపి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న ఆశ్రమ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 5గురు నిందితులను అరెస్టు చేశారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వయనాడలో ఓ చర్చి ఫాదర్ ఓ మైనర్ బాలికను తల్లిని చేసిన సంఘటనలో 7గురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
మైనర్లుగా అదృశ్యం..మేజర్లుగా ప్రత్యక్ష్యం
►పిల్లల ఆచూకీ కోసం సీఐడీని ఆశ్రయించిన తల్లి ►ఇంట్లో మార్పు వచ్చేంత వరకూ వెళ్ళేది లేదన్న కూతుళ్ళు ►పదేళ్లుగా అనాథాశ్రమంలో ఆశ్రయం మారేడుపల్లి: అదృశ్యమైన తన కూతుళ్ళ ఆచూకీ కనుక్కోవాలంటూ ఓ తల్లి ప్రిన్సిపాల్ సెక్రటరీ, సీఐడి, నార్త్ జోన్ డిసిపి ని ఆశ్రయించడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారు ఓ స్వచ్చంద సంస్థ లో ఆశ్రయం పొందుతున్నట్లు గుర్తించి, తల్లికి అప్పజెప్పే ప్రయత్నం చేశారు. అయితే తల్లి ప్రవర్తనలో మార్పు వస్తే తప్ప, తాము వేళ్ళేది లేదంటూ సదరు కుమార్తెలు భీష్మించుకున్నారు. మారేడుపల్లి సీఐ ఉమమాహేశ్వర్ రావు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. అల్వాల్ లోతుకుంటకు చెందిన లక్ష్మికి ఇద్దరు కుమార్తెలు. చిన్నతనంలోనే భర్త మరణించడంతో ఇళ్లలో పాచి పని చేసుకుంటూ జీవనం సాగించేది. మధ్యానికి బానిసైన లక్ష్మి తన కుమార్తెలు సురేఖ ,జ్యోతి ల ను చిత్రహింసలకు గురిచేస్తుండటంతో 2008లో వారు ఇంటినుంచి పారిపోయి మారేడుపల్లిలో ఉంటున్న పెద్ద నాన్న రాములును ఆశ్రయించారు. దీంతో అక్కడికి వెళ్లిన లక్ష్మి తన బిడ్డలను అప్పగించాలని గొడవపడటంతో బిడ్డలను తల్లికి అప్పగించారు. అయితే తల్లితో వెళ్ళడం ఇష్టంలేని వారు అందుకు నిరాకరించడంతో పికెట్ బస్తీ వాసులు వారిని చేరదీసి స్థానిక నాయకురాలు దమయంతి సహకారంతో మహెంద్రహిల్స్ లోని ‘జాయ్ ఫర్ చిల్డ్రన్’ స్వచ్చంద సంస్థకు అప్పగించారు. నిర్వాహకురాలు డాక్టర్ జ్యోతి వారి కి విద్యాబుద్దులు నేర్పించింది. ప్రస్తుతం సురేఖ ( 21 ) యం. యల్. టి చదువుతుండగా, జ్యోతి (20) డిగ్రీ చదువుతోంది. పిల్లల ఆచూకి కోసం సీఐడి కి ఫిర్యాదు చేసిన తల్లి గత ఏడాది నవంబర్‌లో తన పిల్లల ఆచూకీ తెలియడం లేదని, వారి పెద్ద నాన్న రాములు తన బిడ్డలతో అనైతికమైన పనులు చేయిస్తున్నాడని లక్ష్మి ప్రిన్సిపల్ సెక్రటరీకి, సీఐడీ విభాగానికి , పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన మారేడుపల్లి పోలీసులు పెద్దనాన్న రాములు, అతని భార్య గంగమ్మ ను విచారించగా, 2008 లో తన దగ్గర కు వచ్చిన పిల్లలను అప్పుడే తల్లి కి అప్పజెప్పినట్లు తెలిపారు. దయమణి ద్వారా పిల్లలు ఉంటున్న స్వచ్చంద సంస్థ ఆశ్రమాన్ని గుర్తించిన పోలీసులు, పిల్లలను వారి తల్లి కి అప్పగించేందుకు ప్రయత్నించారు. అయితే వారు తమ తల్లి వద్దకు వెళ్ళెది లేదని , చిన్నతనం నుంచి ఆశ్రమంలోనే పెరిగామని, అక్కడే ఉంటామని తెల్చి చెప్పారు. పోలీసులు వారిని కోర్టులో హాజరు పరిచారు. మేజర్లయినందున వారి సొంత నిర్ణయం తీసుకోవచ్చన్న కోర్టు, పిల్లల ఇష్ట ప్రకారం వారు కోరుకున్న చోటుకి చేర్చాలని ఆదేశించింది. దీంతో వారిని స్టేట్ హోం కు తరలించారు. -
స్వచ్ఛందం సేవకు వేళాయెరా
ఇంటర్నేషనల్ వాలంటీర్ డే... స్వచ్ఛంద సేవలకు ఐక్యరాజ్యసమితి కిరీటం పెట్టిన రోజు. గుడ్డితాతను రోడ్డు దాటించడం, పనిమనిషి కూతురికి చదువుచెప్పడం, అనాథాశ్రమంలో బర్త్‌డే పార్టీ చేసుకోవడం, వృద్ధాశ్రమంలో పెళ్లి చేసుకోవడం, డాక్టర్‌గారు ఉచిత వైద్యం చేయడం, ఇంజనీర్ ఊరి చెరువు మీద బ్రిడ్జికి ఉచితంగా ప్లాన్ ఇవ్వడం, నిస్సహాయంగా ఉన్న గర్భిణిని ఆటోవాలా ఉచితంగా ఆస్పత్రికి తరలించడం, న్యాయవాదులు ఉచితంగా కేసు పోరాడటం, మందుల కంపెనీలు ఉచితంగా మందులు పంపిణీ చేయడం, జవాను తన సాహస గాథను వినిపించడం, ఒక ఆటగాడు ఉచితంగా శిక్షణ ఇవ్వడం, కరాటే మాస్టర్ ఆడపిల్లలకు ఆత్మరక్షణ నేర్పడం, శాస్త్రవేత్తలు రైతుకు కొత్త సాగు విధానం చూపడం, పోలీస్ మామ ట్రాఫిక్ నిర్వహణ నేర్పడం, గాయకుడు పాట పాడించడం, నర్తకుడు నాట్యం నేర్పడం, చిత్రకారుడు కుంచె పట్టించడం.... ఇలా మనందరిలోనూ ఇవ్వడానికి ఏదో ఒకటి ఉంటుంది. ఇస్తారని నమ్ముతున్నాం. స్వచ్ఛందాన్ని స్వచ్ఛఅందంగా మారుస్తారని నమ్ముతున్నాం. ‘ఎవరో వస్తారని... ఏదో మేలు చేస్తారని... ఎదురు చూసి మోసపోకుమా...’ అని పలికిన సినీ కవి వాక్కులు నిత్య సత్యాలు. ఎవరో వస్తారని... వచ్చిన వారు ఏదో చేస్తారని ఎదురు చూపులతోనే జీవితాన్ని గడిపేస్తే ఒరిగేదేమీ ఉండదు. ఎవరొచ్చినా, రాకున్నా మన వంతుగా మనం చేయగల పనిని, మనం చేయదగ్గ పనిని మనమే మొదలుపెట్టలేమా? ఎవరి కోసమో ఎదురు చూపులు చూడటం మానేసి నిస్సహాయ స్థితిలో ఉన్న ఇతరులకు సాయం చేయడానికి ఎవరికి వారే స్వచ్ఛందంగా ముందుకొస్తే జీవితంలో అంతకు మించినది ఏముంటుంది? సేవా సంకల్పమే మనసులోని స్వచ్ఛతకు తార్కాణం. జీవితంలోని అందానికి దర్పణం. ఇతరులకు సాయపడటానికి అర్థబలమో, అంగబలమో అక్కర్లేదు. చిత్తశుద్ధితో కూడిన సంకల్పం ఉంటే చాలు. నిస్సహాయతలో ఉన్న ఇతరులను ఆదుకోవాలనుకునే మనిషికి సంకల్పమే సగం బలం. ఇతరుల పట్ల ఔదార్యాన్ని, వదాన్యతను చాటుకోవడానికి అపర కుబేరులే కానక్కర్లేదు. ఇతరుల బాధలకు స్పందించే సహృదయం ఉంటే చాలు. పురాణాల్లో, చరిత్రలో ఇందుకు ఎన్నో ఉదంతాలు, ఉదాహరణలు. ‘పన్ను’పోటును తప్పించుకోవడానికో, కనీసం తగ్గించుకోవడానికో కార్పొరేట్ కుబేరులు ‘సామాజిక బాధ్యత’గా వదాన్యతను చాటుకోవడం మనకు తెలియనిదేమీ కాదు. అదంత పెద్ద విశేషమేమీ కాదు గానీ, రెక్కాడితే గానీ డొక్కాడని సామాన్యులు, ఆదాయంలో పెద్దగా మిగుల్చుకునే అవకాశమే లేని దిగువ మధ్యతరగతి మనుషులు ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరుల మేలు కోసం చేస్తున్న గొప్ప గొప్ప పనులు అక్కడక్కడా మన దృష్టిలోకి రాకపోవు. ‘కార్పొరేట్’ వదాన్యతకు వచ్చినంత ప్రాచుర్యం సామాన్యుల సేవా కార్యక్రమాలకు రాకపోవచ్చు. అయితే, మనసున్న మనుషులకు స్ఫూర్తినివ్వడంలో సామాన్యులు చేపట్టే సేవా కార్యక్రమాలు తక్కువేమీ కాదు. ఉడుతే తొలి వాలంటీర్ వాలంటీరింగ్ అనే క్రియా పదం నుంచి పుట్టిన వాలంటీర్ అనే ఇంగ్లిష్ పదం మనకు ఆధునిక యుగంలోనే పరిచయమైంది. వాలంటీరింగ్‌ను స్వచ్ఛంద సేవగా అనువదించుకున్నాం మనం. వాలంటీర్స్ను స్వచ్ఛంద సేవకులని కూడా అంటున్నాం. ‘పరోపకారార్థం ఇదం శరీరం’ అని మనసా వాచా నమ్మిన మన దేశంలో స్వచ్ఛంద సేవ ఒక అనాది సంస్కృతి. పురాణాలను పరిశీలిస్తే మనకు తెలిసిన తొలి వాలంటీర్ రామాయణంలోని ఉడుతే! సీతను బంధించిన రావణుడిపై యుద్ధానికి రాముడు సన్నద్ధమైనప్పుడు లంకకు చేరుకోవడానికి సముద్రంపై సేతువును నిర్మిస్తున్న వానరులకు ఉడుత చేసిన సాయం మనమంతా ఎరిగినదే! వానర యోధులంతా సేతు నిర్మాణం కోసం బండరాళ్లను తరలిస్తుంటే, ఉడుత తన వంతుగా ఇసుక రేణువులను తరలించింది. సేతు నిర్మాణానికి సాయం చేసిన ఆ ఉడుత ఎలాంటి ప్రతిఫలాన్నీ ఆశించలేదు. పురాణాల్లో శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, కర్ణుడు మొదలైన దానశీలురు ఎందరున్నా, ప్రతిఫలాపేక్ష లేని స్వచ్ఛంద సేవ గురించి చెప్పుకోవాల్సి వస్తే మాత్రం రామాయణంలోని ఉడుతను మించిన ఉదాహరణ దొరకదు. ఎంత సాయం చేశామన్నది కాదు, సాయం చేయడానికి మన దగ్గర ఏముందన్నది కాదు, చేసిన సాయానికి ఎంత ప్రచారం దక్కిందన్నదీ కాదు... అవసరంలో ఉన్న వాళ్లకు సాయం చేశామా లేదా అనేదే ముఖ్యం. అవసరంలో, ఆపదలో ఉన్న ఇతరులకు సాయం చేయాలనే సంకల్పం మరింత ముఖ్యం. మన చరిత్రలో వెయ్యేళ్ల కిందటే... రామాయణంలోని ఉడుత సంగతి సరే, నిస్వార్థ స్వచ్ఛంద సేవకు సంబంధించి వెయ్యేళ్ల కిందటి మన చరిత్రలోనే మరో ఉదాహరణ ఉంది. క్రీస్తుశకం పదకొండో శతాబ్ది కాలంలో చోళ సామ్రాజ్యాన్ని పాలించిన రాజరాజ చోళుడు తంజావూరులో బృహదీశ్వర ఆలయ నిర్మాణాన్ని తలపెట్టాడు. దేశంలోనే అతిపెద్ద ఆలయాల్లో ఒకటైన ఈ ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు ఎనిమిదేళ్లు పట్టింది. వందలాది మంది శ్రామికులు, శిల్పులు ఈ ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. యంత్ర పరికరాలేవీ అందుబాటులో లేని ఆ రోజుల్లో ఇంతటి బృహత్ నిర్మాణానికి వాళ్లంతా ఎంతటి కాయకష్టం చేసి ఉంటారో ఊహించుకోవాల్సిందే. కాయకష్టం చేస్తున్న ఆ శిల్పులకు, కార్మికులకు ఒక ముసలవ్వ తనవంతుగా ఏదైనా సాయం చేయాలనుకుంది. జీవనాధారానికి తగిన కొద్దిపాటి పాడిసంపద తప్ప ఏమీ లేని పేదరాలు ఆమె. అయితే, సాయం చేయాలనే ఆమె సంకల్పానికి పేదరికం అవరోధం కాలేదు. రోజూ అమ్ముకోగా మిగిలిన పాలను తోడుపెట్టి, మజ్జిగ చేసి ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికులకు, శిల్పులకు ఉచితంగా ఇచ్చి, అలసి సొలసిన వారి దాహార్తి తీర్చేదట. ఆనోటా ఈనోటా ఆమె సంగతి రాజరాజ చోళుడికి చేరింది. ముసలవ్వ చేస్తున్న సేవ గురించి తెలుసుకున్న రాజరాజ చోళుడు ముగ్ధుడయ్యాడు. ఆమె గౌరవార్థం ఆలయ ప్రాంగణంలో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. చరిత్ర ప్రసిద్ధుల స్వచ్ఛంద సేవ ఇతరేతర రంగాలలో సుప్రసిద్ధులైన వారు కొందరు స్వచ్ఛంద సేవలో తరించిన ఉదంతాలు కొన్ని చరిత్రలో ఉన్నాయి. అమెరికా వ్యవస్థాపకులలో ఒకరైన బెంజమిన్ ఫ్రాంక్లిన్ యువకుడిగా ఉన్నప్పుడు ఫిలడెల్ఫియాలోని అగ్నిమాపక దళంలో కొన్నాళ్లు స్వచ్ఛంద సేవ చేశారు. అప్పట్లో స్వచ్ఛంద సేవ ఎక్కువగా వ్యక్తిగత స్థాయిలోనే ఉండేది. అలాంటి కాలంలో స్వచ్ఛంద సేవను తొలిసారిగా సంఘటితం చేసిన ఘనత ఇంగ్లాండ్‌కు చెందిన సర్ జార్జ్ విలియమ్స్‌కే దక్కుతుంది. కుర్రతనంలో అరాచకంగా గడిపినా, ఒక యాక్సిడెంట్ తర్వాత ఆయన పరివర్తన చెందాడు. చర్చికి వెళ్లడం మొదలుపెట్టాడు. చర్చికి వచ్చే వాళ్లలో నానా బాధలతో సతమతమయ్యే ఆర్తులు కూడా ఉండేవారు. వాళ్ల బాధలను తొలగించడానికి తన వంతుగా ఏదైనా చేయాలనుకున్నాడు జార్జి విలియమ్స్. ఆర్తులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సేవ కొనసాగించేందుకు భావసారూప్యత గల తన తోటి యువకులు కొందరిని సంఘటితపరచి 1844లో యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ (వైఎంసీఏ) స్థాపించాడు. కాలక్రమంలో వైఎంసీఏ ప్రపంచవ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరించి, నేటికీ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నకాలంలో పర్యావరణ పరిరక్షణ కోసం 1933లో సివిలియన్ కన్జర్వేషన్ కాప్స్ స్థాపించి, 300 కోట్ల మొక్కలు నాటడానికి దోహదపడ్డారు. ఈ కార్యక్రమంలో పౌరులను భాగస్వాములుగా చేయడంలో ఆయన సఫలీకృతులయ్యారు. సేవాపథంలో కొన్ని మైలురాళ్లు స్వచ్ఛంద సేవలో రెడ్‌క్రాస్ సంస్థను తిరుగులేని మైలురాయిగా చెప్పుకోవచ్చు. అంతర్యుద్ధంతో అమెరికా అట్టుడికిపోతున్న సమయంలో గాయపడ్డ సైనికులకు సపర్యలు చేసి, వారికి ఆసరాగా నిలవాలనుకుంది క్లారా బార్టన్. ఆమె సంపన్నురాలేమీ కాదు. టీచర్‌గా, పేటెంట్ క్లర్క్‌గా పనిచేసేది. క్షతగాత్రులకు, ఆపన్నులకు సేవ చేయాలనే ఆమె సంకల్పమే రెడ్‌క్రాస్ సంస్థ స్థాపనకు నాంది పలికింది. తొలుత అమెరికన్ రెడ్క్రాస్గా మొదలైన సంస్థ అచిరకాలంలోనే అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది. క్లారా బార్టన్ తన అరవయ్యో ఏట... 1881లో రెడ్‌క్రాస్ సంస్థను స్థాపించింది. ప్రపంచవ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరించిన రెడ్‌క్రాస్ సంస్థ ఇప్పటికే సేవా కార్యక్రమాలలో ముందంజలో ఉంటోంది. ఎక్కడ ప్రకృతి విపత్తులు తలెత్తినా, ప్రమాదాలు సంభవించినా ఆపన్నులకు ఆసరాగా నిలుస్తోంది. మన దేశంలో మదర్ థెరిసా స్థాపించిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ స్వచ్ఛంద సేవారంగంలో మరో మైలురాయి. ఎక్కడో అల్బేనియాలో పుట్టి, ఇక్కడకు వచ్చిన ఆమె డార్జిలింగ్‌లో కొన్నాళ్లు టీచర్‌గా పిల్లలకు పాఠాలు బోధించారు. తర్వాత నన్‌గా మారి కలకత్తాకు వచ్చారు. కలకత్తాకు వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్లు కాన్వెంట్లో పిల్లలకు పాఠాలు బోధించారు. అదే కాలంలో బెంగాల్ కరువు, మత కల్లోలాలు కలకత్తాను కుదిపేశాయి. ఎక్కడ చూసినా ప్రజలు రోగాలతో, దుర్భర దారిద్య్రంతో అలమటించేవారు. వారిని చూసి చలించిన థెరిసా సేవామార్గం పట్టారు. అనాథలకు, ఆపన్నులకు తానే తల్లిగా మారారు. నిస్వార్థ సేవకు గుర్తింపుగా ఆమెను నోబెల్ శాంతి బహుమతితో పాటు పలు అంతర్జాతీయ అవార్డులు వరించాయి. మరణానంతరం ఆమెకు సెయింట్‌హుడ్ కూడా లభించింది. అపర అన్నపూర్ణ అన్ని దానాల కంటే అన్నదానమే గొప్పదంటారు. అలాంటి అన్నదానాన్ని తన జీవితాంతం కొనసాగించిన ‘అన్నపూర్ణ’ ఒకరు మన తెలుగునాటనే ఉండేవారు. ఆమె పేరు డొక్కా సీతమ్మ. శతాబ్ది కిందట గోదావరి ప్రాంతాల్లో ఆమె పేరు ఎరుగని వారు ఉండేవారు కాదు. ఇంటికి ఏ వేళలో అతిథి అభ్యాగతులు వచ్చినా, లేదనకుండా వండి వడ్డించేవారామె. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం మండపేట గ్రామంలో జన్మించారామె. ఆమె తండ్రి అనుపింది భవానీశంకరం. ఆయనను అందరూ ‘బువ్వన్నగారు’ అనేవారు. అడిగిన వారికి లేదనకుండా ‘బువ్వ’ పెట్టేవారు. అందుకే ఆయనకు ఆ పేరు వచ్చింది. లంకగన్నవరం గ్రామానికి చెందిన డొక్కా జోగన్న పంతులుతో వివాహమైంది. ఆయన భూవసతి గల రైతు, వేదపండితుడు, ఉదారుడు. సీతమ్మకు ఏనాడూ ఆంక్షలు పెట్టలేదాయన. సీతమ్మ దాతృత్వం ఇంగ్లాండు వరకు పాకింది. సొంత వనరులతోనే ఆమె సాగిస్తున్న సేవను తెలుసుకున్న అప్పటి బ్రిటిష్ చక్రవర్తి ఏడో జార్జి ఆమెను ఘనంగా సత్కరించాలనుకున్నారు. సన్మానం కోసం ఆమెను ఢిల్లీకి తోడ్కొని రావాల్సిందిగా అప్పటి మద్రాసు ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. సేవకు ప్రతిఫలం కోరనంటూ సన్మానానికి నిరాకరించిన నిరాడంబర వ్యక్తిత్వం ఆమెది. జీవితాంతం అన్నదాన యజ్ఞాన్ని కొనసాగించిన డొక్కా సీతమ్మను గోదావరి జిల్లాల ప్రజలు ‘అపర అన్నపూర్ణ’గా ఇప్పటికీ భక్తిగా తలచుకుంటారు. బాల్యంలోనే పునాదులు వేయాలి పిల్లలకు చిన్నప్పటి నుంచే సేవానిరతిని అలవరచాలి. ఇతరులతో పంచుకోవడంలో ఉన్న ఆనందాన్ని వారికి బోధపరచాలి. ఇతరులకు సాయం చేయడంలో ఉన్న సంతృప్తిని వారికి వివరించాలి. మంచి పనులు చేయడానికి బాల్యంలోనే పునాదులు వేయాలి. అప్పుడే వారు బాధ్యత గల పౌరులుగా ఎదుగుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలి. కొందరు పిల్లలు స్వతహాగానే ఇలాంటి కార్యక్రమాలపై ఆసక్తి చూపుతుంటారు. అలాంటి పిల్లలను మరింతగా ప్రోత్సహించండి. ఎలాంటి పనుల ద్వారా ఇతరులకు సాయం చేయవచ్చో వారికి మార్గదర్శకత్వం వహించండి. వ్యక్తిగత స్థాయిలో మనవంతుగా చేయగలిగే కొన్ని సేవా కార్యక్రమాలను మీ ముందు ఉంచుతున్నాం. ఇలాంటి ఆలోచనలతో మీరూ మీ వంతుగా స్వచ్ఛంద సేవ చేయవచ్చు. -
ఇంకా తీరని కరెన్సీ కష్టాలు
-
అనాథాశ్రమంలోని బాలుడు అదృశ్యం
మారేడుపల్లి: సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి విక్రంపురికాలనీలోని ఓ అనాథాశ్రమం నుంచి బాలుడు అదృశ్యమైన సంఘటన గురువారం మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మారేడుపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విక్రంపురి కాలనీలోని మంచికళలు సంస్థ(అనాథ ఆశ్రమం)లో ఉంటున్న కరుణాకర్(10)) బుధవారం సాయంత్రం ఆశ్రమం నుంచి కనిపించకుండా వెళ్లాడు. కరుణాకర్‌ను జూన్‌లో చిల్డ్రన్ స్టెట్ హోమ్ నుంచి మంచి కళలు సంస్థకు తీసుకువచ్చారు. స్థానికంగా ఓ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. బుధవారం స్కూల్ నుంచి ఆశ్రమానికి వచ్చిన కరుణాకర్ కనిపించకుండా వెళ్ళిపోయాడు. దీంతో ఆశ్రమ నిర్వాహకులు రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
'నాయక్' తరహాలో పిల్లలతో భిక్షాటన
గచ్చిబౌలి: ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్న ఓ కేటుగాడు అనాధాశ్రమం ముసుగులో చిన్నారులను యాచకులుగా మార్చేస్తున్నాడు. మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తానని పేద తల్లిదండ్రులతో నమ్మబలికి తీసుకొస్తున్న పిల్లలతో భిక్షాటన చేయిస్తున్నాడు. సదరు మాయగాడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ జూపల్లి రమేశ్ కుమార్ కథనం ప్రకారం... ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం, కొమ్మవరం గ్రామానికి చెందిన మాలిపెద్ది జేమ్స్(36) ఆర్సీపురం మండల పరిధిలోని అమీన్పూర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని 2012లో బ్రహ్మపుత్ర అనాధాశ్రమం నెలకొల్పాడు. నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలోని పేద కుటుంబాలకు చెందిన పిల్లలను మంచి చదువులు చదివిస్తానని నమ్మబలికి తన అనాథాశ్రమానికి తీసుకొస్తున్నాడు. స్థానికంగా జడ్పీహెచ్ఎస్, ఆర్నాల్డ్ హైస్కూల్ల్లో వారిని చేర్పిస్తున్నాడు. వీరిలో 10 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలు ఉన్నారు. ఈ నెల 16న కొండాపూర్ కొత్తగూడ జంక్షన్లో మోహన్, శివ, కార్తిక్, అఖిల, వెంకటేశ్ అనే చిన్నారులతో భిక్షాటన చేయించాడు. బుధవారం ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయిలు జర్కిన్ ధరించి. డొనేషన్ బాక్స్‌లు పట్టుకొని ట్రిపుల్ ఐటీ జంక్షన్, టీసీఎస్ కంపెనీ ముందు భిక్షాటన చేస్తుండగా.. బీట్ కానిస్టేబుల్ నరేందర్, దాస్ గమనించారు. చిన్నారుల్లో ఇద్దరిని పిలిచి ఎందుకు డబ్బులు అడుగుతున్నారని ప్రశ్నించగా... బ్రహ్మపుత్ర అనాధాశ్రమం నుంచి వచ్చామని, జేమ్స్ సార్ తమను పంపించాడని చెప్పారు. అతను ఎక్కడ ఉన్నాడని అడగగా రోడ్డు అవతలి వైపు నిల్చుని ఉన్నాడని జేమ్స్‌ను చూపించారు. అయితే, పోలీసులు తన వైపు వస్తున్నారని గ్రహించిన ఆ కేటుగాడు అప్పటికే ఇద్దరు చిన్నారులను ఆటో ఎక్కించి పంపేశాడు. అంతలోనే పోలీసులు వెళ్లి జేమ్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి 8 గంటలకు ఆర్సీపురం పోలీసుల సహకారంతో గచ్చిబౌలి పోలీసులు మెదక్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ చందుతో కలిసి బ్రహ్మపుత్ర ఆశ్రమంపై దాడి చేశారు. 19 మందికి విముక్తి బ్రహ్మపుత్ర అనాధాశ్రమంలో ఉన్న 19 మంది బాలబాలికలకు విముక్తి కల్గించారు. వీరిలో ఐదుగురు అమ్మాయిలు కాగా 14 మంది అబ్బాయిలున్నారు. ఒక విద్యార్థికి ఆరోగ్యం బాగాలేక పోవడంతో జేమ్స్ ఆ విద్యార్థిని ఇటీవలే ఇంటికి పంపేశాడని తెలిసింది. పోలీసులు తాము రెస్కూ్య చేసిన చిన్నారులను అమీన్‌పూర్‌లోని మహిమ ఫౌండేషన్‌లో ఆశ్రయం కల్పించారు. జువైనల్ జస్టిస్ యాక్ట్ , యాచక వృత్తి నిరోధక చట్టం, ఐపీసీ 420 కింద కేసు నమోదు చేసి.. నిందితుడు జేమ్స్‌ను రిమాండ్‌కు తరలించారు. ఖర్చు భరించలేకే భిక్షాటన: జేమ్స్ దాతలు సహకారంతోనే బ్రహ్మపుత్ర అనాధాశ్రమం నడిపిస్తున్నానని నిందితుడు జేమ్స్ తెలిపాడు. ఆర్నాల్డ్ హైస్కూల్లో చదివిస్తున్న వారికి ఫీజు చెల్లించే పరిస్థితి లేక.. తప్పు అయినప్పటికీ చిన్నారులతో భిక్షాటన చేయించానని చెప్పాడు. నిందితుడు జేమ్స్ -
ఐటీ కారిడార్..హైటెక్ బెగ్గింగ్..!
- అనాధాశ్రమం ముసుగులో బిక్షాటన - 19 మంది పిల్లలకు విముక్తి , నిర్వాహకుడి అరెస్టు గచ్చిబౌలి పిల్లలకు విద్యా బుద్దులు నేర్పిస్తాని తెచ్చి బిక్షగాళ్లుగా మార్చిన ఘటన ఐటీకారిడార్ గచ్చిబౌలిలో వెలుగు చూసింది. ఐటీ కారిడార్‌లోని ప్రధాన కూడళ్లలో భిక్షాటన చేయిస్తున్న అనాధాశ్రమం నిర్వాహకుడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ జూపల్లి రమేశ్ కుమార్ తెలిపిన ప్రకారం..కొమ్మవరం గ్రామం, ఇల్లెందు మండలం ఖమ్మం జిల్లాకు చెందిన మాలిపెద్ది జేమ్స్(36) ఆర్సీపురం మండల పరిధిలోని అమీన్పూర్లో 2012లో బ్రహ్మపుత్ర అనాధాశ్రమం నెలకొల్పాడు. నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలోని పేద కుటుంబాలకు చెందిన పిల్లలను మంచి చదువులు చదివిస్తానని చెప్పి అనాధాశ్రమానికి తీసుకొచ్చాడు. స్థానికంగా జడ్పీహెచ్ఎస్, అర్నాల్డ్ హైస్కూల్లో విద్యార్థులను చేర్పించాడు. ఈ క్రమంలో ఈ నెల 16న కొండాపూర్, కొత్తగూడ జంక్షన్లో మోహన్ , శివ, కార్తీక్, అఖిల, వెంకటేశ్‌లచే భిక్షాటన చేయించాడు. బుధవారం ట్రిపుల్ ఐటీ జంక్షన్, టీసీఎస్ కంపెనీ ముందు జెర్కిన్ ధరించి, డొనేషన్ బాక్స్‌లతో అడుక్కుంటున్నఇద్దరు అమ్మాయిలు, అబ్బాయిలను బీట్ కానిస్టేబుల్ గమనించాడు. వారిలో ఇద్దరి దగ్గరకు పిలిచి డొనేషన్ ఎందుకు అని ఆరా తీశారు. దీంతో పిల్లలు తాము అనాధాశ్రమం నుంచి వచ్చామని.. జేమ్స్ చెప్పడంతో డబ్బులు అడుగున్నామని చెప్పారు. పోలీసులు జేమ్స్ ఎక్కడ అని అడగగా... రోడ్డు కు అవతలి వైపు ఉన్నాడని చెప్పారు. అప్పటికే జేమ్స్ అక్కడి నుంచి జారుకోవడంతో.. పోలీసులు చైల్డ్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేశారు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఆర్సీపురం పోలీసుల సహకారంతో గచ్చిబౌలి పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ చందు బ్రహ్మపుత్ర ఆశ్రమంపై దాడి చేశారు. 19 మందికి విముక్తి అమీన్‌పూర్‌లోని బ్రహ్మపుత్ర అనాధాశ్రమంపై దాడి చేసి 19 మంది బాలబాలికలకు విముక్తి కల్గించారు. వీరిలో 5గురు అమ్మాయిలు కాగా 14 మంది అబ్బాయిలున్నారు. ఒక విద్యార్థికి ఆరోగ్యం బాగాలేక పోవడంతో జేమ్స్ ఇటీవల ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది. వీరందరికీ.. అమీన్‌పూర్‌లోని మహిమ ఫౌండేషన్‌లో ఆశ్రయం కల్పించారు. జేమ్స్ పై జువెనైల్ యాక్ట్ 76(1), బెగ్గింగ్ యాక్ట్ 27, ఐపీసీ 420 కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఖర్చు భరించలేకే భిక్షాటన: జేమ్స్ దాతలు సహకారంతోనే బ్రహ్మపుత్ర అనాధాశ్రమం నడిపిస్తున్నానని నిర్వాహకులు ఎం.జేమ్స్ తెలిపారు. ఆర్నాల్డ్ హైస్కూల్లో చదివించే విద్యార్థులకు ఫీజు చెల్లించలేని పరిస్థితులలో చిన్నారులచే భిక్షాటన చేయించానని ఆయన పేర్కొన్నారు. ఆలా చేయించడం తప్పేనని ఒప్పు కున్నాడు. -
ఫేస్ బుక్ పరిచయంతో మోసపోయాను
► సేవా కార్యక్రమాలకు రూ.50 లక్షలు విరాళం ఇస్తానంటే నమ్మి రూ.7 లక్షలు ఖాతాలో వేశాను ► ప్రభుత్వం, దాతలు ఆదుకోకుంటే ఆత్మహత్యే శరణ్యం ► బాధితురాలి ఆవేదన పాలకుర్తి: అమెరికాకు చెందిన వ్యక్తి చేతిలో తాను మోసపోయానని పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన అనంతోజు రజిత ఆవేదన వ్యక్తం చేసింది. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను ఫేస్బుక్లో పోస్టు చేయగా.. ఆ ఫొటోలు, వివరాలు చూసిన అమెరికాకు చెందిన టోని మార్క్ అనే వ్యక్తి స్పందించి సేవా కార్యక్రమాలు బాగున్నాయంటూ పరిచయం చేసుకున్నాడని చెప్పింది. తాను ఏర్పాటు చేయదలుచుకున్న అనాథ శరణాలయం కోసం విరాళం ఇస్తామని చెబితే నమ్మానని తెలిపింది. ముందుగా తనకు అత్యవసరంగా రూ.7 లక్షలు అవసరం ఉన్నాయని టోని మార్కు చెబితే నమ్మి అతను ఇచ్చిన అకౌంట్లో వేసి.. అతడి మోసానికి బలయ్యానని చెప్పింది. స్నేహితులు, బంధువుల దగ్గర అప్పులు తెచ్చి ఇచ్చానని రజిత తెలిపింది. తన పరిస్థితి అర్ధం చేసుకుని దాతలు, ప్రభుత్వం ఆదుకోవాలని, లేకుంటే తనకు ఆత్మహత్యే శరణ్యమని పేర్కొంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని చెప్పింది. -
అనాథాశ్రమంలో దుప్పట్ల పంపిణీ
దురాజ్‌పల్లి(చివ్వెంల) : మాజీ రాజ్యసభ సభ్యుడు, టీడీపీ సీనియర్ నాయకుడు ఆకారపు సుదర్శన్ 5 వ వర్ధంతిని ఆపార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈసందర్భంగా దురాజ్‌పల్లి గ్రామ శివారులోని ఆలేటి ఆటం వరల్డ్ అనాథాశ్రమంలో దుప్పట్లు, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఆయన సతీమణి మేరమ్మ, కుమారుడు ఆకారపు రమేష్, టీడీపీ నియోజక వర్గ ఇన్చార్జ్ పటేల్ రమేష్‌రెడ్డి, పగడాల లింగయ్య, ధారోజు జానకి రాములు, జుట్టుకొండ సత్యనారాయణ, పెద్ది రెడ్డి రాజా, ఎండీ మునీర్ ఖాన్, బొలికొండ సైదులు, కంచర్ల గోవిందరెడ్డి, పల్స ఉపేందర్‌గౌడ్, సోమిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, గండి కోట లక్ష్మయ్య, నేరెడ్ల సోమయ్య తదితరులు పాల్గొన్నారు. -
అనాథలు అడగగానే గొంతువిప్పింది
-
అనాథలు అడగగానే గొంతువిప్పింది
లాస్ ఎంజెల్స్: చిన్నారుల కోసం ప్రముఖ హాలీవుడ్ పాప్ స్టార్ లేడి గాగా గొంతుసవరించింది. ఓ అనాథ ఆశ్రమాన్ని సందర్శించిన ఆమె వారి కోసం పాటపాడింది. ఈ 30 ఏళ్ల పాప్ సింగర్ మెక్సికోలోని కాపోసాన్ లుకాస్ అనే ప్రాంతంలో ఉన్న కాసా హోగర్ హోమ్ అనే బాలుర అనాథ ఆశ్రమానికి వెళ్లింది. అయితే, అక్కడి చిన్నారులతో కబుర్లు చెబుతున్న ఆమెను క్రిస్టియాన్ అనే బాలుడు ఒక పాట తమకోసం పాడాలని అభ్యర్థించాడు. అతడు అలా అడిగాడో లేదో వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా గాగా చక్కగా ఓ గీతాన్ని ఆలపించారు. 'బోర్న్ దిస్ వే' అంటూ వారి కోసం పాటపాడి కొంత భావోద్వేగానికి లోనయ్యారు. ఇలా మ్యూజిక్ సిస్టం, ఇతర సంగీత సంబంధ పరికరాలు లేకుండా ఆమె గాల్లో తేలిపోయేట్లుగా సాంగ్ పాడి చిన్నారుల కోరికను తీర్చడమే కాకుండా తన పేరును నిలబెట్టుకున్నారు. -
‘కర్కశత్వం’పై కదలిక
♦ జిల్లా మానవ హక్కుల వేదిక కన్వీన ర్ రాకతో కదిలిన అధికార గణం ♦ ఘటన జరిగి వారం గడుస్తున్నా పట్టించుకోని అధికారులు ♦ అధికారుల తీరుపై మండిపడ్డ జయశ్రీ ♦ పిల్లలను జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖకు తరలించేందుకు చర్యలు లక్కిరెడ్డిపల్లె : జిల్లా మానవ హక్కుల వేదిక కన్వీనర్ రాకతో ఎట్టకేలకు అధికారుల్లో కదలిక వచ్చింది. మండలంలోని రాయచోటి -వేంపల్లె మార్గంలో ప్రజాచైతన్య సేవాసంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథాశ్రమంలో అటెండర్ సంపూర్ణమ్మ రూ.450 నగదు పోయిందంటూ అనాథ పిల్లల చేతుల్లో కర్పూరం వెలిగించి ప్రమాణం చేయించిన ఘటనపై సాక్షిలో కథనం ప్రచురితమైంది. నాలుగు రోజులు గడుస్తున్నా అధికారుల్లో చలనం రాకపోవడంతో సోమవారం జిల్లా మానవ హక్కుల వేదిక కన్వీనర్ జయశ్రీ రాకతో అధికార బృందం కట్టకట్టుకొని ప్రజా చైతన్య సేవా సంఘం అనాథాశ్రమానికి పరుగులు పెట్టారు. పిల్లలు పాఠశాలకు వెళ్లారని తెలిసి బాధిత విద్యార్థులైన నాగార్జున, నాగరాజు, నాగమల్లేష్లను పిలిపించి జరిగిన విషయంపై ఆరా తీశారు. ఆ విద్యార్థులు తమను కర్పూరం వెలిగించి కాల్చిందని చెబుతుంటే ఒళ్లు గగుర్పాటుకు గురై వెంటనే మండల విద్యాధికారి, తహసీల్దార్, ఎంపీడీఓ, సీడీపీఓ, సీఐ, ఎస్ఐలతో పాటు జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ చైర్ పర్సన్‌తో ఫోన్లో సంప్రదించారు. వెంటనే అనాథ పిల్లలకు మంచి సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే రాష్ట్ర మానవహక్కుల వేదికకు నివేదిస్తానని చెప్పడంతో అధికారులందరూ అరగంటలోపే లక్కిరెడ్డిపల్లెకు వాలిపోయారు. అడిగితే కొడతారు అధికారులు పిల్లలను పిలిపించి ఏం జరిగిందని అడగ్గా అక్కడ జరుగుతున్న తంతును వారికి వివరించారు. వారానికి ఒక్కరోజే స్నానం అని, అది కూడా బట్టలు ఉతికే సబ్బుతో స్నానం చేసుకొనే వారమని పేర్కొన్నారు. స్నానపు గదులు, మరుగుదొడ్లు ఉన్నా తమను మాత్రం రోడ్డుకు అటువైపు వున్న చేతిపంపు వద్దకు తీసుకువెళ్లేవారని వారు చెప్పుకొచ్చారు. ఉదయం గంజి తాగి పాఠశాలకు వచ్చే వారమని చెప్పడంతో అధికారులు కంగుతిన్నారు. పాఠశాలలో నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగులు ఇస్తే అటెండర్ అన్నీ లాక్కునేదని వారు వాపోయారు. వెంటనే సీజ్ చేయాలి : జయశ్రీ అనంతరం అన్ని శాఖల అధికారులతో కలిసి అనాథాశ్రమాన్ని తనిఖీ చేయగా చెత్తా చెదారంతో కూడిన గదులు, దుర్వాసన వస్తుండంతో వెంటనే సీజ్ చేయాలని జిల్లా మానవ హక్కుల వేదిక కన్వీనర్ జయశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనాథ పిల్లల కోసం రూ.లక్షలు ఖర్చు చేస్తుంటే ప్రైవేటు వ్యక్తులు కొంత మంది ప్రభుత్వ ఖాజానాకు గండి కొడుతున్నారని, అన్నీ తెలిసి కూడా అధికారులు నిమ్మకుండి పోవడంతో ప్రభుత్వ లక్ష్యాలు నీరుగారిపోతున్నాయని ఆమె వాపోయారు వెంటనే అటెండెర్ సంపూర్ణమ్మతో పాటు చైర్మన్ చెన్నారెడ్డిలపై కేసు నమోదు చేసి అనాథాశ్రమాన్ని సీజ్ చేయాలని ఆమె సూచించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రొటెక్షన్ అధికారి సునీత తన సిబ్బందికి తెలియజేసి అనాథ పిల్లలను మెరుగైన సౌకర్యాలు ఉన్న చోటకి తరలిస్తామని చెప్పడంతో ఆ పిల్లలు ఆనందం వ్యక్తం చేశారు. తహసీల్దార్ శ్రీరాములు నాయక్, సూపరింటెండెంట్ హైదర్ వల్లీ, సీడీపీఓ క వితాదేవి, ప్రధానోపాధ్యాయుడు పురుషోత్తం రెడ్డి, మానవ హక్కుల వేదిక సంఘం నాయకులు సుబ్బన్న, వీఆర్లోలు నరేంద్రారెడ్డి, గంగాధర్, అన్వర్ బాషా, ఉపాధ్యాయులు శిద్దేశ్వరుడు, శ్రీనివాసులు, దామోదర్‌రెడ్డి, రఘురామయ్య పాల్గొన్నారు. -
అనాథాశ్రమం నుంచి ఇద్దరు బాలురు అదృశ్యం
రంగారెడ్డి మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలో ఉన్న అనాథ బాలల ఆశ్రమం కృషిహోంలో ఉండే ఇద్దరు బాలురు కనిపించకుండాపోయారు. అనాథ గృహంలో ఆశ్రయం పొందుతున్న ఎన్.సాయిలు(13), మహేష్(10) అనే బాలురు బుధవారం ఉదయం టిఫిన్ చేసిన అనంతరం నుంచి కనిపించకుండా పోయారు. దీంతో నిర్వాహకులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవటంతో రాత్రి పోలీసులను ఆశ్రయించారు. కృషిహోం ట్యూటర్ ఎండీ సుమేర్ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
ఆయాలా.. దయ్యాలా..
♦ పసివాళ్ల చేతులపై వాతలు పెట్టిన వైనం ♦ కరీంనగర్‌లోని శిశుగృహలో దారుణం ♦ తీవ్రంగా స్పందించిన కలెక్టర్ ♦ ఆయాలు, సిబ్బంది తొలగింపు సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : పసివాళ్లు.. అన్నెం పున్నెం ఎరగని అనాథలు... కన్నపేగులను ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లిపోతే చేరదీసిన శిశుగృహే వారికి దిక్కయింది. ఆరు రోజుల క్రితం అందులో పనిచేసే ఆయాలకు ఉన్నట్టుండి ఏమైందో ఏమో... ఒక్కసారిగా శాడిస్టుల్లా మారారు. చెంచాను స్టవ్‌పై వేడి చేసి పిల్లల చేతులపై వాతలు పెట్టారు. మరుసటి రోజు సాయంత్రం సామాజిక కార్యకర్త వచ్చి చూసే వరకు వారికి కనీసం చికిత్స అందించిన పాపాన పోలేదు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శిశుగృహలో ఎనిమిది మంది పిల్లలున్నారు. అందులో ఒకరు మూడు నెలల పసిబాబు మోక్ష. మిగిలిన ఏడుగురు రెండేళ్ల నుంచి ఐదేళ్లలోపు వారే. ఈనెల 15న సాయంత్రం 7.30 గంటలకు ఆ ఏడుగురు పిల్లలను ఆయూలు బుచ్చవ్వ, పద్మ ఒకే చోట కూర్చోబెట్టారు. ప్లేట్లలో అన్నం, కూర వడ్డించి వాళ్ల ముందు పెట్టారు. ఆ పిల్లలే చక్కగా అన్నం కలుపుకుని తింటుండగా, 10 నిమిషాల తరువాత ఆయా బుచ్చవ్వ స్టవ్ వెలిగించి చెంచా వేడి చేసింది. ఇద్దరూ కలిసి వరుసగా ఆ ఏడుగురు పిల్లల చేతులపై వాతలు పెట్టారు. ఇందులో ఐదేళ్ల గీత, ధనలక్ష్మీతోపాటు రెండేళ్ల రాజన్ చేతులపై గాయూలు కాగా.. మిగిలిన వారికి చిన్నపాటి గాయూలయ్యూరుు. గీత చేతిపై బొబ్బలొచ్చి పుండుగా మారింది. మరుసటి రోజు ఏడుస్తూనే అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన పిల్లలు సాయంత్రం 4 గంటలకు శిశుగృహకు చేరుకున్నారు. సామాజిక కార్యకర్త శ్రీలత పిల్లలకు వాతలను గమనించి వెంటనే వారిని సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లి టీటీ ఇంజక్షన్లు వేయించారు. జరిగిన దారుణాన్ని శిశుగృహ మేనేజర్‌తోపాటు ఐసీడీఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఐసీడీఎస్ పీడీ ఎస్.మోహన్‌రెడ్డి సైతం ఈ దారుణంపై స్పందించలేదు. ఆయూలకు మెమోలు జారీ చేతులు దులుపుకున్నారు. చివరకు ఈ దారుణం బుధవారం బయటపడటంతో కలెక్టర్ నీతూప్రసాద్ శిశుగృహను సందర్శించి చిన్నారులను పరామర్శించారు. చిన్నారుల చేతులపై గాయూలు చూసి చలించిపోయారు. ఐసీడీఎస్ పీడీ సరెండర్ పిల్లల చేతులపై వాతలు పెట్టిన ఇద్దరితోపాటు మరో ఆయూను తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగించడంతోపాటు క్రిమినల్ కేసుపెట్టి అరెస్టు చేయాలని కలెక్టర్ నీతూప్రసాద్ అధికారులకు, పోలీసులను ఆదేశించారు. శిశుగృహ మేనేజర్ దేవారావు, ఇతర సిబ్బంది పర్యవేక్షణ లోపం స్పష్టంగా కన్పిస్తున్నందున వారందరినీ ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ మోహన్‌రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించినందున ఆయనను విధుల నుంచి తప్పించి హైదరాబాద్ కార్యాలయానికి అటాచ్డ్ చేస్తున్నట్లు తెలిపారు. పట్టించిన సీసీ కెమెరాలు: శిశుగృహలోని గదుల్లో గతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో ఆయాల దురాగతం బయటపడింది. చిన్నారుల చేతులపై ఆయాలు వాతలు పెట్టిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. స్పందించిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ శిశుగృహలో జరిగిన దారుణంపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు అచ్యుతరావు సీరియస్‌గా పరిగణిస్తూ కేసును సుమోటోగా స్వీకరించారు. విచారణ జరిపి మే 2లోగా నివేదిక పంపాలని కలెక్టర్‌కు నోటీసు పంపారు. లీగల్‌సెల్ అథారిటీ కార్యదర్శి భవానీచంద్ర సైతం బుధవారం మధ్యాహ్నం శిశుగృహను సందర్శించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
ఆడపిల్లలు పుట్టారని శిశుగృహలో వదిలేసారు..
-
అమ్మ గోరుముద్దల రుచి చూసిన చిన్నారులు
రాయచూరు సంజె సత్సంకల్పంపై సర్వత్రా ప్రశంసలు రాయచూరు: కనకదాస అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న చిన్నారులు అమ్మప్రేమ ను రుచి చూశారు. వీరికి అమ్మప్రేమను, గోరుముద్దల అప్యాయతలను చూపించాలన్న స త్సంకల్పం విజయవంతమైం ది. అనతికాలంలోనే జిల్లా ప్రజల ఆదరణ చూరగొన్న రాయచూరు సం జె దినపత్రిక, నవచేతన ఫౌండేషన్ ఇటీవల ఓ చక్కటి కార్యక్రమాన్ని స్థానిక ఉదయ్‌నగర్ పార్కులో నిర్వహించాయి. ఈ బిడ్డలందరికి కొన్ని గంటల పాటు తల్లులు లభించారు. వారితో గోరుముద్దలు తిని దివ్యానుభూతికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆ ఆశ్రమ వ్యవస్థాపకులు మందకల్ బాబు, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జిల్లా డీడీ లక్ష్మీకాం తమ్మ, బా లల సంక్షేమ సమితి జిల్లాధ్యక్షురాలు జయశ్రీ, విజయానందపాటిల్, తహశీల్దార్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. చివరగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. -
పాపం.. పాలబుగ్గల పసివాళ్లు!
-
పాపం.. పాలబుగ్గల పసివాళ్లు!
వాళ్లంతా పట్టుమని పదేళ్లు కూడా లేని పిల్లలు. మండుటెండలో, రోడ్డు కూడా దాటలేనంత ట్రాఫిక్ మధ్య .. ఒక చేతిలో బ్రోచర్, మరో చేతిలో డబ్బాతో ఒక్కొక్కరి దగ్గర డబ్బులు అడుగుతూ ప్రత్యక్షమయ్యారు. చిన్నారులను చూసి చలించిపోయిన కొందరు మానవతామూర్తులు, వాళ్లంతా ఎందుకిలా చేస్తున్నారో అని ఆరా తీయగా .. వాడిపోయిన మోములతో, రోజూ తమను డబ్బులు అడుక్కు రమ్మని ఆటోలో పంపిస్తున్నారని చెప్పారు. వాళ్లంతా ఒక అనాథాశ్రమంలో ఉండే చిన్నారులు. పిల్లలను రోడ్డుపై వదిలేయడంపై ఒక వంటమనిషి సాయంతో ఆశ్రమ నిర్వాహకురాలు క్రిష్ణమ్మను నిలదీయగా, ఇష్టమున్న చోట ఫిర్యాదు చేసుకోండని ఆమె దురుసుగా సమాధానమిచ్చింది. దీంతో హైదరాబాద్ కర్మన్‌ఘాట్ గ్రీన్‌పార్క్ కాలనీలోని అనాథాశ్రమానికి చెందిన రవికుమార్, రాహుల్, నితిన్, సాయితో పాటు మరో అమ్మాయిని వారు సైదాబాద్ పోలీసులకు అప్పగించారు. ఆశ్రమంలోని మరో 30 మంది విద్యార్థులు కూడా మరికొన్ని ప్రాంతాల్లో ఇలా నిధులు సేకరిస్తున్నారని ఈ పిల్లలు చెప్పడంతో, వెంటనే ఆశ్రమంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
వెదికిపెడతారు!
స్ఫూర్తి ఏడేళ్లక్రితం నేపాల్‌లో వచ్చిన వరదలపుడు జనుక అనే రెండేళ్లమ్మాయి తప్పిపోయింది. ఎవరో స్వచ్ఛందసంస్థవారు జనుకను ఓ అనాథాశ్రమంలో చేర్పించారు. వరదబీభత్సం కారణంగా అందరూ ఉండి కూడా అనాథగా మారిపోయిన జనుక ఈ మధ్యనే తన తల్లిని కలుసుకుంది. ఏడేళ్ల తర్వాత జనుక ఫోన్ చేసి తల్లితో మాట్లాడిన దృశ్యాన్ని చూసి ఆశ్రమంలోని వారంతా చలించిపోయారు. ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న అనాథాశ్రమంలోనే తన బిడ్డ ఉందని కనుక్కోలేకపోయిన ఆ తల్లి జనుకను గుండెలకు హత్తుకుని చెప్పిన మాట ‘....అంతా ఎన్‌జిఎన్ (నెక్ట్స్ జనరేషన్ నేపాల్) పుణ్యం’ అని.. ఎన్‌జిఎన్ అనేది ఒక స్వచ్ఛందసంస్థ. తప్పిపోయినవారి వివరాలిస్తే ఎన్ని తిప్పలు పడైనా వెదికిపెడుతుందన్నమాట. జనుక తల్లి చెప్పిన వివరాల ఆధారంగా రకరకాల శోధనలు చేసి తల్లినీ బిడ్డనీ కలిపింది ఎన్‌జిఎన్. అలాగే నేపాల్‌లోని హుమ్లా ప్రాంతానికి చెందిన లక్ష్మణ్ వయసు పన్నెండు. పాఠశాల విద్యార్థులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన లక్ష్మణ్ అకస్మాత్తుగా మాయమయ్యాడు. తప్పిపోయాడని కొందరు, అపహరించారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసి ఊరుకున్నారు. చివరికి ఈ కేసు ఎన్‌జిఎన్ బృందం చేధించింది. ఇలా తమ దృష్టికి వచ్చిన మిస్సింగ్ కేసులన్నింటినీ ఛేదిస్తున్న ఎన్‌జిఎన్ సేవలను నేపాల్ ప్రజలంతా ముక్తకంఠంతో అభినందిస్తున్నారు. -
కృష్ణాజిల్లాలో ఐదుగురు యువతుల అదృశ్యం