స్మార్ట్రాన్‌ హైబ్రీడ్‌ ల్యాప్‌టాప్‌ లాంచ్‌ | Smartron tbook flex 2-in-1 laptop launched in India | Sakshi
Sakshi News home page

స్మార్ట్రాన్‌ హైబ్రీడ్‌ ల్యాప్‌టాప్‌ లాంచ్‌

Published Fri, May 4 2018 5:00 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

Smartron tbook flex 2-in-1 laptop launched in India - Sakshi

స్మార్ట్రాన్‌ ల్యాప్‌టాప్‌

సాక్షి, న్యూఢిల్లీ:  భారతదేశపు మొట్టమొదటి గ్లోబల్ టెక్నాలజీ, ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ తయారుదారు(OEM) స్టార్ట్రాన్‌  కంపెనీ  కొత్త టూ ఇన్‌వన్‌ ల్యాప్‌టాప్‌ను లాంచ్‌ చేసింది.  భారతదేశంలో దాని తరువాతి తరం "టీబుక్‌ ఫ్లెక్స్" హైపర్ ల్యాప్‌టాప్‌లను శుక్రవారం ప్రారంభించింది. ఇవి మే 13నుంచి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అందుబాటులోఉంటాయని వెల్లడించింది. ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ఈ హైబ్రిడ్‌ ల్యాప్‌టాప్‌ చాలా తొందరగా టాబ్లెట్‌,  ల్యాప్‌టాప్‌ మోడ్‌లోకి మారడమే  ప్రత్యేకత అని కంపెనీ పేర్కొంది.  ఎం3, ఐ 5 అనే వెర్షన్‌లలో అందుబాటులోకి తీసుకొచ్చిన  వీటి ధరలు వరుసగా   రూ .42,990,   రూ. 52,990 లుగా ఉండనున్నాయి.  

12.2అంగుళాల డిస్‌ప్లే,  2560x1600 పిక్సెల్స్ రిజల్యూషన్, లైట్‌ బాడీ, డిటాచ్‌బుల్‌ బ్యాక్‌లిట్‌  కీబోర్డు, ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌, థండర్‌ బోల్ట్‌ 3  యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌  ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఇంకా మల్టీ-టచ్ డిస్‌ ప్లే, 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,  5 మెగాపిక్సెల్ రియర్‌ కెమెరాను ఈ  డివైస్‌ కలిగి ఉంది.  డబుల్‌ మైక్‌, ఫవర్‌ఫుల్‌ స్పీకర్లు , ఫాస్ట్‌ డ్యుయల్‌ బ్యాండ్‌ వై-ఫై ఇతర ఫీచర్లు.  స్పెషల్‌ డ్యుయల్‌  టోన్ ఫినీష్‌, ఫిక్స్‌ స్టాండ్‌సహాయంతో  150 డిగ్రీల వరకు   ఈ ల్యాప్‌టాప్‌ను నిలవపచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆరెంజ్‌ గ్రే, బ్లాక్‌ గ్రే కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement