
న్యూఢిల్లీ: దేశీ ఆటో పరిశ్రమకు కోవిడ్–19 (కరోనా) వైరస్ కుంగదీసింది. గతేడాదిలో భారీ పతనాన్ని నమోదుచేసి.. ఈ ఏడాది ప్రారంభంలో కాస్త పర్వాలేదు అనిపించిన ఈ రంగాన్ని తాజాగా కరోనా వైరస్ మళ్లీ పడేసింది. దిగ్గజ ఆటో సంస్థ మారుతి సుజుకీ దేశీయ వాహన విక్రయాలు ఫిబ్రవరి నెలలో 1.6 శాతం పడిపోయాయి. గత నెల్లో 1,36,849 యూనిట్లకు పరిమితమయ్యాయి. మహీంద్ర అండ్ మహీంద్ర (ఎం అండ్ ఎం) అమ్మకాలు ఏకంగా 42 శాతం క్షీణించాయి. కరోనా వైరస్ కారణంగా చైనా నుంచి సప్లై తగ్గడం వల్ల ఈ స్థాయి పతనం నమోదైందని సంస్థ చీఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ (ఆటోమోటివ్ డివిజన్) వీజయ్ రామ్ నక్రా వెల్లడించారు. వైరస్ కారణంగానే తమ కంపెనీ ఫిబ్రవరి విక్రయాలు తగ్గాయని టాటా మోటార్స్ ప్యాసెంజర్ వెహికిల్స్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment