ముంబై: సెమీకండక్టర్ల కొరత ప్రభావం తగ్గుముఖం పట్టడంతో దేశీయ వాహన విక్రయాలు జూన్‌లో వృద్ధి బాటపట్టాయి. ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ ఊపందుకోవడంతో ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరిగాయి.
మారుతీ సుజుకీతో సహా హ్యుందాయ్, టాటా మోటార్స్, కియా మోటార్స్, ఎంజీ మోటార్స్ కంపెనీలు సమీక్షించిన నెలలో సానుకూల అమ్మకాలను సాధించాయి. ఆర్థిక రికవరీలో భాగంగా మౌలిక, నిర్మాణ రంగం ఊపందుకుంది. ఫలితంగా వాణిజ్య వాహన విక్రయా ల్లో వృద్ధి నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ ఊపందుకోవడంతో బజాజ్ ఆటో మినహా మిగిలిన అన్ని ద్విచక్ర వాహన కంపెనీల అమ్మకాలు ఆశించిన స్థాయిలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment