న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కంపెనీకి గత ఆర్థిక సంవత్సరం(2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.9,864 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. అంతకుముందటి ఆర్థిక సంవత్సరం(2018–19) ఇదే క్వార్టర్‌లో రూ.1,109 కోట్ల నికర లాభం ఆర్జించామని టాటా మోటార్స్ తెలిపింది. కరోనా వైరస్ కల్లోలంతో దేశీయ వ్యాపారమే కాకుండా లగ్జరీ కార్ల విభాగం, జేఎల్‌ఆర్ వ్యాపారం కూడా దెబ్బతినడంతో గత క్యూ4లో భారీగా నష్టాలు వచ్చాయని వివరించింది. కార్యకలాపాల ఆదాయం రూ.86,422 కోట్ల నుంచి 28 శాతం క్షీణించి రూ.62,493 కోట్లకు తగ్గిందని పేర్కొంది. సాధారణ ఆర్థిక మందగమనం, లిక్విడిటీ ఒత్తిడి, బీఎస్–సిక్స్ నిబంధనల అమలు కారణంగా నిల్వలకు సంబంధించి సమస్యలకు తోడు లాక్‌డౌన్ కారణంగా అమ్మకాలు భారీగా పడిపోయాయని వెల్లడించింది. చైనాలో సేల్స్ పుంజుకుంటున్నాయని జేఎల్‌ఆర్ సీఈఓ రాల్ప్ స్పెత్ పేర్కొన్నారు.
► జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్‌ఆర్)కు గత క్యూ4లో 50 కోట్ల పౌండ్ల (సుమారు రూ. 4,750 కోట్లు) నికర నష్టాలు, 540 కోట్ల పౌండ్ల (సుమారు రూ.51,300 కోట్లు) ఆదాయం వచ్చింది.
► స్డాండ్ అలోన్ పరంగా, 2018–19 క్యూ4లో రూ.106 కోట్ల నికర లాభం రాగా, గతేడాది క్యూ4లో రూ.4,871 కోట్ల నికర నష్టాలు వచ్చాయి.
► పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2018–19లో రూ.28,724 కోట్ల నికర నష్టాలు రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.11,975 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ఆదాయం రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.2.61 లక్షల కోట్లకు తగ్గింది.
► మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చాయి. బీఎస్‌ఈలో టాటా మోటార్స్ షేర్ 4.5% నష్టంతో రూ.100 వద్ద ముగిసింది. అయితే న్యూయార్క్ స్టాక్ ఎక్సే ్చంజ్‌లో లిస్టైన టాటా మోటార్స్ ఏడీఆర్ మాత్రం 7% ఎగసి ఏడు డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
టాటా మోటార్స్ నష్టాలు 9,864 కోట్లు
Published Tue, Jun 16 2020 6:43 AM | Last Updated on Tue, Jun 16 2020 6:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment