బ్యాంకులకు చేరిన 8.44 వేల కోట్ల పాత కరెన్సీ | Withdrawal of Legal Tender banknotes 2.16 crore during November 10 to 27 in 2016 | Sakshi
Sakshi News home page

బ్యాంకులకు చేరిన 8.44 వేల కోట్ల పాత కరెన్సీ

Published Mon, Nov 28 2016 10:34 PM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM

బ్యాంకులకు చేరిన 8.44 వేల కోట్ల పాత కరెన్సీ

బ్యాంకులకు చేరిన 8.44 వేల కోట్ల పాత కరెన్సీ

హైదరాబాద్:
మార్కెట్ లో 500, 1000 నోట్లను రద్దు చేసిన తర్వాత బ్యాంకులు, ఏటీఎంల నుంచి డబ్బు తీసుకోవడం ఎంతో గగనమైపోయింది. ఎక్కడ చూసినా ఏటీఎంలు ఖాళీగా ఉండటంతో పాటు బ్యాంకుల్లోనూ డబ్బు లేకపోవడంతో జనం అల్లాడుతున్నారు. అప్పుడప్పుడు అక్కడక్కడ ఏటీఎంల్లో డబ్బు పెట్టినా క్షణాల్లో ఖాళీ అవుతున్నాయి. 500, 1000 నోట్లను రద్దు చేసి 20 రోజులు గడుస్తున్నప్పటికీ కష్టాలు తీరడం లేదు. మరో రెండు రోజుల్లో ఒకటో తారీఖు వస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.

అయితే, నవంబర్ 10 వ తేదీ నుంచి 27వ తేదీ వరకు లెక్కలు పరిశీలిస్తే విస్మయకర విషయాలు తెలుస్తున్నాయి. నవంబర్ 10 నుంచి 27 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా రూ. 8,44,982 కోట్ల రూపాయలు (పాత నోట్లు) బ్యాంకుల్లో జమయ్యాయి. ఇందులో 8,11,033 కోట్ల రూపాయల పాత నోట్లు ఆయా ఖాతాల్లో డిపాజిట్ల రూపేణా జమ కాగా, 33,948 కోట్ల రూపాయలు మార్పిడి (పాత నోట్లు ఇచ్చి కొత్త నోట్లు తీసుకోవడం) ద్వారా చేరాయి. ఈ లెక్కన 18 రోజుల వ్యవధిలో రద్దయిన 500, 1000 నోట్లు ఇప్పటివరకు మొత్తంగా 8.44 వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లోకి చేరాయని రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) సోమవారం ప్రకటించింది.

8.44 వేల కోట్ల రూపాయల మేరకు బ్యాంకుల్లో డిపాజిట్ అయినప్పటికీ ప్రజలు తిరిగి తీసుకున్న డబ్బు మాత్రం చాలా తక్కువగా ఉంది. నవంబర్ 10 నుంచి 27 నవంబర్ మధ్య కాలంలో ఆయా బ్యాంకు కౌంటర్లు, ఏటీఎంల ద్వారా ప్రజలు తీసుకున్న మొత్తం 2,16,617 రూపాయలు. అంటే ప్రజలు డిపాజిట్ చేసిన సొమ్ము 8.44 వేల కోట్లు కాగా విత్ డ్రా చేసింది మాత్రం 2.16 వేల కోట్ల రూపాయలు మాత్రమేనని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement