క్రికెట్ గాడ్ ఫాదర్ ఫోన్ వచ్చేస్తోంది! | Sachin Tendulkar, Smartron to Launch srt.phone on Wednesday | Sakshi
Sakshi News home page

క్రికెట్ గాడ్ ఫాదర్ ఫోన్ వచ్చేస్తోంది!

Published Mon, May 1 2017 3:45 PM | Last Updated on Tue, Sep 5 2017 10:08 AM

Sachin Tendulkar, Smartron to Launch srt.phone on Wednesday



క్రికెట్ కు గాడ్ ఫాదర్ సచిన్ టెండూల్కర్.  ఆయన పేరుతో ఎక్స్ క్లూజివ్ గా బుధవారం ఓ స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతుంది. ఎలక్ట్రానిక్స్ బ్రాండు స్మార్ట్రాన్, మాజీ క్రికెట్ స్టార్ సచిన్ టెండ్కూలర్ కలిసి ఎస్ఆర్టీ.ఫోన్  పేరుతో ఈ ఫోన్ ను లాంచ్ చేయబోతున్నారు.  సచిన్ టెండూల్కర్ లాంచ్ చేస్తున్న ఈ ఫోన్ ను కంపెనీ భారీగా ప్రచారం నిర్వహించనుంది. ఎక్స్ క్లూజివ్ గా ఫ్లిప్ కార్ట్ ప్లాట్ ఫామ్ పై ఎస్ఆర్టీ.ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. క్రికెట్ కు గాండ్ ఫాదర్ లాంటి సచిన్ టెండూల్కర్ సిగ్నేచర్ సిరీస్ తో రాబోతున్న తొలి స్మార్ట్ ఫోన్ ఎస్ఆర్టీ.ఫోన్ నేనని మార్కెట్ వర్గాలంటున్నాయి.
 
'' సర్ ప్రైజ్ కి సిద్ధంగా ఉన్నారా? మేము చాలా ఉద్వేగభరితంగా వేచిచూస్తున్నాం. మీతో షేరు చేసుకోకుండా ఉండలేకపోతున్నాం. ఎస్ఆర్టీ ఫోన్ 2017 మే 3న మీ ముందుకు వచ్చేస్తుంది. రెడీగా ఉన్నారా?'' అని కంపెనీ చాలా ఆనందంతో ఓ ట్వీట్ చేసింది. స్మార్ట్ రాన్ ఇండియా బ్రాండులో రాబోతున్న రెండో స్మార్ట్ ఫోన్ కూడా ఇదే కావడం విశేషం. ఈ టెక్నాలజీ సంస్థ ఇటీవలే మోటోరోలా ఇండియా ఎగ్జిక్యూటివ్ అమిత్ బోనిని తమ సేల్స్, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ గా నియమించుకుంది. మొత్తం బ్రాండు బిల్డింగ్ బాధ్యతంతా అమిత్ బోనినే చూసుకుంటున్నారు. కంపెనీకి బ్రాండు అంబాసిడర్ గా ఉన్న సచిన్ టెండూల్కర్ స్మార్ట్ రాన్ లో ఫండ్స్ కూడా పెట్టారు.  భారతీయులు తయారుచేసిన ఫోన్లను అమెరికన్ల చేతిలో చూడాలన్నదే తన కల అని సచిన్ తొలి స్మార్ట్ ఫోన్ లాంచింగ్ సందర్భంగా పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement