సాక్షి, రంగారెడ్డి జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘మిషన్ కాకతీయ’ వైపు అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసే ఇంజినీర్లకు ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లు అందిస్తోంది.
ఇందులో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని జలసౌధలో జిల్లాకు సంబంధించిన ఈఈలు, డీఈలు, ఏఈలు దాదాపు 40 మందికి ల్యాప్‌టాప్‌లతోపాటు సర్వేకు సంబంధించిన మెటీరియల్ అందజేశారు. అనంతరం నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు చెరువుల పునరుద్ధరణపై ప్రణాళిలు రూపొందించే అంశాన్ని ఇంజినీర్లకు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
ప్రస్తుతం జిల్లాలో రెండున్నర వేల చెరువులున్నాయి. ఇందులో మొదటివిడత పావువంతు చెరువులకు మరమ్మతులు చేసేందుకు అధికారులు తాత్కాలిక ప్రణాళికలు తయారు చేశారు. త్వరలో చెరువులపై పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించిన తర్వాత తుది జాబితా తయారు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
వడివడిగా ‘మిషన్ కాకతీయ’
Published Sun, Dec 14 2014 12:06 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
Advertisement