Smartron
-
స్మార్ట్రాన్ హైబ్రీడ్ ల్యాప్‌టాప్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశపు మొట్టమొదటి గ్లోబల్ టెక్నాలజీ, ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారుదారు(OEM) స్టార్ట్రాన్ కంపెనీ కొత్త టూ ఇన్వన్ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. భారతదేశంలో దాని తరువాతి తరం "టీబుక్ ఫ్లెక్స్" హైపర్ ల్యాప్‌టాప్‌లను శుక్రవారం ప్రారంభించింది. ఇవి మే 13నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోఉంటాయని వెల్లడించింది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ హైబ్రిడ్ ల్యాప్‌టాప్ చాలా తొందరగా టాబ్లెట్, ల్యాప్‌టాప్ మోడ్‌లోకి మారడమే ప్రత్యేకత అని కంపెనీ పేర్కొంది. ఎం3, ఐ 5 అనే వెర్షన్లలో అందుబాటులోకి తీసుకొచ్చిన వీటి ధరలు వరుసగా రూ .42,990, రూ. 52,990 లుగా ఉండనున్నాయి. 12.2అంగుళాల డిస్ప్లే, 2560x1600 పిక్సెల్స్ రిజల్యూషన్, లైట్ బాడీ, డిటాచ్బుల్ బ్యాక్లిట్ కీబోర్డు, ఫింగర్ ప్రింట్ స్కానర్, థండర్ బోల్ట్ 3 యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఇంకా మల్టీ-టచ్ డిస్ ప్లే, 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5 మెగాపిక్సెల్ రియర్ కెమెరాను ఈ డివైస్ కలిగి ఉంది. డబుల్ మైక్, ఫవర్‌ఫుల్ స్పీకర్లు , ఫాస్ట్ డ్యుయల్ బ్యాండ్ వై-ఫై ఇతర ఫీచర్లు. స్పెషల్ డ్యుయల్ టోన్ ఫినీష్, ఫిక్స్ స్టాండ్‌సహాయంతో 150 డిగ్రీల వరకు ఈ ల్యాప్‌టాప్‌ను నిలవపచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆరెంజ్ గ్రే, బ్లాక్ గ్రే కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. -
బడ్జెట్ ధర, అదిరిపోయే ఫీచర్లు
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బుడిబుడి అడుగులేస్తున్న'స్మార్ట్రాన్' కంపెనీ మరో కొత్త ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. టీ.ఫోన్.పీ పేరుతో బడ్జెట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. దీని ధర 7,999 రూపాయలు. ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే జనవరి 17 మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులో ఉండనుంది. నలుపు రంగులో మెటల్ బాడీతో ఈ ఫోన్ రూపొందింది. కంపెనీ ట్రాన్‌ఎక్స్ ప్రొగ్రామ్‌ను ఇది అందిస్తుంది. దీంతో యూజర్లు స్మార్ట్రాన్ టీక్లౌడ్, టీకేర్, టీస్టోర్, ట్రాన్‌ఎక్స్ ఏఐ సామర్థ్యాలను యాక్సస్ చేసుకోవచ్చు. స్మార్ట్రాన్ టీ.ఫోన్.పీ స్పెషిఫికేషన్లు.. 5.2 అంగుళాల హెచ్డీ డిస్ప్లే 2.5డీ కర్వ్డ్ గ్లాస్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 435 ఎస్ఓసీ 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ డ్యూయల్ సిమ్ సపోర్ట్, 4జీ వాయిస్ఓవర్ ఎల్టీఈ రియర్ పింగర్ఫ్రింట్ స్కానర్ ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ -
క్రికెట్ గాడ్ ఫాదర్ ఫోన్ వచ్చేస్తోంది!
క్రికెట్ కు గాడ్ ఫాదర్ సచిన్ టెండూల్కర్. ఆయన పేరుతో ఎక్స్ క్లూజివ్ గా బుధవారం ఓ స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతుంది. ఎలక్ట్రానిక్స్ బ్రాండు స్మార్ట్రాన్, మాజీ క్రికెట్ స్టార్ సచిన్ టెండ్కూలర్ కలిసి ఎస్ఆర్టీ.ఫోన్ పేరుతో ఈ ఫోన్ ను లాంచ్ చేయబోతున్నారు. సచిన్ టెండూల్కర్ లాంచ్ చేస్తున్న ఈ ఫోన్ ను కంపెనీ భారీగా ప్రచారం నిర్వహించనుంది. ఎక్స్ క్లూజివ్ గా ఫ్లిప్ కార్ట్ ప్లాట్ ఫామ్ పై ఎస్ఆర్టీ.ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. క్రికెట్ కు గాండ్ ఫాదర్ లాంటి సచిన్ టెండూల్కర్ సిగ్నేచర్ సిరీస్ తో రాబోతున్న తొలి స్మార్ట్ ఫోన్ ఎస్ఆర్టీ.ఫోన్ నేనని మార్కెట్ వర్గాలంటున్నాయి. '' సర్ ప్రైజ్ కి సిద్ధంగా ఉన్నారా? మేము చాలా ఉద్వేగభరితంగా వేచిచూస్తున్నాం. మీతో షేరు చేసుకోకుండా ఉండలేకపోతున్నాం. ఎస్ఆర్టీ ఫోన్ 2017 మే 3న మీ ముందుకు వచ్చేస్తుంది. రెడీగా ఉన్నారా?'' అని కంపెనీ చాలా ఆనందంతో ఓ ట్వీట్ చేసింది. స్మార్ట్ రాన్ ఇండియా బ్రాండులో రాబోతున్న రెండో స్మార్ట్ ఫోన్ కూడా ఇదే కావడం విశేషం. ఈ టెక్నాలజీ సంస్థ ఇటీవలే మోటోరోలా ఇండియా ఎగ్జిక్యూటివ్ అమిత్ బోనిని తమ సేల్స్, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ గా నియమించుకుంది. మొత్తం బ్రాండు బిల్డింగ్ బాధ్యతంతా అమిత్ బోనినే చూసుకుంటున్నారు. కంపెనీకి బ్రాండు అంబాసిడర్ గా ఉన్న సచిన్ టెండూల్కర్ స్మార్ట్ రాన్ లో ఫండ్స్ కూడా పెట్టారు. భారతీయులు తయారుచేసిన ఫోన్లను అమెరికన్ల చేతిలో చూడాలన్నదే తన కల అని సచిన్ తొలి స్మార్ట్ ఫోన్ లాంచింగ్ సందర్భంగా పేర్కొన్నారు.