‘ల్యాప్‌టాప్’ స్పెషలిస్ట్
కనిపిస్తే చాలు కొట్టేస్తాడు
ఎంవీపీ పోలీసులకు చిక్కాడు
58 ల్యాప్‌టాప్‌లు, ఐపాడ్ స్వాధీనం
మహారాణిపేట(విశాఖ):విశాఖలో భారీ ఎత్తున ల్యాప్‌టాప్‌లు దొంగిలిస్తున్న ఘనుడు పోలీసులకు చిక్కాడు. సింగిల్‌గా ఉండే విద్యార్థుల గదులు, ల్యాప్‌టాప్ కలిగివున్న ఇళ్లపై కన్నేసి అపహరిస్తున్న మహమ్మద్ షకీల్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు క్రైం డీసీపీ టి.రవికుమార్ మూర్తి ఆదివారం విలేకరులకు తెలిపారు.
నిం దితుని నుంచి 58 ల్యాప్‌టాప్‌లు, ఒక ఐపాడ్ రికవరీ చేసినట్లు తెలిపారు. గతంలో మహమ్మద్ షకీల్ 6 ల్యాప్‌టాప్‌లు దొంగిలించి పట్టుబడ్డాడన్నారు. షకీల్ దొంగ సొత్తును ఇండియన్ నేవీలో పనిచేస్తున్న సుధీర్‌కుమార్ బెనివాల్, దీవన్‌సింగ్ కొనుగోలు చేస్తున్నారని డీసీపీ తెలి పారు. వీరికి నోటీసులు జారీ చేశామన్నారు.