దేశీయ స్మార్ట్ ఫోన్ కొనుగోలు దారులకు రియల్‌మీ శుభవార్త చెప్పింది. బడ్జెట్ ధరలో రియల్‌మీ సీ30ఫోన్‌ను ఈనెల 20న కొత్త ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే ఇప్పుడు ఆ ఫోన్ స్పెసిఫికేషన్‌తో పాటు ధర ఎంతో తెలుసుకుందాం.
రియల్‌మీ సీ30 పేరుతో మార్కెట్‌కు పరిచయం కానున్న ఈ ఫోన్‌లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా,సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2 జీబీ ర్యామ్ ప్లస్ 32 జీబీ స్టోరేజ్, 3 జీబీ ర్యామ్ ప్లస్ 32 జీబీ స్టోరేజ్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ, వైఫై, బ్లూటూత్, 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్, చార్జింగ్ కోసం మైక్రో యూఎస్‌బీ పోర్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
రియల్‌మీ సీ30 ధర
బడ్జెట్ ధరలో రియల్‌మీ సీ30 లభ్యం కానుంది. లైట్ వెయిట్, స్టెలిష్ లుక్ రానున్న ఈ ఫోన్ ధర 7వేలు ఉండొచ్చని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment