మీ ఫోన్‌లో ఈ కీబోర్డ్ వాడుతున్నారా? అయితే వెంటనే ఆ కీబోర్డ్ యాప్‌ను తొలగించండి. లేదంటే జేబుకు చిల్లు పడినట‍్లేనని ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ హెచ్చరికలు జారీ చేసింది. ఆ కీబోర్డ్ యాప్‌తో పాటు 'ట్రోజన్' జోకర్ అనే మాల్వేర్‌తో సైబర్ దాడులు చేస్తున్న మరికొన్ని యాప్స్‌ను గూగుల్ బ్యాన్ చేసింది. స్మార్ట్ ఫోన్ యూజర్లు ఎవరైనా ఆ యాప్స్‌ను వినియోగిస్తుంటే వెంటనే డిలీట్ చేయాలని కోరింది.
ప్రముఖ సెక్యూరిటీ సంస్థ క్యాస్పర్ స్కై కథనం ప్రకారం.. ఇటీవల గూగుల్' ప్లే స్టోర్‌లో ఉన్న ఏడు యాప్‌లలో మాల్‌వేర్ ఉన్నట్లు గుర్తించింది. వెంటనే వాటిని తొలగించింది. ఈ సందర్భంగా క్యాస్పర్ స్కై అనలిస్ట్ టట్యానా షిష్కోవా మాట్లాడుతూ..ఆ ఏడు యాప్స్‌లలో జోకర్ మాల్వేర్ ఉన్నట్లు తాము గుర్తించినట్లు తెలిపారు. ఇటీవల, సైబర్ నేరస్తులు స్క్విడ్ గేమ్ యూజర్లను యాప్‌ల సాయంతో దాడులకు పాల్పడుతున్నారు. దీంతో గూగుల్..ప్లే స్టోర్‌లో ఉన్న ఆ యాప్‌లను తొలగించింది. అయినా మిలియన్ల మంది ఆ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడంతో .. గూగుల్' ప్లే స్టోర్‌లో ఉన్న యాప్స్‌పై దృష‍్టిసారించింది. ఈ నేపథ్యంలో కింది పేర్కొన్న యాప్స్‌ను గూగుల్ డిలీట్ చేసింది.
1. Now QRcode Scan (Over 10,000 installs)
2. EmojiOne Keyboard (Over 50,000 installs)
3. Battery Charging Animations Battery Wallpaper (Over 1,000 installs)
4. Dazzling Keyboard (Over 10 installs)
5. Volume Booster Louder Sound Equalizer (Over 100 installs)
6. Super Hero-Effect (Over 5,000 installs)
7. Classic Emoji Keyboard (Over 5,000 installs)
దాడులు పెరిగిపోతున్నాయ్
కరోనా కారణంగా సైబర్ నేరస్తులు అమాయకుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఆఫర్ల పేరుతో ఫేక్ యాప్‌లను క్రియేట్ చేస్తున్నారు. వాటి సాయంతో మాల్వేర్‌ను ఫోన్‌లలోకి పంపి యూజర్ల డేటాను దొంగిలిస్తున్నారు. ఆ డేటాను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. అదీ చాలదన్నట్లు ఇటీవల స్క్వీడ్ గేమ్ హవా కొనసాగుతుండడంతో సైబర్ నేరస్తులు కొత్త పంథాని అనుసరిస్తున్నారు. స్క్వీడ్ గేమ్ వెబ్ సిరీస్ యాప్స్‌తో బ్యాంక్ అకౌంట్లలో ఉన్న మనీని కాజేస్తున్నారు. అయితే ఇలాంటి యాప్స్ పట్లు యూజర్లు అప్రమత్తంగా ఉండాలని, ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే డిలీట్ చేయాలని క్యాస్పర్కై అనలిస్ట్ టట్యానా షిష్కోవా సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment