'నువ్వు గెలిస్తే నాకు ల్యాప్‌టాప్, బైక్ కొనివ్వాలి, నేను గెలిస్తే నీక్కూడా ఆ రెండు కొనిపెడతా' ఇది ఎక్కడో విన్నట్లుంది కదూ.. అవును ఈ మధ్యే విజయవంతంగా పూర్తైన బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో అఖిల్, సోహైల్ కుదుర్చుకున్న డీల్ ఇది. కానీ అన్నీ మనం అనుకున్నట్లు జరగవు కదా! వీరి విషయంలో కూడా అంతే... 25 లక్షల రూపాయలకు టెంప్ట్ అయి సోహైల్ ట్రోఫీ రేసు నుంచి తప్పుకుని సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. ఎలాగైనా టాప్ 2లో ఉండాలన్న కోరికతో అడుగుపెట్టి గ్రాండ్ ఫినాలే వరకు వచ్చిన అఖిల్ రన్నరప్‌గా నిలిచాడు. ఇద్దరినీ వెనక్కు నెట్టి అభిజిత్ విజేతగా అవతరించాడు. అలా వీరి డీల్ మధ్యలోనే ఆగిపోయింది.
ల్యాప్‌ట్యాప్‌తో అభిమానం చాటుకుంది
ఎవరికీ బైక్, ల్యాప్‌ట్యాప్ రాకుండా పోయింది అనుకుంటున్న తరుణంలో అఖిల్‌కు మాత్రం ఓ మంచి ల్యాప్‌ట్యాప్ వచ్చింది. జయలక్క్క్ష్మి అనే మహిళా అభిమాని విజయవాడ నుంచి వచ్చి మరీ అతడికి ల్యాప్‌ట్యాప్‌ను బహుమతిగా ఇచ్చింది. రెప్పకాలంపాటు ఇది నిజమా? కలా? అనుకున్న అఖిల్ కళ్లముందు అభిమాని ల్యాప్‌ట్యాప్ బ్యాగు పట్టుకుని కూర్చుండటం చూసి నమ్మక తప్పలేదు. తనకు అంత ఖరీదైన బహుమతినిచ్చినందుకు అఖిల్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. ఆమెకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలీక మాటలు వెతుక్కున్నాడు. ఎలాగైతేనేం ల్యాప్‌ట్యాప్ కావాలన్న తన స్నేహితుడి కోరిక నెరవేరినందుకు అతడి జిగిరీ దోస్త్ సోహైల్ కంగ్రాట్స్ తెలిపాడు. పలువురు అభిమానులు కూడా అఖిలే నంబర్ 1 అంటూ కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: అఖిల్ నిజంగానే బకరా అయ్యాడా?!)
'సిటీమార్'లో అఖిల్
కాగా ఈ సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లు అందరూ దాదాపు ఏదో ఒక పనిలో బిజీబిజీగా ఉన్నారు. ముఖ్యంగా దివి, సోహైల్, మెహబూబ్, మోనాల్, అభిజిత్‌కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అయితే అఖిల్‌కు కూడా ఏదో మంచి అవకాశం వచ్చిందట. కానీ దాన్ని సంక్రాంతికి చెప్తానంటూ సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. అయితే గోపీచంద్ సిటీమార్ సినిమాలో సెకండాఫ్ కోసం అఖిల్‌ను తీసుకున్నారన్న టాక్ అయితే నడుస్తోంది. మరి తనకు వచ్చిన అవకాశం అదేనా? ఇంకేదైనా ఉందా? అనే విషయాలను ఆయన అధికారికంగా చెప్పేవరకు వేచి చూడాల్సిందే! (చదవండి: కోటి రూపాయలు ఎగ్గొట్టిన వర్మ)
Comments
Please login to add a commentAdd a comment