
న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహనాల (పీవీ) హాల్‌సేల్ విక్రయాలు వరుసగా 11వ నెల్లోనూ గణనీయంగా తగ్గినట్లు ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ) శుక్రవారం ప్రకటించింది. పండుగల సీజన్ వినియోగదారుల సెంట్‌మెంట్‌ను బలపరచలేకపోయిన కారణంగా సెప్టెంబర్ పీవీ 2,23,317 యూనిట్లుగా నమోదైనట్లు వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే నెల్లో నమోదైన 2,92,660 యూనిట్ల విక్రయాలతో పోల్చితే ఏకంగా 23.69 శాతం క్షీణత ఉన్నట్లు తెలియజేసింది. ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో 23.56% తగ్గుదల నమోదైంది. దేశీయంగా గత నెల కార్ల విక్రయాలు 1,31,281 యూనిట్లు(33.4% క్షీణత).