
సైబర్ నేరస్తులు కొత్త పుంతలను తొక్కుతూ..ఏకంగా గూగుల్ ప్లే స్టోర్‌లోకి నకిలీ యాప్స్‌ను రిలీజ్ చేస్తున్నారు. గూగుల్ నిర్వహించే అనేక భద్రతా తనిఖీలను కూడా తప్పించుకొని ప్లే స్టోర్స్‌లో యాప్స్‌ను కన్చించేలా హ్యకర్లు చేస్తున్నారు. కాగా తాజాగా గూగుల్ ప్లే స్టోర్‌లోని పలు యాప్స్ యూజర్లకు హాని కల్గించే 10 యాప్స్‌ను గూగుల్ గుర్తించింది. ఇప్పటికే పలు యూజర్లు ఈ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు గూగుల్ తెలిపింది.
యూజర్ల డేటాను..!
గూగుల్ బ్యాన్ చేసిన 10 పాపులర్ యాప్స్ యూజర్ డేటాను దొంగిలిస్తున్నాయని తెలిసింది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం... నిషేధిత యాప్‌లు ఇప్పటివరకు 60 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్ అయిన్నట్లు తెలుస్తోంది. ఈ యాప్స్ సహాయంతో హ్యాకర్లు యూజర్ల కచ్చితమైన లొకేషన్‌ను తెలుసుకోవచ్చునని కూడా నివేదిక పేర్కొంది. దాంతో పాటుగా ఈ యాప్‌లను ఉపయోగించి ఈ-మెయిల్స్, ఫోన్ నంబర్లు, పాస్‌వర్డ్‌లను హ్యకర్లు దొంగిలిస్తున్నట్లు తెలిసింది. దీంతో యూజర్ల బ్యాంకు వివరాల గురించి తెలుసుకోవడం సులువు కానుంది. 'కట్ అండ్ పేస్ట్' పద్ధతి ద్వారా డేటా చౌర్యం జరుగుతున్నట్లు తెలిసింది. అంతేకాకుండా సదరు యూజరు ఏదైనా OTP లేదా ఇతర వివరాలను కాపీ-పేస్ట్ చేసినప్పుడు, హ్యాకర్లు ఈ యాప్‌ల నుంచి యూజర్లకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను దొంగిలించవచ్చునని తెలిసింది. అదనంగా హ్యకర్లు ఈ యాప్స్ సహాయంతో యూజర్ల వాట్సాప్‌ను కూడా యాక్సెస్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.
గూగుల్ ప్లే స్టోర్ నుంచి గూగుల్ నిషేధించిన 10 యాప్స్ ఇవే..!
1. స్పీడ్ రాడార్ కెమెరా
2. AI-Moazin లైట్ (ప్రార్థన సమయాలు)
3. Wi-Fi మౌస్ (రిమోట్ కంట్రోల్ PC)
4. QR & బార్‌కోడ్ స్కానర్ (AppSource Hub ద్వారా అభివృద్ధి చేయబడింది)
5. Qibla కంపాస్ - రంజాన్ 2022
6. సింపుల్ వెదర్ & క్లాక్ విడ్జెట్ (డిఫర్ సంస్థ డెవలప్ చేసింది)
7. హ్యాండ్‌సెంట్ నెక్స్ట్ SMS- టెక్స్ట్ విత్ ఎంఎంఎస్
8. స్మార్ట్ కిట్ 360
9. ఫుల్ ఖురాన్ MP3-50 లాంగ్వేజ్స్ & ట్రాన్స్‌లేషన్ ఆడియో
10. Audiosdroid ఆడియో స్టూడియో DAW
చదవండి: తక్కువ ధరలో...108ఎంపీ కెమెరాతో సూపర్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన రియల్‌మీ..!
Comments
Please login to add a commentAdd a comment