స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బుడిబుడి అడుగులేస్తున్న'స్మార్ట్రాన్' కంపెనీ మరో కొత్త ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. టీ.ఫోన్.పీ పేరుతో బడ్జెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. దీని ధర 7,999 రూపాయలు. ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే జనవరి 17 మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులో ఉండనుంది. నలుపు రంగులో మెటల్ బాడీతో ఈ ఫోన్ రూపొందింది. కంపెనీ ట్రాన్‌ఎక్స్ ప్రొగ్రామ్‌ను ఇది అందిస్తుంది. దీంతో యూజర్లు స్మార్ట్రాన్ టీక్లౌడ్, టీకేర్, టీస్టోర్, ట్రాన్‌ఎక్స్ ఏఐ సామర్థ్యాలను యాక్సస్ చేసుకోవచ్చు.
స్మార్ట్రాన్ టీ.ఫోన్.పీ స్పెషిఫికేషన్లు..
5.2 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
2.5డీ కర్వ్‌డ్ గ్లాస్
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 435 ఎస్‌ఓసీ
3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
డ్యూయల్ సిమ్ సపోర్ట్, 4జీ వాయిస్‌ఓవర్ ఎల్టీఈ
రియర్ పింగర్‌ఫ్రింట్ స్కానర్
ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్
Comments
Please login to add a commentAdd a comment