యువతిపై అత్యాచారానికి యత్నించిన యువకుడిపై పోలీసులు నిర్భయ కేసు పెట్టి, రిమాండ్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం రొంపల్లికి చెందిన బాలిక(17) ఈనెల 15వ తేదీ రాత్రి 8.30 గంటల సమయంలో మంచినీటి కుళాయి వద్దకు బయలుదేరింది. అదే సమయంలో పొరుగింట్లో ఉండే తలారి మహేష్(25) ఆమెను చేయిపట్టుకుని పక్కకు లాగాడు.
ఆమె కేకలు వేయటంతో కుటుంబసభ్యులు అక్కడికి వచ్చారు. ఈలోగా మహేష్ పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితురాలు 16న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు మహేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ మేరకు అతనిపై నిర్భయ కేసు నమోదు చేసి గురువారం కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.