Wireless Charger
-
షియోమీ సూపర్.. 8 నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్
చైనాకు చెందిన మొబైల్ దిగ్గజం షియోమీ మరో సంచలనానికి సిద్దం అయ్యింది. ఇప్పటికే సరికొత్త టెక్నాలజీని మార్కెట్లోకి తీసుకోస్తూ షియోమీ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. షియోమీ మరో రెండు కొత్త చార్జింగ్ టెక్నాలజీలను విడుదల చేసింది. వీటిలో 200వాట్ హైపర్‌చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ కాగా, మరొకటి 120వాట్ వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ. కంపెనీ పేర్కొన్న వివరాల ప్రకారం.. 200వాట్ హైపర్‌చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ సహయంతో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ గల ఫోన్ ని కేవలం 8 నిమిషాల్లోనే ఫుల్ చార్జ్ చేయనున్నట్లు పేర్కొంది. అలాగే, 120వాట్ వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్‌తో అదే సామర్ధ్యం గల బ్యాటరీని కేవలం 15 నిమిషాల్లో ఫుల్ చార్జ్ చేయవచ్చు. దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా షియోమీ షేర్ చేసింది. ఈ చార్జింగ్ సామర్థ్యానికి తగట్లు మార్పులు చేసిన ఎంఐ 10 ప్రోను 10 శాతం చార్జింగ్ కావడానికి సమయం పడితే, 50 శాతం చార్జింగ్ కావడానికి 8 నిమిషాలు, 100 శాతం చార్జింగ్ కావడానికి 19 నిమిషాలు పట్టింది. అయితే ఈ టెక్నాలజీని స్మార్ట్ ఫోన్ల కోసం ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారో తెలియదు. షియోమీ గతంలో 120వాట్ వైర్డ్, 80వాట్ వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీలను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: ఈపీఎఫ్ఓ చందాదారులకు గుడ్ న్యూస్ -
కార్లలో వైర్లెస్ సెల్‌ఫోన్ ఛార్జింగ్
కార్లు, బస్సుల్లో వైర్లెస్ పద్ధతిలో స్మార్ట్ ఫోన్లను ఛార్జ్ చేసుకునేందుకు భారతీయ కంపెనీ ఒక వినూత్నమైన ఆవిష్కరణ చేసింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న పవర్స్క్వేర్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ పరికరంలో ఫోన్‌ను ఉంచితే చాలు, వైర్లెస్ పద్ధతిలో దాని బ్యాటరీ ఛార్జ్ అవుతూంటుంది. కనెక్టర్లు, అడాప్టర్ల కోసం వెతుక్కోవాల్సిన పని లేదన్నమాట. వైర్లెస్ ఛార్జింగ్‌కు అనుకూలించే ఏ బ్రాండ్ ఫోన్‌నైనా దీంట్లో వినియోగించవచ్చు. డాష్ బోర్డుతోపాటు సెంట్రల్ కన్సోల్; ఆర్మ్రెస్ట్లలో ఎక్కడైనా బిగించుకునేందుకు ఇది అనువైందని అంటున్నారు కంపెనీ సీఈవో పూడిపెద్ది పవన్. ఛార్జింగ్ కోసం ఉంచిన స్మార్ట్‌ఫోన్‌కు ఏ స్థాయి విద్యుత్తు అవసరమన్నది కూడా ఈ పరికరమే గుర్తిస్తుందని చెప్పారు. సామ్సంగ్, ఆపిల్ ఐఫోన్లలోని కొన్ని మోడళ్లలో ఉండే ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్‌ను కూడా పసిగట్టి తనంతట తానే 7.5 లేదంటే పదివాట్ల విద్యుత్తును సరఫరా చేస్తుందని, భవిష్యత్తులో ఈ టెక్నాలజీని విద్యుత్తు వాహనాలతో పాటు మిక్సీ, గ్రైండర్, టోస్టర్ వంటి వంటింటి పరికరాలకూ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కాట్రగడ్డ ఆనంద్ తెలిపారు. -
ఒకేసారి మొబైల్, ల్యాప్‌టాప్ చార్జింగ్
వాషింగ్టన్: ఏక కాలంలో మొబైల్, ల్యాప్‌టాప్‌లను చార్జింగ్ చేసే సరికొత్త వైర్లెస్ చార్జర్‌ను కాలిఫోర్నియా వర్సిటీ సాంకేతిక పరిశోధకులు రూపొందించారు. ప్రస్తుత చార్జర్లు ఒకే రకం ఫ్రీక్వెన్సీ ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలనే చార్జింగ్ చేస్తుండగా.. కొత్త చార్జర్.. 200 కిలో హెర్ట్జ్నుంచి 6.78మెగా హెర్ట్జ్ వరకు వేర్వేరు ఫ్రీక్వెన్సీలతో పనిచేసే ఏ రెండు ఎలక్ట్రానిక్ పరికరానికైనా తక్కువ సమయంలో చార్జింగ్ చేసేలా తయారుచేశారు. సాధారణ వైర్లెస్ చార్జింగ్ పరికరాల్లో ఒక ట్రాన్స్‌మీటర్ కాయిల్ ఉంటుంది. అయితే.. రెండు స్మార్ట్ఫోన్లంత పరిమాణంలో మాత్రమే ఉండే ఈ చార్జర్‌లో రెండు (200కిలో హెర్ట్జ్, 6.78మెగా హెర్ట్జ్) ఉండటం వల్ల.. వేర్వేరు స్టాండర్డ్స్ (క్యూఐ, పవర్మ్యాట్, రెజెన్స్) ఉన్న పరికరాల్లోనూ ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు.