![Amazon India Announces Back To College Sale - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/13/amazon.jpg.webp?itok=JAGHD4aB)
కరోనా రాకతో స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి. విద్యార్థుల కేవలం ఇంటికే పరిమితమయ్యారు. విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం కాకుండా ఉండడం కోసం ప్రభుత్వాలు ఆన్‌లైన్ విద్యను అమలులోకి తెచ్చాయి. టీచర్లు విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనే క్లాసులను బోధిస్తున్నారు. కాగా నూతన విద్యా సంవత్సరం కోసం విద్యార్థులు వారి తల్లిదండ్రులు సన్నద్ధమవుతున్నారు. నూతన విద్యా సంవత్సరంలోకి అడుగుపెడుతున్న విద్యార్థులకు, టీచర్ల కోసం అమెజాన్ ఇండియా ‘బ్యాక్ టూ కాలేజ్’ పేరిట సేల్‌ను ప్రారంభించింది.
బ్యాక్ టూ కాలేజ్ సేల్ జూలై 31 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ సేల్‌లో భాగంగా ల్యాప్ టాప్‌లు, హెడ్‌ఫోన్స్, స్పీకర్స్, ఇతర గాడ్జెట్స్‌పై 50 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. ఎంపిక చేయబడిన గాడ్జెట్స్‌పై విద్యార్థులకు ఎడ్‌టెక్ యాప్స్ నుంచి డేటా సైన్స్, డిజిటల్ మార్కెటింగ్ వంటి కోర్సులపై ఆఫర్లను పొందవచ్చును.
ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ కొనుగోలు చేస్తే వేదాంతు, టాప్పర్, అవిష్కార్, ప్రోగ్రాడ్, డిజిటల్ విద్యా వంటి ఎడ్యుకేషన్ యాప్‌లోని ఆన్‌లైన్ కోర్సులపై సుమారు రూ.20,000 వరకు తగ్గింపును అందిస్తోంది. నో కాస్ట్ ఈఎమ్‌ఐ ద్వారా కూడా గాడ్జెట్స్‌ను కొనుగోలు చేసేందుకు అమెజాన్ వీలు కల్పిస్తోంది. హెచ్‌పీ పెవిలియన్ కోర్ i5 11thGen ల్యాప్‌టాప్‌పై రూ. 10,000 తగ్గింపుతో రూ. 66, 940 కు అందించనుంది. ఇతర ల్యాప్‌టాప్ కొనుగోళ్లపై అడిషనల్ కూపన్లను అందించనుంది.
Comments
Please login to add a commentAdd a comment