రంగారెడ్డి మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలో ఉన్న అనాథ బాలల ఆశ్రమం కృషిహోంలో ఉండే ఇద్దరు బాలురు కనిపించకుండాపోయారు.
రంగారెడ్డి మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలో ఉన్న అనాథ బాలల ఆశ్రమం కృషిహోంలో ఉండే ఇద్దరు బాలురు కనిపించకుండాపోయారు. అనాథ గృహంలో ఆశ్రయం పొందుతున్న ఎన్.సాయిలు(13), మహేష్(10) అనే బాలురు బుధవారం ఉదయం టిఫిన్ చేసిన అనంతరం నుంచి కనిపించకుండా పోయారు. దీంతో నిర్వాహకులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవటంతో రాత్రి పోలీసులను ఆశ్రయించారు. కృషిహోం ట్యూటర్ ఎండీ సుమేర్ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.