రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ విభాగమైన రిలయన్స్ రిటైల్ వెంచర్స్, కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్‌తో చేసుకున్నకొనుగోలు ఒప్పందం గడువు ముగిసిపోవడంతో, ఇప్పుడు రిలయన్స్ రిటైల్ ఆ గడువును మరో ఆరు నెలలు పొడిగించింది. గతంలో చేసుకున్న ఒప్పందం గడువు మార్చి 31, 2021 నాటికి ముగిసిపోయింది. తాజాగా కొనుగోలు ఒప్పందం గడువు సెప్టెంబరు 30, 2021కి మార్చినట్లు రిలయన్స్ ప్రకటించింది.
ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ గత ఏడాది కొనుగోలు ఒప్పందం చేసుకుంది. ఈ కొనుగోలు ఒప్పందం విలువ
రూ.24,713 కోట్లు. ఫ్యూచర్ గ్రూప్‌లో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కు వాటాలున్నాయి. అయితే, రిలయన్స్ రిటైల్ వెంచర్స్, ఫ్యూచర్ గ్రూప్‌తో చేసుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకిస్తుంది. ప్రస్తుతం ఈ ఒప్పందం చట్టపరమైన అడ్డంకులను ఎదుర్కొంటోంది. ఈ-కామర్స్ దిగ్గజం దాఖలు చేసిన పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉంది. 2020 ఆగస్టు 29న ప్రకటించిన ఫ్యూచర్-రిలయన్స్ ఒప్పందం, సిసిఐ, సెబీ, బోర్సెస్ వంటి రెగ్యులేటర్ల నుంచి ఇప్పటికే క్లియరెన్స్ పొందింది. ఈ ఒప్పంద ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు అడ్డంకులు ఏర్పడటంతో రిలయన్స్ గడువును పొడిగించాల్సి వచ్చింది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment