ఒకేసారి మొబైల్, ల్యాప్‌టాప్ చార్జింగ్ | Universal Wireless Charger in the Offing | Sakshi
Sakshi News home page

ఒకేసారి మొబైల్, ల్యాప్‌టాప్ చార్జింగ్

Published Thu, Oct 15 2015 3:22 PM | Last Updated on Sun, Sep 3 2017 10:57 AM

ఒకేసారి మొబైల్, ల్యాప్‌టాప్ చార్జింగ్

ఒకేసారి మొబైల్, ల్యాప్‌టాప్ చార్జింగ్

వాషింగ్టన్: ఏక కాలంలో మొబైల్, ల్యాప్‌టాప్‌లను  చార్జింగ్ చేసే  సరికొత్త వైర్‌లెస్ చార్జర్‌ను కాలిఫోర్నియా వర్సిటీ సాంకేతిక  పరిశోధకులు రూపొందించారు. ప్రస్తుత చార్జర్లు ఒకే రకం ఫ్రీక్వెన్సీ ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలనే చార్జింగ్ చేస్తుండగా.. కొత్త చార్జర్.. 200 కిలో హెర్ట్‌జ్‌నుంచి 6.78మెగా హెర్ట్‌జ్ వరకు వేర్వేరు ఫ్రీక్వెన్సీలతో పనిచేసే ఏ రెండు ఎలక్ట్రానిక్ పరికరానికైనా తక్కువ సమయంలో చార్జింగ్ చేసేలా తయారుచేశారు. సాధారణ వైర్‌లెస్ చార్జింగ్ పరికరాల్లో ఒక ట్రాన్స్‌మీటర్ కాయిల్  ఉంటుంది.

అయితే.. రెండు స్మార్ట్‌ఫోన్లంత పరిమాణంలో మాత్రమే ఉండే ఈ చార్జర్‌లో రెండు (200కిలో హెర్ట్‌జ్, 6.78మెగా హెర్ట్‌జ్) ఉండటం వల్ల.. వేర్వేరు స్టాండర్డ్స్ (క్యూఐ, పవర్‌మ్యాట్, రెజెన్స్) ఉన్న పరికరాల్లోనూ ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement