ట్యాబ్లెట్ పీసీ మార్కెట్@ 200 కోట్ల డాలర్లు
Published Fri, Oct 4 2013 3:27 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM
న్యూఢిల్లీ: భారత ట్యాబ్లెట్ పీసీ మార్కెట్ ఈ ఏడాది 200 కోట్ల డాలర్లకు చేరుతుందని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ టెక్‌సై రీసెర్చ్ తెలిపింది. విద్యా, వాణిజ్య రంగాల్లో ట్యాబ్లెట్ల ప్రాధాన్యత పెరుగుతుండడమే దీనికి కారణమంటున్న ఈ నివేదిక వెల్లడించిన ఇతర ముఖ్యాంశాలు...,
వివిధ రంగాల్లో ట్యాబ్లెట్ పీసీల వినియోగం విరివిగా పెరుగుతోంది.
విద్యా, ప్రైవేట్, వాణిజ్య రంగాల్లో ట్యాబ్లెట్ల వినియోగానికే ప్రాధాన్యత అధికం అవుతోంది.
స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ యూజర్లు నుంచి కూడా భవిష్యత్తులో ట్యాబ్లెట్ పీసీలకు డిమాండ్ పెరగనున్నది. వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్‌లో అందివస్తున్న టెక్నాలజీ అవకాశాలు, జోరుగా విస్తరిస్తున్న సర్వీస్ రంగాల కారణంగా వేగవంతమైన, సులభమైన నెట్‌వర్కింగ్ సౌకర్యాలు అవసరమవుతున్నాయి. ఫలితంగా తక్కువ బరువున్న ట్యాబ్లెట్ వంటి కంప్యూటింగ్ పరికరాలకు డిమాండ్ పెరుగుతోంది.
2011-12లో 3.6 లక్షలుగా ఉన్న ట్యాబ్లెట్ల అమ్మకాలు 2012-13లో 427 శాతం వృద్ధితో 19 లక్షలకు చేరాయని మెయిట్ సంస్థ వెల్లడించింది. ఇక ఈ ఏడాది రెండో క్వార్టర్‌లో ట్యాబ్లెట్ అమ్మకాలు 107 శాతం వృద్ధితో 11 లక్షల 50 వేలకు చేరాయని సైబర్‌మీడియా రీసెర్చ్(సీఎంఆర్) తెలి పింది. గత ఏడాది 26.6 లక్షలుగా ఉన్న ట్యాబ్లెట్ పీసీల విక్రయాలు ఈ ఏడాది 60 లక్షలకు చేరతాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ పేర్కొంది.
Advertisement