న్యూఢిల్లీ: రెడ్‌మీ బ్రాండ్ యొక్క మొట్టమొదటి స్మార్ట్ బ్యాండ్ ఫిట్‌నెస్ ట్రాకర్ సెప్టెంబర్‌లో 5న రూ.1,599($22) ధరతో భారతదేశంలో విడుదలైన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు, ఈ ఫిట్‌నెస్ ట్రాకర్‌ను రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా మీకు రూ.999($ 13.69)కి లభిస్తుంది. భారతదేశపు అతిపెద్ద ఈ కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ ఇండియా రిపబ్లిక్ డే సేల్ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. షియోమీ దాదాపు అన్ని దేశాలలో ఎంఐ, రెడ్‌మీ బ్రాండెడ్ ఉత్పత్తుల మీద డిస్కౌంట్ అందిస్తోంది. రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ లో 1.08-అంగుళాల టిఎఫ్‌టి ఎల్‌సిడి కలర్ ప్యానెల్, టచ్ ఇన్‌పుట్, 24 గంటల హార్ట్ బీట్ మానిటరింగ్, 5 స్పోర్ట్స్ మోడ్‌లు, బ్లూటూత్ 5.0 ఎల్‌ఇ, యాప్ నోటిఫికేషన్‌లు, 5 ఎటిఎం వాటర్ రెసిస్టెంట్, 14 రోజుల బ్యాటరీ లైఫ్ , యుఎస్బి ఛార్జింగ్ వంటి మరిన్ని ఆప్షన్స్ కలిగి ఉంది.(చదవండి: ఫేస్‌బుక్‌కు పోటీగా దూసుకెళ్తున్న 'మీవే' యాప్)
బడ్జెట్ లో రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్
Published Thu, Jan 21 2021 10:57 AM | Last Updated on Thu, Jan 21 2021 2:04 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment