చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ రియల్ మీకి చెందిన రియల్ మీ ఎక్స్‌టీ ఫోన్ పేలింది. ట్విట్టర్ యూజర్ తన స్నేహితుడి ఫోన్ పేలిందని ట్వీట్ చేశాడు. అయితే ఆ ట్వీట్‌పై రియల్ మీ యాజమాన్యం స్పందించింది.
My friend's phone Realme XT blast in the evening today....@MadhavSheth1 please do something 🙏 pic.twitter.com/CrCnaOKnIK
— Sandip Kundu (@SandipK75709658) December 28, 2021
డిసెంబర్ 28న ట్విట్టర్ యూజర్ సందీప్ కుండు తన స్నేహితుడు వారం రోజుల క్రితం కొన్న రియల్ మీ ఫోన్ పేలిందంటూ ట్వీట్ చేశాడు. రియల్ మీ వైస్ ప్రెసిడెంట్
మాధవ్ సేథ్ ట్వీట్ కు ట్యాగ్ చేశాడు. ట్యాగ్ చేయడంతో పేలుడు ఘటనపై రియల్‌మి ఇండియా ట్విట్టర్ అఫీషియల్ సపోర్టు అకౌంట్ బాధితుడికి క్షమాపణలు తెలిపింది.
అంతేకాదు బాధిత యూజర్ కాంటాక్ట్ వివరాలను పంపాల్సిందిగా కోరింది. కొన్ని గంటల తర్వాత కంపెనీ స్పందిస్తూ.. పేలిన ఫొన్ భాగాలను తీసుకుని దగ్గరలోని అధికారిక రియల్ మి సర్వీసు సెంటర్ కు తీసుకెళ్లాల్సిందిగా సూచించింది. అయితే ఆ ఫోన్ ఎందుకు పేలింది. ఆ ఫోన్‌ను ఎప్పుడు కొనుగోలు చేశారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment