ముంబై: పండుగ సీజన్ కలిసిరావడంతో అక్టోబర్‌లో ఆటో అమ్మకాలు పెరిగాయి. ఎస్‌యూవీ, మిడ్ సిగ్మెంట్, ఎంట్రీ లెవల్ కార్లకు భారీగా డిమాండ్ పెరగడంతో పాసింజర్ వాహన విక్రయాలు గణనీయమైన వృద్ధిని సాధించాయి. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా-మహీంద్రా, కియా మోటార్స్, హోండా కార్స్ ఇండియా చెప్పుకొదగిన స్థాయిలో అమ్మకాలు జరిపాయి. అయితే ఇదే నెలలో ద్విచక్ర విక్రయాలు విక్రయాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, హోండా మోటోసైకిల్ అండ్ స్కూటర్ ఇండియా, టీవీఎస్ మోటార్ విక్రయాలు నిరాశపరిచాయి.
♦ మారుతీ సుజుకీ ఇండియా దేశీయ విక్రయాలు అక్టోబర్‌లో 1,67,520కు చేరాయి. గతేడాది అక్టోబర్ అమ్మకాలు 1,38,335తో పోలిస్తే 21 శాతం పెరిగాయి.
♦ హ్యుందాయ్ మోటార్ ఇండియా విక్రయాలు 43,556 నుంచి 33% వృద్ధితో 58,006 యూనిట్లకు చేరాయి.
♦ టాటా మోటార్స్ అమ్మకాలు 15 శాతం వృద్దిని సాధించి 78,335 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే ఆగస్టులో 67,829 యూనిట్లు అమ్ముడయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment