బెర్కిలీ, అమెరికా: కరోనా వైరస్ వ్యాప్తిపరమైన ప్రతికూల పరిణామాలతో టెక్ దిగ్గజం యాపిల్ ఉత్పత్తుల విక్రయాలు మందగించాయి. జనవరి–మార్చి త్రైమాసికంలో ఐఫోన్ విక్రయాలు గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 7 శాతం తగ్గాయి. సంస్థ లాబాలు 2 శాతం క్షీణించి 11.2 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. సరఫరాపరమైన సమస్యలు, వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అమలవుతున్న లాక్‌డౌన్ కారణంగా స్టోర్స్ మూతబడటం తదితర అంశాలు ఇందుకు కారణం. అయితే, ఆదా యం స్వల్పంగా 1 శాతం పెరిగి 58.3 బిలియన్ డాలర్లకు చేరింది. 2007– 2009 కాలంలో తలెత్తిన మాం ద్యం నాటి పరిస్థితి కన్నా ప్రస్తుత మందగమ నం మరింత తీవ్రంగా ఉండవచ్చని యాపిల్ సీఈవో టిమ్ పేర్కొన్నారు. అయితే, అనలిస్టుల అంచనాలకన్నా యాపిల్ కాస్త మెరుగైన ఫలితాలు సాధించినట్లు పరిశ్రమవర్గాలు తెలిపా యి. జనవరి–మార్చి త్రైమాసికంలో కంపెనీ ఆదా యం 6% పడొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment