exchange amount
-
రూ.549లకే స్మార్ట్ ఫోన్..! అదిరిపోయే ఫీచర్లతో..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటరోలా యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది. మోటరోలా కొత్త స్మార్ట్ ఫోన్ నేటి నుంచి సేల్స్ ప్రారంభించింది. అయితే ఈ సేల్ సందర్భంగా కొనుగోలు దారులు అతి తక్కువ ధర అంటే కేవలం రూ.549కే స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. మోటో జీ22 ఫీచర్లు బుధవారం నుంచి మోటరోలా కొత్త ఫోన్ మోటో జీ22ను ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభించింది. ఈ ఫోన్ అసలు ధర రూ.13,999 ఉండగా ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ ద్వారా రూ. 549 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్ డిస్ ప్లే 6.5 అంగుళాల హెచ్‌డీపీ ప్లస్ ఐపీఎల్ ఎల్సీడీ, 5,000ఎంఏహెచ్, 4జీబీ ర్యామ్ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సదుపాయం ఉంది. దీంతో పాటు మెయిన్ కెమెరా 50 ఎంపీ సెన్సార్, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, మీడియా టెక్ హీలియా జీ37 ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌పై స్పెషల్ ఆఫర్లు ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్‌లో ఈ ఫోన్ ధర రూ.13,999 ఉండగా..ఈ ఫోన్‌పై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ అందించే 21 శాతం డిస్కౌంట్‌తో రూ.10,999కే కొనుగోలు చేయోచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై వెయ్యి తగ్గింపుతో రూ. 9,999 వద్దకు చేరుతుంది. దీంతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ లో పాత ఫోన్ ఎక్స్ఛేంజ్తో రూ. 549 ధరకే కొనుగోలు చేయోచ్చు. అయితే ఈ కొనుగోలుపై బ్యాంకు లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్లలో ఏదో ఒకటి మాత్రమే పొందవచ్చు. చదవండి: స్మార్ట్ ఫోన్లను ఎగబడి కొంటున్న జనం, ఎగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డ్‌లు! -
బ్యాంకులకు చేరిన 8.44 వేల కోట్ల పాత కరెన్సీ
హైదరాబాద్: మార్కెట్ లో 500, 1000 నోట్లను రద్దు చేసిన తర్వాత బ్యాంకులు, ఏటీఎంల నుంచి డబ్బు తీసుకోవడం ఎంతో గగనమైపోయింది. ఎక్కడ చూసినా ఏటీఎంలు ఖాళీగా ఉండటంతో పాటు బ్యాంకుల్లోనూ డబ్బు లేకపోవడంతో జనం అల్లాడుతున్నారు. అప్పుడప్పుడు అక్కడక్కడ ఏటీఎంల్లో డబ్బు పెట్టినా క్షణాల్లో ఖాళీ అవుతున్నాయి. 500, 1000 నోట్లను రద్దు చేసి 20 రోజులు గడుస్తున్నప్పటికీ కష్టాలు తీరడం లేదు. మరో రెండు రోజుల్లో ఒకటో తారీఖు వస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే, నవంబర్ 10 వ తేదీ నుంచి 27వ తేదీ వరకు లెక్కలు పరిశీలిస్తే విస్మయకర విషయాలు తెలుస్తున్నాయి. నవంబర్ 10 నుంచి 27 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా రూ. 8,44,982 కోట్ల రూపాయలు (పాత నోట్లు) బ్యాంకుల్లో జమయ్యాయి. ఇందులో 8,11,033 కోట్ల రూపాయల పాత నోట్లు ఆయా ఖాతాల్లో డిపాజిట్ల రూపేణా జమ కాగా, 33,948 కోట్ల రూపాయలు మార్పిడి (పాత నోట్లు ఇచ్చి కొత్త నోట్లు తీసుకోవడం) ద్వారా చేరాయి. ఈ లెక్కన 18 రోజుల వ్యవధిలో రద్దయిన 500, 1000 నోట్లు ఇప్పటివరకు మొత్తంగా 8.44 వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లోకి చేరాయని రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) సోమవారం ప్రకటించింది. 8.44 వేల కోట్ల రూపాయల మేరకు బ్యాంకుల్లో డిపాజిట్ అయినప్పటికీ ప్రజలు తిరిగి తీసుకున్న డబ్బు మాత్రం చాలా తక్కువగా ఉంది. నవంబర్ 10 నుంచి 27 నవంబర్ మధ్య కాలంలో ఆయా బ్యాంకు కౌంటర్లు, ఏటీఎంల ద్వారా ప్రజలు తీసుకున్న మొత్తం 2,16,617 రూపాయలు. అంటే ప్రజలు డిపాజిట్ చేసిన సొమ్ము 8.44 వేల కోట్లు కాగా విత్ డ్రా చేసింది మాత్రం 2.16 వేల కోట్ల రూపాయలు మాత్రమేనని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.