బెంగళూరు : ఈ-కామర్స్ రంగంలో దూసుకుపోతున్న అమెజాన్.. కొత్త ఏడాది సందర్భంగా భారత్‌లో కూడా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అడుగుపెట్టబోతుంది. వచ్చే ఏడాది జనవరిలో అమెజాన్ ఇండియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. టెనోర్ బ్రాండు పేరుతో అమెజాన్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తుందని రిపోర్టులు పేర్కొన్నాయి. టినోర్ ఈ, టినోర్ జీ పేరుతో రెండు మోడల్స్ స్మార్ట్‌ఫోన్లను అమెజాన్ లాంచ్ చేస్తుందని తెలిపాయి. రెండు నెలల క్రితమే అమెజాన్ ఇండియాకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ప్రైవేట్ లేబుల్ బిలియన్ కింద ఇన్-హౌజ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. మొత్తంగా మొబైల్స్, టాబ్లెట్ మార్కెట్ వార్షికంగా 8.5 బిలియన్ డాలర్ల నుంచి 9 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని రెడ్‌షీర్ కన్సల్టింగ్ సీఈవో అనిల్ కుమార్ తెలిపారు.
ప్రైవేట్ లేబుల్ మార్కెట్ కింద భారత్‌లో స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయడం ప్రస్తుతం నవశతకమని నిపుణులు చెప్పారు. ప్రైవేట్ లేబుల్ స్మార్ట్‌ఫోన్లు ఎక్కువగా లోకల్, లో బ్రాండు, మిడిల్ బ్రాండు స్మార్ట్‌ఫోన్ల బలాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయని, ఇది 20 శాతం మార్కెట్‌ను కలిగి ఉన్నట్టు అనిల్ కుమార్ పేర్కొన్నారు. ఈ ప్రైవేట్ లేబుల్స్‌కు 2 బిలియన్ డాలర్ల అవకాశాలున్నాయన్నారు. స్మార్ట్‌ఫోన్లకు మాత్రమే కాక, స్టాపుల్స్, ఫ్యాషన్, ఎలక్ట్రిక్ యాక్ససరీస్ వంటి కేటగిరీలకు అమెజాన్ ఇండియాలో సోలిమో, సింబల్, మిక్స్ వంటి ప్రైవేట్ లేబుల్స్ ఉన్నాయి. దేశంలో తన గ్లోబల్ బ్రాండు అమెజాన్ బేసిక్స్‌ను కూడా విక్రయిస్తోంది. ఫైర్ బ్రాండు కింద అమెజాన్ గ్లోబల్‌గా తన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment