
రామచంద్రం(ఫైల్)
సాక్షి, పెద్దపల్లి : బతికి ఉన్నపుడు ఒంటివాడు.. కనీసం చనిపోయిన తర్వాతైనా తన దేహాన్ని వైద్యకళాశాల విద్యార్థులకు పాఠంగా ఉపయోగపడాలని భావించిన రామచంద్రం కోరికను బంధువులు తీర్చారు. పెద్దపల్లికి చెందిన చిలుముల రామచంద్రం (65) ఎవరూ లేని అనాథ. తన ఇంటిని రూ. 25వేలకు అమ్మేసి కరీంనగర్‌లోని వీరబ్రహ్మేంద్రస్వామి అనాథ ఆశ్రమంలో చేరాడు. అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశాడు. రామచంద్రం కన్నుమూశాడు అనడం కంటే.. విద్యార్థులకు పాఠమై కళాశాలకు వెళ్లాడని చెప్పడం బాగుంటుందని పలువురు కొనియాడారు. ఆయన మృతదేహాన్ని కరీంనగర్‌లోని ప్రతిమ వైద్యకళాశాల అనాటమీ హెచ్‌ఓడీ డాక్టర్ కిషన్‌రెడ్డిని సంప్రదించి కళాశాలకు అప్పగించినట్లు బంధువులు కందుకూరి ప్రకాశ్ తెలిపారు.