సాక్షి, హైదరాబాద్: ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు బిగ్ షాక్ తగలనుంది. యాప్స్ విషయంలో గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో కాల్ రికార్డింగ్ యాప్స్‌ను తొలగించనున్నట్టు పేర్కొంది. యాజర్ల ప్రైవసీని దెబ్బతీస్తున్నాయన్న కారణంతో థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్ అన్నింటినీ నిలిపేయాలని గూగుల్ నిర్ణయించింది. మే 11 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే, మీ ఫోన్‌లో వాయిస్ కాల్ మాట్లాడుతున్నప్పుడు, ఆన్లైన్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటున్నప్పుడు ఆ కాల్స్‌ను రికార్డ్ చేయడం ఇక కుదరకపోవచ్చు. గూగుల్ డయలర్ లేదా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ డిఫాల్ట్‌గా ఇచ్చే డయలర్ ద్వారా మాత్రమే ఇకపై కాల్ రికార్డింగ్ ఫీచర్ అందుబాటులో ఉండనుంది. కాగా, గూగుల్ డయలర్ ద్వారా ఎవరైనా ఈ ఫీచర్ ఉపయోగిస్తుంటే అవతలి వ్యక్తికి కూడా ఈ కాల్ రికార్డు చేస్తున్నారనే అలర్ట్ వస్తుంది.
ఇదిలా ఉండగా.. కాల్ రికార్డింగ్‌కు గగుల్ ఎప్పుడూ వ్యతిరేక స్వరాన్నే వినిపించింది. అవతలి వ్యక్తికి తెలియకుండా ఫోన్‌లో వారి వాయిస్‌ను రికార్డ్ చేయడం ద్వారా యూజర్ల ప్రైవసీకి భంగం కలుగుతుందన్నది గూగుల్ ఇప్పటికే చాలా సందర్బాల్లో పేర్కొంది. అందులో భాగంగానే కాల్ రికార్డింగ్ యాప్స్‌ను తొలగించేందుకు సిద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment