
అనాథలు అడగగానే గొంతువిప్పింది
లాస్ ఎంజెల్స్: చిన్నారుల కోసం ప్రముఖ హాలీవుడ్ పాప్ స్టార్ లేడి గాగా గొంతుసవరించింది. ఓ అనాథ ఆశ్రమాన్ని సందర్శించిన ఆమె వారి కోసం పాటపాడింది. ఈ 30 ఏళ్ల పాప్ సింగర్ మెక్సికోలోని కాపోసాన్ లుకాస్ అనే ప్రాంతంలో ఉన్న కాసా హోగర్ హోమ్ అనే బాలుర అనాథ ఆశ్రమానికి వెళ్లింది.
అయితే, అక్కడి చిన్నారులతో కబుర్లు చెబుతున్న ఆమెను క్రిస్టియాన్ అనే బాలుడు ఒక పాట తమకోసం పాడాలని అభ్యర్థించాడు. అతడు అలా అడిగాడో లేదో వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా గాగా చక్కగా ఓ గీతాన్ని ఆలపించారు. 'బోర్న్ దిస్ వే' అంటూ వారి కోసం పాటపాడి కొంత భావోద్వేగానికి లోనయ్యారు. ఇలా మ్యూజిక్ సిస్టం, ఇతర సంగీత సంబంధ పరికరాలు లేకుండా ఆమె గాల్లో తేలిపోయేట్లుగా సాంగ్ పాడి చిన్నారుల కోరికను తీర్చడమే కాకుండా తన పేరును నిలబెట్టుకున్నారు.