ఎవరూ లేని అనాథల జీవితాలు చిద్రం చేయడానికి కొందరు కీచకులు ప్రయత్నించారు.
వయనాడ్(కేరళ): ఎవరూ లేని అనాథల జీవితాలు చిద్రం చేయడానికి కొందరు కీచకులు ప్రయత్నించారు. 7గురు బాలికలపై నిందితులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. కేరళలోని వయనాడలో ఈ ఘోరం చోటు చేసుకుంది. వాయనాడలోని ఓఅనాధాశ్రమంలో బాలికలపై పక్కనే ఉన్న దుకాణం యజమాని బాలికలకు స్వీట్స్, చాకోలెట్స ఆశ చూపి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
విషయం తెలుసుకున్న ఆశ్రమ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 5గురు నిందితులను అరెస్టు చేశారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వయనాడలో ఓ చర్చి ఫాదర్ ఓ మైనర్ బాలికను తల్లిని చేసిన సంఘటనలో 7గురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.