ఐటీ మంత్రి వైష్ణవ్ వెల్లడి
న్యూఢిల్లీ: వచ్చే అయిదేళ్లలో సెమీ కండక్టర్ల తయారీలో భారత్ అంతర్జాతీయ స్థాయికి చేరగలదని కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. చిప్‌ల విభాగంలో తైవాన్ ఆధిపత్యాన్ని తగ్గించే దిశగా దేశీయంగా కొత్త ఫ్యాబ్రికేషన్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలు ఇందుకు దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు.
భారత్‌లో ప్లాంట్లు పెట్టేందుకు, సంబంధిత రంగాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు తయారీ సంస్థలు ముందుకొచ్చేలా ప్రభుత్వ విధానాలు ఆకర్షిస్తున్నాయని మంత్రి చెప్పారు. చైనాకి ప్రత్యామ్నాయంగా, ప్రజాస్వామ్య టెక్నాలజీ హబ్‌గా భారత్ నిలుస్తోందని ఆయన తెలిపారు. ‘భారత్‌కి ఎప్పుడు వెళ్లాలి.. అసలు వెళ్లొచ్చా అని గతంలో అంతా అలోచించే వారు.
కానీ ఇప్పుడు వీలైనంత ముందుగా వెళ్లాలి అనుకుంటున్నారు. అటువంటి మార్పు కనిపిస్తోంది. ప్రతి పెద్ద సంస్థ భారత్‌లో పెట్టుబడులు పెట్టే ఆలోచనల్లో ఉంది‘ అని పేర్కొన్నారు. కేంద్రం ఇటీవలే దాదాపు రూ. 1.26 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే మూడు సెమీకండక్టర్ ప్లాంట్ల ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. వీటిలో టాటా గ్రూప్ తలపెట్టిన మెగా ఫ్యాబ్ కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment