
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. యాప్స్ డెవలపర్లకు భారీ షాకిస్తూ 12లక్షల యాప్స్‌ను బ్లాక్ చేసింది. 2021లో గూగుల్ ప్లేస్టోర్ ప్రైవసీ పాలసీ నిబంధనల్ని ఉల్లంఘించినందునే 12లక్షల యాప్స్‌పై చర్యలు తీసుకున్నట్లు గూగుల్ ప్రకటించింది.
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌తో జనాల్ని పీక్కుతింటున్న యాప్‌లు గూగుల్ ప్లేస్టోర్‌లో చాలానే ఉన్నాయని గూగుల్ గుర్తించింది. అలాంటి మోసపూరిత, సేఫ్ కానీ యాప్‌లపై చెక్ పేట్టే ప్రయత్నం చేసింది. 12లక్షల యాప్స్‌ను నిషేధించింది. దీంతో పాటు స్పామ్ డెవలపర్స్‌గా అనుమానిస్తున్న 2లక్షల యాప్స్‌ను, ఇన్ యాక్టీవ్‌గా ఉన్న మరో 5లక్షల యాప్స్‌ను నిలిపివేసింది.
బ్లాక్ చేసిన యాప్స్‌న‍్నీ తమ విధానాలకు విరుద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. తమ యూజర్ల సెక్యూరిటీకి భరోసా ఇచ్చేలా వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే స్పామ్, మాల్‌వేర్, డేంజరస్ యాప్స్‌లను ఎప్పటికప్పుడు స్కాన్ చేస‍్తూ ఉంటామని గూగుల్ స్పష్టం చేసింది.
చదవండి👉Ludo King Game: భారతీయులు ఈ గేమ్‌ను తెగ ఆడేస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment