భారీగా పెరిగిన ప్యాసింజర్‌ వెహికల్స్ సేల్స్.. వాటికే ఎక్కువ డిమాండ్! | Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన ప్యాసింజర్‌ వెహికల్స్ సేల్స్.. వాటికే ఎక్కువ డిమాండ్!

Published Tue, Feb 27 2024 7:00 AM

Passenger Vehicle Sales High - Sakshi

2024–25లో 5–7 శాతం వృద్ధి

మార్కెట్లో ఎస్‌యూవీలదే హవా

క్రిసిల్‌ తాజా నివేదికలో వెల్లడి

ప్యాసింజర్‌ వాహనాల విక్రయాల పరిమాణం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5–7 శాతం వృద్ధి చెందుతుంని క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ తాజా నివేదికలో వెల్లడించింది. వరుసగా మూడవ ఏడాది పరిశ్రమ కొత్త రికార్డులు నమోదు చేస్తుందని తెలిపింది. దేశీయంగా కార్ల విక్రయాలు, వీటి ఎగుమతులకు డిమాండ్‌ స్తబ్దుగా ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6–8 శాతం గరిష్ట వృద్ధిని అంచనా వేసిన నేపథ్యంలో.. 2024–25 అమ్మకాల్లో 5–7 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్టు క్రిసిల్‌ తెలిపింది. క్రిసిల్‌ నివేదిక ప్రకారం.. 

ఎస్‌యూవీలకు డిమాండ్‌.. 
వినియోగదారుల ప్రాధాన్యతలో గణనీయ మార్పు ఎస్‌యూవీలకు డిమాండ్‌ను పెంచింది. మహమ్మారి కంటే ముందునాటి 2018–19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్యాసింజర్‌ వాహన విభాగంలో ఎస్‌యూవీల వాటా 28 శాతం నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం రెండింతలై 60 శాతానికి చేరింది. ఎలక్ట్రిక్‌ వేరియంట్‌లతో సహా వివిధ ధరల శ్రేణిలో కొత్త మోడళ్ల రాక, భవిష్యత్‌ మోడళ్లు, సెమీకండక్టర్ల సాధారణ లభ్యత కారణంగా ఎస్‌యూవీలకు ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. 2024–25లో ఎస్‌యూవీల విక్రయాల్లో 12 శాతం వృద్ధి ఉండొచ్చు. హైబ్రిడ్, ఎలక్ట్రిక్‌ కార్ల విభాగాల్లో పోటీ ధరలో ఫీచర్లతో కూడిన మోడళ్ల రాక ఈ జోరుకు ఆజ్యం పోస్తుంది.   

కార్ల ధరల్లో పెరుగుదల.. 
విడిభాగాలు, తయారీ వ్యయం పెరుగుతూ వస్తోంది. భద్రత, ఉద్గారాలపై మరింత కఠిన నిబంధనలను తయారీ సంస్థలు పాటించాల్సి రావడంతో వాహనాల ధర గత 3–4 సంవత్సరాలలో అధికం అయింది. ప్యాసింజర్‌ వాహనాల ఎగుమతుల వాటా 2018–19 ఆర్థిక సంవత్సరంలో 17 శాతం ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 14 శాతానికి పరిమితం అవుతుందని అంచనా. గత రెండేళ్లలో కీలక ఎగుమతి మార్కెట్లు లాటిన్‌ అమెరి కా, ఆగ్నేయాసియా, ఆఫ్రికాలో ద్రవ్యోల్బణం ఎదు రుగాలులు, పరిమిత విదేశీ మారకపు లభ్యత దీనికి ప్రధాన కారణం. 2024–25లోనూ ఈ ట్రెండ్‌ కొనసాగుతుంది. అయితే స్థిర కమోడిటీ ధరలు, గత ఆర్థిక సంవత్సరంలో అమలైన ధరల పెంపు పూర్తి ప్రయోజనంతోపాటు ఎస్‌యూవీల వాటా పెరగడంతో తయారీదారుల నిర్వహణ లాభాలు సు మారు 2 శాతం ఎగసి ఈ ఆర్థిక సంవత్సరంలో 11 శాతానికి చేరుతుంది. ఎస్‌యూవీలకు డిమాండ్‌తో 2024–25లో ఇది 11.5–12.5 శాతంగా ఉండొచ్చు.

రూ.44,000 కోట్ల పెట్టుబడి..
ఈ ఆర్థిక సంవత్సరంలో సామర్థ్య వినియోగం దాదాపు 85 శాతానికి చేరుకోవచ్చు. ఎస్‌యూవీల కు బలమైన డిమాండ్‌ కొనసాగుతున్నందున ప్యా సింజర్‌ వాహన తయారీ సంస్థలు 2023–25 మధ్య సుమారు రూ.44,000 కోట్ల పెట్టుబడి వ్యయం చేస్తున్నాయి. గత రెండు ఆర్థిక సంవత్సరాలతో పో లిస్తే ఇది దాదాపు రెండింతలు. అయితే ఆరోగ్యక రంగా నగదు చేరడం, మిగులు కారణంగా రుణా లపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. తయారీదారుల క్రెడిట్‌ ప్రొఫైల్‌లను క్రిసిల్‌ స్థిరంగా ఉంచుతోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement