రూ. 2700 కోట్లతో చెరువుల పునరుద్ధరణ | michine kakatiya moves fastly | Sakshi

రూ. 2700 కోట్లతో చెరువుల పునరుద్ధరణ

Published Sun, Dec 14 2014 7:23 PM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

తెలంగాణ రాష్ట్రంలో భారీ స్థాయిలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తోంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భారీ స్థాయిలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తోంది.  ఇందులో భాగంగా ఆదివారం నల్గొండ కలెక్టేరేట్ లో మిషన్ కాకతీయపై జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది.ఈ సమావేశానికి మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డితో పాటు ఎంపీలు  గుత్తా సుఖేందర్ రెడ్డి, నర్సయ్యలు హాజరయ్యారు.  మొత్తంగా రూ.2,700 కోట్లతో 46 వేల  చెరువుల పునరుద్ధరణకు తెలంగాణ సర్కారు సన్నద్ధమయ్యింది.

 

దీనిలో భాగంగానే 2015 మే నెలకు రాష్ట్రంలో 9 వేల చెరువులను పునరుద్ధరించాలని సమావేశంలో నిర్ణయించారు.265 టీఎంసీల నీటిని నిల్వ చేసి 25 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడమే ప్రధాన టార్గెట్ గా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement