అమ్మ గోరుముద్దల రుచి చూసిన చిన్నారులు
రాయచూరు సంజె సత్సంకల్పంపై సర్వత్రా ప్రశంసలు
రాయచూరు: కనకదాస అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న చిన్నారులు అమ్మప్రేమ ను రుచి చూశారు. వీరికి అమ్మప్రేమను, గోరుముద్దల అప్యాయతలను చూపించాలన్న స త్సంకల్పం విజయవంతమైం ది. అనతికాలంలోనే జిల్లా ప్రజల ఆదరణ చూరగొన్న రాయచూరు సం జె దినపత్రిక, నవచేతన ఫౌండేషన్ ఇటీవల ఓ చక్కటి కార్యక్రమాన్ని స్థానిక ఉదయ్‌నగర్ పార్కులో నిర్వహించాయి. ఈ బిడ్డలందరికి కొన్ని గంటల పాటు తల్లులు లభించారు.
వారితో గోరుముద్దలు తిని దివ్యానుభూతికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆ ఆశ్రమ వ్యవస్థాపకులు మందకల్ బాబు, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జిల్లా డీడీ లక్ష్మీకాం తమ్మ, బా లల సంక్షేమ సమితి జిల్లాధ్యక్షురాలు జయశ్రీ, విజయానందపాటిల్, తహశీల్దార్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. చివరగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి.