అమ్మ గోరుముద్దల రుచి చూసిన చిన్నారులు | Mother saw a little taste of the nail guilty | Sakshi
Sakshi News home page

అమ్మ గోరుముద్దల రుచి చూసిన చిన్నారులు

Published Thu, Feb 26 2015 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM

Mother saw a little taste of the nail guilty

రాయచూరు సంజె సత్సంకల్పంపై సర్వత్రా ప్రశంసలు

రాయచూరు: కనకదాస అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న చిన్నారులు అమ్మప్రేమ ను రుచి చూశారు. వీరికి అమ్మప్రేమను, గోరుముద్దల అప్యాయతలను చూపించాలన్న స త్సంకల్పం విజయవంతమైం ది. అనతికాలంలోనే జిల్లా ప్రజల ఆదరణ చూరగొన్న రాయచూరు సం జె దినపత్రిక, నవచేతన ఫౌండేషన్ ఇటీవల ఓ చక్కటి కార్యక్రమాన్ని స్థానిక ఉదయ్‌నగర్ పార్కులో నిర్వహించాయి. ఈ బిడ్డలందరికి కొన్ని గంటల పాటు తల్లులు లభించారు.

వారితో గోరుముద్దలు తిని దివ్యానుభూతికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆ ఆశ్రమ వ్యవస్థాపకులు మందకల్ బాబు, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జిల్లా డీడీ లక్ష్మీకాం తమ్మ, బా లల సంక్షేమ సమితి జిల్లాధ్యక్షురాలు జయశ్రీ, విజయానందపాటిల్, తహశీల్దార్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. చివరగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement