రాసేదెలా!!
నిరంతర ‘అసమగ్ర’ మూల్యాంకనం!
* పాఠ్యప్రణాళికను పట్టించుకోని విద్యాశాఖ
* 29 నుంచి సమ్మెటివ్ పరీక్షలకు ఆదేశం
* ఫిబ్రవరి సిలబస్ ఇప్పుడే పూర్తి చేయాలట
* సెలవులు, పరీక్షలు, ఆటలతో సాగని బోధన
* విద్యార్థులు, ఉపాధ్యాయులపై పెరుగుతున్న ఒత్తిడి
* పదో తరగతి ఫలితాలపై ప్రభావం ఉంటుందేమో!
* ఆందోళన చెందుతున్న నిపుణులు, మేధావులు
కామారెడ్డి: పిల్లల జ్ఞానాత్మక, మానసిక చలనాత్మక, భావావేశ నైపుణ్యాలను పెంపొందించడంతోపాటు, బట్టీ చదువులకు చరమగీతం పాడుతూ, విశ్లేషనాత్మక ఆలోచనలతో సొంతంగా జ్ఞాన నిర్మాణం చేసుకోవడానికి ఎన్నో పరిశీలనల తరువాత సమగ్ర మూ ల్యాంకన విధానాన్ని రూపొందించారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరంలో పాఠ్యాంశాలను మార్చి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు.
ఏయే నెలలో ఎన్ని పీరియడ్లు బోధించాలి, ఏయే పాఠ్యాంశాలు బోధించాలన్నదానిపై పాఠ్య ప్రణాళికను స్పష్టంగా పేర్కొన్నారు. అయితే, అధికారులు అనాలోచిత నిర్ణయాలతో తాము రూపొం దించిన విధానాలకు తామే తూట్లు పొడుస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 29 నుంచి వచ్చే నెలాఖరు వరకు సమ్మెటివ్ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పాఠ్య ప్రణాళికలో మాత్రం ఫిబ్రవరి నెలకు సంబంధించి పాఠ్యాంశాలను బోధించాల్సి ఉంది.
ఆ పా ఠ్యాంశాలను ఈ నెలలోనే పూర్తి చేయాలని పేర్కొనడంతో అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు తలలుపట్టుకుంటున్నారు. ఇప్పటికే జనవరిలో ఒక టో తారీఖు సెలవు దినం కాగా, రెండు నుంచి తొ మ్మిది వరకు సమ్మెటివ్ పరీక్షలు జరిగాయి. పది నుంచి పదిహేను వరకు దసరా సెలవులు ఇచ్చారు. ఇందులోనే ఉపాధ్యాయులకు మూడు రోజులపాటు శిక్షణ ఇచ్చారు. ఈనెల 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహిస్తున్నారు. అంటే ఈ నెల మొత్తం ఎలాంటి పాఠ్యాం శాలు బోధించకుండానే గడిచిపోతోందన్నమాట. మరి, 29 నుంచి సమ్మెటివ్ పరీక్షలు ఎలా నిర్వ హిస్తారో అధికారులకే తెలియాలి.
ఎలా పూర్తి చేయాలో
విద్యా శాఖ రూపొందించిన పాఠ్యప్రణాళిక ప్రకారం విద్యాసంవత్సరంలో పనిదినాలు 220 ఉంటాయి. ఇందులో పరీక్షలు, ఫార్మెటివ్ అస్సెస్మెంట్, ఉపాధ్యాయులు వాడుకునే సెలవులకు 20 రోజులు గడచిపోతాయి. బందులు, ఇతర కారణాలకు మరో 20 రోజులు వృథాయే. కచ్చితంగా నడిచేది 180 రోజు లు మాత్రమే.ఇందులో ఆయా సబ్జెక్టులకు 170 నుం చి 180 పీరియడ్లు తప్పనిసరిగా నడిస్తేనే బోధన సాధ్యమవుతుంది.
ఇందులోనే మరో 20 రోజులు సమ్మెటివ్ పరీక్షలు, క్రీడల నిర్వహణ, ఇతర అవసరాలకు గడచిపోతాయి. మిగిలిన కాలంలో పాఠ్యాం శాలన్నిటినీ పూర్తి చేయడం కష్టమైన పని. విద్యార్థిపై ఒత్తిడి లేకుండా, బట్టీ పద్దతిని దూరం చేస్తూ అర్థమ య్యే రీతిలో సమగ్ర మూల్యాంకన జరగాలని చెప్పి న అధికారులు, అందుకు భిన్నంగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోంది.
పాఠ్యప్రణాళిక ఎందుకో మరి
ఫిబ్రవరిలో గణిత పుస్తకంలోని ‘సంభావ్యత’ అన్న పాఠ్యాంశానికి పది పీరియడ్లు కేటాయించారు. సాం ఘికశాస్త్రంలోని ఒకటో భాగంలో ‘సమానత- సుస్థిర అభివృద్ధి’ అన్న పాఠ్యాంశానికి ఐదు పీరియడ్లు, రెండో భాగంలో ‘సమ కాలీన సామాజిక ఉద్యమాలకు’ ఆరు పీరియడ్లు, ‘పౌరులు-ప్రభుత్వాలు’ అనే పాఠ్యాంశానికి ఐదు పీరియడ్లు ఉన్నాయి.
తెలుగు పుస్తకంలో ‘చిత్రగీతం’ పాఠ్యాంశానికి ఏడు పీరియడ్లు, ఆంగ్లంలో ‘హ్యూమన్‌రైట్స్’ అనే పాఠ్యాంశానికి 20 పీరియడ్లు, జీవశాస్త్రంలో ‘సహజ వనరులు’ పాఠ్యాంశానికి పది పీరియడ్లు, భౌతిక,రసాయన శాస్త్రంలో ‘కర్బనము-దాని సంయోగన పదార్థాలు’ అనే పాఠ్యాంశానికి పన్నెండు పీరియడ్లు కేటాయించారు. హిందీలో ‘ధర్తీకీ సవాల్’, ‘అంతరిక్ష్కీ జ వాబ్’, ‘అనోకా ఉపా’ అన్న పాఠ్యాంశాలకు పన్నెం డు పీరియడ్లు కేటాయించారు. ఇవన్నీ సమ్మెటివ్ పరీక్షలలోగా పూర్తవుతాయా! విద్యార్థులు పరీక్షలకు ఎలా సంసిద్ధమవుతారు!!
నిర్లక్ష్యమే
ఎన్నో సమీక్షలు, ఎన్నో సమావేశాలు, చర్చాగోష్టుల అనంతరం రూపొందించిన పాఠ్య ప్రణాళికను అమ లు చేసే విషయంలో విద్యా శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. విద్యార్థికి కృత్యాధారబోధన ద్వారా అభ్యసన సామర్థ్యాలను, బోధనాభ్యాసన విధానాల ను మెరుగుపరచుకోవవడం, నిరంతరం పరిశీలిస్తూ సవరణలు చేసుకునే అవకాశం కల్పించాలన్న లక్ష్యం నెరవేరడం లేదు.
బోధనాభ్యసన ప్రక్రియ విద్యార్థి కేంద్రీకృతగా సాగేందుకు తోడ్పడాల్సిన విషయాన్ని అధికారులు విస్మరించి విద్యార్థులపై ఒత్తిడి పెంచే చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పద్ధతులకు స్వసి ్తచెప్పి సమగ్రమూల్యంకనకు పాటుపడే చర్య లు చేపట్టాలని మేధావులు సూచిస్తున్నారు. మరి మన అధికారులు వినిపించుకుంటారా!