ఏడు స్క్రీన్‌ల ల్యాప్‌టాప్‌ను చూశారా! | Expanscape Aurora 7 Is a Seven Screen Mega Laptop | Sakshi
Sakshi News home page

ఏడు స్క్రీన్‌ల ల్యాప్‌టాప్‌ను చూశారా!

Published Wed, Feb 24 2021 4:37 PM | Last Updated on Wed, Feb 24 2021 8:12 PM

Expanscape Aurora 7 Is a Seven Screen Mega Laptop - Sakshi

బ్రిటన్‌కు చెందిన‌ ఎక్స్‌పాన్ ‌స్కేప్‌ అనే కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా ఏడు స్క్రీన్‌ల ల్యాప్‌టాప్‌ అరోరా7ను తయారు చేసింది. ‘అరోరా 7’ అనే పేరుతో పిలిచే ల్యాప్‌టాప్ బరువు 11 కేజీలు. ఒకేసారి ఎక్కువ స్క్రీన్‌లపై పనిచేసే డాటా సైంటిస్ట్‌లు, కంటెంట్ క్రియేటర్స్, సైబర్ నిపుణులకు‌ మొదలైన వారికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని ఏడు స్క్రీన్‌లలో నాలుగు 17.3 అంగుళాల 4కే రిజల్యూషన్‌ స్క్రీన్‌లు, మిగిలిన మూడు 7 అంగుళాల 1200పీ ఫుల్ హెచ్‌డీ స్క్రీన్‌లు కలిగి ఉన్నాయి. 

ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ ఐ9 9900కే ప్రాసెసర్ ఉపయోగించారు. 64 జీబీ ర్యామ్‌, 2టీబీ స్టోరేజ్  ఇస్తున్నారు. దీని బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే గంటపాటు నిరంతరాయంగా పనిచేస్తుందని తెలిపారు. చూసేందుకు బాక్స్‌ తరహాలో ఉండే ఈ ల్యాప్‌టాప్‌లో స్క్రీన్‌లు తెరుచుకునేందుకు మొత్తం 13 దశల అన్‌ఫోల్డింగ్ వ్యవస్ధ ఉంది. దీని సహాయంతో అవసరమైన స్క్రీన్‌లను మాత్రమే తెరిచి పనిచేసుకోవచ్చు. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ స్క్రీన్‌లలో పనిచేయాలనుకునేవారు ఈ ల్యాప్‌టాప్‌ ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికే పలువురు ఈ ల్యాప్‌టాప్ కోసం ముందస్తు ఆర్డర్ చేశారట. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ల్యాప్‌టాప్‌ను త్వరలోనే పూర్తిస్థాయిలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారట.

చదవండి:

క్వాల్‌కామ్‌తో ఎయిర్‌టెల్‌ జట్టు

భారత్ లో విడుదలైన లగ్జరీ బీఎండబ్ల్యూ బైక్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement