
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటరోలా యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది. మోటరోలా కొత్త స్మార్ట్ ఫోన్ నేటి నుంచి సేల్స్ ప్రారంభించింది. అయితే ఈ సేల్ సందర్భంగా కొనుగోలు దారులు అతి తక్కువ ధర అంటే కేవలం రూ.549కే స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తుంది.
మోటో జీ22 ఫీచర్లు
బుధవారం నుంచి మోటరోలా కొత్త ఫోన్ మోటో జీ22ను ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభించింది. ఈ ఫోన్ అసలు ధర రూ.13,999 ఉండగా ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ ద్వారా రూ. 549 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్ డిస్ ప్లే 6.5 అంగుళాల హెచ్‌డీపీ ప్లస్ ఐపీఎల్ ఎల్‌సీడీ, 5,000ఎంఏహెచ్, 4జీబీ ర్యామ్ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సదుపాయం ఉంది. దీంతో పాటు మెయిన్ కెమెరా 50 ఎంపీ సెన్సార్, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, మీడియా టెక్ హీలియా జీ37 ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ ఫోన్‌పై స్పెషల్ ఆఫర్లు
ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్‌లో ఈ ఫోన్ ధర రూ.13,999 ఉండగా..ఈ ఫోన్‌పై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ అందించే 21 శాతం డిస్కౌంట్‌తో రూ.10,999కే కొనుగోలు చేయోచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై వెయ్యి తగ్గింపుతో రూ. 9,999 వద్దకు చేరుతుంది. దీంతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ లో పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌తో రూ. 549 ధరకే కొనుగోలు చేయోచ్చు. అయితే ఈ కొనుగోలుపై బ్యాంకు లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్లలో ఏదో ఒకటి మాత్రమే పొందవచ్చు.
చదవండి: స్మార్ట్ ఫోన్‌లను ఎగబడి కొంటున్న జనం, ఎగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డ్‌లు!
Comments
Please login to add a commentAdd a comment