ముంబై: ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు దేశవ్యాప్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 18-20 శాతం వృద్ధి నమోదు చేయవచ్చని క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ కేర్‌ఎడ్జ్ తన నివేదికలో తెలిపింది. కొత్త మోడళ్లు, యుటిలిటీ వాహనాల పట్ల కస్టమర్లు ఆసక్తి చూపడంతో 2024–25లోనూ ఇదే జోరు ఉంటుందని అంచనా వేస్తోంది.
‘మెరుగైన ఆర్డర్ బుక్, సరఫరా వ్యవస్థ ఈ వృద్ధికి కారణం. ప్రీమియం వేరియంట్లకు బలమైన డిమాండ్ కొనసాగుతుంది. అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణ ప్రభావంతో ఎంట్రీ లెవెల్ మోడళ్ల విక్రయాలు తగ్గుతున్నాయి. మార్కెట్లోకి మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలు రానున్నాయి. భారత ఆటోమొబైల్ రంగంలో ప్యాసింజర్ వెహికిల్స్ వాటా 18 శాతంగా ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో పీవీ అమ్మకాలు దేశీయంగా 25 శాతం పెరిగాయి. ఎగుమతులు 3 శాతం అధికం అయ్యాయి. పీవీల్లో ఎలక్ట్రిక్ మోడళ్ల వాటా 2 శాతం లోపే ఉంది’ అని నివేదిక వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment